S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/03/2017 - 03:39

హైదరాబాద్, డిసెంబర్ 2: నగరంలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న కరుడగట్టిన చైన్ స్నాచర్‌ను నార్త్‌జోన్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 15.5 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం..నెరెడ్‌మెట్ సఫిల్‌గూడకు చెందిన కొలాజి ఫరూఖ్ (27) ఎయిర్ టెల్ కంపెనీలో టెలి కాలర్‌గా పనిచేస్తున్నాడు.

12/03/2017 - 03:39

హైదరాబాద్, డిసెంబర్ 2: హైదరాబాద్ నగరశివారుల్లో విదేశీ బ్రాండ్ల పేరుతో సిగరెట్ల అక్రమ దందా యదేచ్ఛగా సాగుతోంది. సమాచారం అందుకున్న డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ఓ స్థావరంపై దాడి చేశారు. భారీగా విదేశీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. అరబ్ దేశాలు, లండన్‌లో తయారు చేసిన రూ. 6.33 కోట్లు విలువ చేసే సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు.

12/03/2017 - 03:38

హైదరాబాద్, డిసెంబర్ 2: బంగారు తెలంగాణ నిర్మాణమే ధ్యేయమని, అభివృద్ధే తమ నినాదమని హోంమంత్రి నాయిని నార్సింహారెడ్డి ఉద్ఘాటించారు. శనివారం సిడ్నీలో ఆస్ట్రేలియన్ తెలంగా ఫోరం ఆధ్వర్యంలో ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలను హోంమంత్రి నాయిని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నాయిని మాట్లాడుతూ, ఉస్మానియా విశ్వవిద్యాలయం దేశంలోనే ప్రతిష్టాత్మక యూనివర్సిటీ అని అన్నారు.

12/02/2017 - 04:18

సిద్దిపేట, డిసెంబర్ 1 : తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేందుకు ప్రపంచ తెలుగు మహాసభలను డిసెంబర్ 15 నుండి అట్టహాసంగా నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. తెలుగు భాష గొప్పతనాన్ని, సాహిత్య, సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పెలా మహాసభలను నిర్వహించాలన్నారు.

12/02/2017 - 04:16

నిజామాబాద్, డిసెంబర్ 1: ప్రపంచ తెలుగు మహాసభలను పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో శుక్రవారం అట్టహాసంగా ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. కలెక్టరేట్ గ్రౌండ్ నుండి ప్రధాన వీధుల గుండా రాజీవ్‌గాంధీ ఆడిటోరియం వరకు చేపట్టిన ర్యాలీలో అడుగడుగునా తెలుగుదనం ఉట్టిపడింది.

12/02/2017 - 04:16

సిద్దిపేట, డిసెంబర్ 1 : రేషన్‌డీలర్లు వినకుంటే తొలగిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బెదిరింపులకు పాల్పడుతున్నారని.. రాష్ట్ర వ్యాప్తంగా 18వేల మంది డీలర్లను తొలగించే దమ్ముందా అని తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షుడు వంటేరు ప్రతాప్‌రెడ్డి ప్రశ్నించారు. సీఎం తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరని, ఇది ప్రజస్వామ్యం వ్యవస్థ అని, కోర్టులున్నాయని, నీ జాగీరు కాదన్నారు.

12/02/2017 - 04:15

నర్సంపేట, డిసెంబర్ 1: కనీస వేతనాలు చెల్లిం చి, ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం రేషన్ డీలర్లు నిరవధిక సమ్మెకు దిగారు. దీంతో అన్ని రేషన్ షాపుల్లో రేషన్ పంపిణీ నిలిచిపోయింది. రేషన్ డీలర్లు తమ సమస్యలు పరిష్కరించకపోతే డిసెంబర్ 1వ తేదీ నుండి నిరవధిక సమ్మె కు దిగుతామని ప్రభుత్వానికి నోటీసు ఇచ్చిన విష యం తెల్సిందే.

12/02/2017 - 04:13

భువనగిరి, డిసెంబర్ 1: దేశంలోనే 40వేల కోట్ల రూపాయలతో సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలుచేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, మూడున్నర సంవత్సరాలలోపు దళితుల సంక్షేమానికి 17,465 కోట్ల రూపాయలు కేటాయించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందని రాష్ట్ర విద్యుత్తు, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్వర్‌రెడ్డి తెలిపారు.

12/02/2017 - 03:35

హైదరాబాద్, డిసెంబర్ 1: రాష్ట్రానికో మహిళా విశ్వవిద్యాలయం, జిల్లాకో జవహార్ నవోదయ వంటి గురుకుల విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ అడ్వయిజరీ బోర్డు ఆన్ ఎడ్యుకేషన్ చైర్మన్, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అభిప్రాయపడ్డారు. బాలికల విద్యను ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ శుక్రవారం ఒరిస్సా రాజధాని భువనేశ్వర్‌లో పర్యటించింది.

12/02/2017 - 03:34

హైదరాబాద్, డిసెంబర్ 1: ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా బెంగళూరు, చెన్నై, ఢిల్లీలో హోర్డింగ్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లపై సచివాలయంలో శుక్రవారం ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారితో కలిసి వివిధ శాఖాధిపతులతో ఎస్‌పి సింగ్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.

Pages