S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/30/2017 - 03:38

కొండపాక, నవంబర్ 29. కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల విమానం కూ లిన ఎయిర్ క్రాప్ట్ పరికరాలన్నీ దుద్దెడ గ్రామ శివారులోనే ఉండి ఉంటాయని అనుమానిస్తున్నామని సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఇన్‌చార్జి ఏసీపీ బాలాజీ అన్నారు.

11/30/2017 - 02:46

హైదరాబాద్, నవంబర్ 29: ఇవాంక..ప్రస్తుతం మహానగర వాసుల నోట్లో నానుతున్న పేరు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, యుఎస్ ప్రభుత్వ సలహాదారు అయిన ఆమె ప్రపంచ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సదస్సుకు హాజరయ్యేందుకు నగరానికొచ్చిన సంగతి తెలిసిందే! ప్రస్తుతం గచ్చిబౌలీలోని ట్రైడెంట్ హోటల్‌లో బస చేస్తున్న ఇవాంక చారిత్రక కట్టడమైన గోల్కొండ కోటను మధ్యాహ్నాం మూడు గంటలకు సందర్శించారు.

11/30/2017 - 02:44

హైదరాబాద్, నవంబర్ 29: ప్రభుత్వాలు ఎన్ని చేసినా ఆర్ధిక మద్దతు లేనిదే మహిళలకు సాధికారత సాధ్యం కాదని ఇవాంక ట్రంప్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రపంచ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సదస్సులో రెండో రోజు పారిశ్రామికతలో మహిళల వాటా పెంచడంపై చర్చాగోష్టి జరిగింది.

11/30/2017 - 02:40

హైదరాబాద్, నవంబర్ 29: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె, శే్వతసౌధం సీనియర్ సలహాదారు ఇవాంక ట్రంప్ భారతీయుల హృదయాల్లో మరీ ముఖ్యంగా హైదరాబాద్ ప్రజల హృదయాల్లో చిరస్మరణీయమైన ముద్ర వేశారు. 28వ తేదీ ఉదయం 3 గంటలకు రాజధాని నగరానికి వచ్చిన ఇవాంక 29వ తేదీ రాత్రి 10.20 గంటలకు అరబ్ ఎమిరేట్స్ విమానంలో దుబై మీదుగా అమెరికాకు తిరుగు ప్రయాణం అయ్యారు.

11/30/2017 - 02:39

హైదరాబాద్, నవంబర్ 29: మహిళల ఆర్ధిక స్థితిని పెంపొందించడం ద్వారా ఆమెకు సాధికారత దక్కుతుందనే నినాదంతో మొదలైన మూడు రోజుల ప్రపంచ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సదస్సు గురువారం సాయంత్రం ముగియనుంది. నాలుగు దేశాలు, 14 రాష్ట్రాలు పోటీ పడినా చివరికి ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు నిర్వహించే అవకాశం తెలంగాణకు దక్కడంతో ప్రభుత్వం దానిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నాలుగు కీలక థీమ్‌లతో సదస్సు మొదలైంది.

11/30/2017 - 02:37

హైదరాబాద్, నవంబర్ 29: ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు హాజరైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఉండగా పోలీసులకు ఓ ఆగంతకుడి నుంచి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. అయితే భద్రత కారణాల దృష్ట్యా పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. మంగళవారం జీఈఎస్‌లో పాల్గొని డిన్నర్ కోసం ఇవాంకా, మోదీ ఫలక్‌నుమా ప్యాలెస్‌కు చేరుకున్నారు.

11/30/2017 - 02:35

న్యూఢిల్లీ, నవంబర్ 29: రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే నీటి పారుదల ప్రాజెక్టులకు అవసమైన అటవీ, పర్యావరణ అనుమతులను వేగంగా మంజూరయ్యేలా ‘సిండికేట్ పాలసీ’ని తీసుకురావాలని కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు.

11/30/2017 - 02:32

హైదరాబాద్, నవంబర్ 29: తెలంగాణ సామాజిక, ఆర్థిక, ఉత్పత్తుల గణాంకాలపై ప్రణాళికశాఖ ముద్రించిన వార్షిక పుస్తకాన్ని నీతి అయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్‌కుమార్‌తో కలిస ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఆవిష్కరించారు. ప్రగతి భవన్‌లో బుధవారం నీతి అయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజకుమార్, సభ్యుడు డాక్టర్ రమేశ్ చంద్ బుధవారం ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు.

11/30/2017 - 02:30

హైదరాబాద్, నవంబర్ 29: మహిళలు ఆర్ధికంగా నిలదొక్కుకున్నపుడే ఆ సమాజం ముందడుగు వేసినట్టని ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ పేర్కొన్నారు. ప్రపంచంలో మహిళలకు ఈ సదస్సు కొత్త శక్తిని ఉత్సాహాన్ని ఇచ్చిందని అన్నారు. ప్రపంచ సుందరికి దక్కిన కిరీటంతో సహా ఆమె బుధవారం నాడు సదస్సులో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాకశాస్త్ర ప్రావీణురాలు వికాస్ ఖన్నా, నటి అదితి రావు హైదరితో పాటు మానుషి కూడా సభలో మెరిశారు.

11/30/2017 - 02:16

న్యూఢిల్లీ, నవంబర్ 29: తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తలను అలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఖండించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌ను వీడేదిలేదని ఆయన స్పష్టం చేశారు. ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ కార్యాలయంలో బుధవారం మేఘాలయ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ రిటర్నింగ్ అధికారుల సమావేశానికి ఎమ్మెల్యే సంపత్ కుమార్ హాజరయ్యారు.

Pages