S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/26/2017 - 23:22

హైదరాబాద్, ఆగస్టు 26: వికారాబాద్ జిల్లా అనంతగిరి అటవీ ప్రాంతంలో ఆధునిక హంగులతో నిర్మించతలపెట్టిన 50 పడకల ఆయుర్వేద (ఆయుష్) దవాఖానాకు ప్రభుత్వం స్థలం కేటాయించింది. ప్రస్తుతం ఈ అటవీ ప్రాంతంలో టిబి దవాఖానా నడుస్తోంది. ఈ దవాఖానా పరిధిలోనే 24,176 చదరపు అడుగుల స్థలాన్ని ఆయుష్‌కు కేటాయిస్తూ ప్రభుత్వ వైద్య ఆరోగ్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివార్ పేరుతో శనివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.

08/26/2017 - 23:21

హైదరాబాద్, ఆగస్టు 26: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా వివిధ శాఖలకు కేటాయించిన లక్ష్యాలకు అనుగుణంగా మొక్కలు నాటి కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ అన్నారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమంపై శనివారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది.

08/25/2017 - 02:47

విజయవాడ, ఆగస్టు 24: మూడో విడత రైతు ఉపశమనం కింద రూ.3,600 కోట్లు త్వరలో విడుదల చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వెల్లడించారు. వేరుశనగకు బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసే రైతులకు రూ.105 కోట్ల విలువైన విత్తనాలు ఉచితంగా అందజేయనున్నట్లు మంత్రి ప్రకటించారు.

08/25/2017 - 02:44

గద్వాల, ఆగస్టు 24: గద్వాల సంస్థానం ద్వారా గత 350 సంవత్సరాల నుండి ఏరువాడ జోడు పంచెలు తయారు చేసి తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు సమర్పించే ఆనవాయితీని ఈ సంవత్సరం కూడా కొనసాగిస్తుండటం చాలా సంతోషకరమైన విషయమని జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్‌సైనీ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని మహంకాలి కరుణాకర్ ఇంటిలో తయారు చేస్తున్న ఏరువాడ జోడు పంచెలు తయారీని కలెక్టర్ పరిశీలించారు.

08/25/2017 - 02:42

బచ్చన్నపేట, ఆగస్టు 24: ఓ రైతును మైసమ్మ దున్నపోతు పొడిచి చంపిన సంఘటన గురువారం సాయంత్రం ఆలింపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. సంఘటన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన పాకాల సాయిలు(42) వ్యవసాయ పనులకు వెళ్లి ఇంటికి వస్తున్నాడు. నిత్యం జనాన్ని బెదిరిస్తున్న మైసమ్మ దున్నపోతు సాయిలుకు తారసపడింది. అది పొడుస్తందనే భయంతో సాయిలు పరుగెత్తడం మొదలుపెట్టాడు.

08/25/2017 - 02:42

పెద్దపల్లి రూరల్, ఆగస్టు 24: మండలంలోని రాఘవాపూ ర్ గ్రామ సమీపంలో గల రెడ్డి ఫంక్షన్ హాల్‌లో బుధవారం కాళేశ్వరం ప్రాజెక్టుల నిర్మాణంపై జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ సభలో గొడవకు సంబంధించి మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీ్ధర్ బాబు సహా 300 మంది కాంగ్రెస్ నాయకులు, రైతులపై బసంత్‌నగర్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.

08/25/2017 - 02:41

హుస్నాబాద్, ఆగస్టు 24: హుస్నాబాద్‌కు కోటి నలబైలక్షలతో20 గుంటల స్థలంలో గిరిజన భనాన్ని నిర్మిస్తామని దీనితో పాటు డివిజన్ కేంద్రమైన హుస్నాబాద్‌కు గిరిజనాభివృద్ధి సంస్థను నెలకొల్పి అధికారిని నియమిస్తామని రాష్ట్ర భారీనీటిపారుదల శాఖ మంత్రి తన్నీరుహరీశ్‌రావు అన్నారు.

08/25/2017 - 02:41

హైదరాబాద్, ఆగస్టు 24: దేశ వ్యాప్తంగా ఒబిసి రిజర్వేషన్లను గ్రూప్‌లుగా వర్గీకరించాలని కేంద్ర మంత్రివర్గంలో నిర్ణయించడం పట్ల జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణ య్య ప్రధాని నరేంద్రమోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇది చారిత్రాత్మకమని, బిసిల రెండవ విజయంగా ఆయన అభివర్ణించారు.

08/25/2017 - 02:29

హైదరాబాద్, ఆగస్టు 24: హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్‌లో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మెనేజర్ వినోద్ కుమార్ యాదవ్ గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ రైల్‌లో కార్యక్రమంలో భాగంగా రైల్వే అధికారులతో కలసి ఆయన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా రైల్వే, ప్రయాణీకుల భద్రతపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. భద్రత తనిఖీల్లో భాగంగా రైల్వే ట్రాక్‌లను పరిశీలించారు.

08/25/2017 - 02:27

హైదరాబాద్, ఆగస్టు 24: కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు దాదాగిరి చేస్తే సిఎల్‌పి నాయకుడు జానారెడ్డి వారికి వత్తాసు పలుకుతున్నారని నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు.

Pages