S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/15/2017 - 02:48

సంగారెడ్డి టౌన్, జూలై 14: ఇది రైతు ప్రభుత్వం కాదు.. రాక్షస ప్రభుత్వమని, రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేంత వరకు వారికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గీతారెడ్డి, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిలు పేర్కొన్నారు.

07/15/2017 - 02:45

సంగారెడ్డి, జూలై 14: మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందని ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ స్పష్టం చేసా రు. శుక్రవారం పటాన్‌చెరు మండలం నందిగామ గ్రామ సమీపంలో డాక్టర్ అబ్దుల్ కలాం గ్రీన్ ఇండస్ట్రీయల్ పార్క్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

07/15/2017 - 02:43

కరీంనగర్, జూలై 14: మానవ మనుగడ కోసం మొక్కలు నాటాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. పర్యావరణ పరిరక్షణకు హరితహా రం కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ముం దుకురావాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ కమీషనరేట్ పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం పద్మనగర్‌లోని మార్క్‌ఫెడ్ మైదానం ఆవరణలో హరితహారం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా 14ఎకరాల విస్తీర్ణంలో సుమారు ఐదువేల మంది ఏడువేల మొక్కలను నాటారు.

07/15/2017 - 02:15

హైదరాబాద్, జూలై 14 తెలంగాణలో డిఫెన్స్ ఇంక్యూబేటర్‌ను ఏర్పాటు చేయడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయని ఐటీ శాఖ మంత్రి కె తారకరామారావు అన్నారు. టి-హబ్ ఏర్పాటు చేసిన ఇంక్యూబేటర్ విజయవంతం కావడంతో అదే స్ఫూర్తితో డిఫెన్స్ ఇంక్యూబేటర్‌ను ఏర్పాటు చేయడానికి రాష్ట్రంలో పరిస్థితులు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నాయన్నారు.

07/15/2017 - 02:14

హైదరాబాద్, జూలై 14: తెలంగాణ రాష్ట్రంలో బ్రాహ్మణ కుటుంబాలకు ఆరోగ్య బీమాను అమలు చేస్తామని బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ డా3క్టర్ కెవి రమణాచారి తెలిపారు. ఆరోగ్య బీమాకు సాలీనా రూ. 4900 అవుతుందని, ఇందులో వెయ్యి రూపాయలను చెల్లిస్తే, మిగిలిన రూ.3900ను పరిషత్ భరిస్తుందన్నారు. ఒక కుటుంబంలో నలుగురికి ఇది వర్తిస్తుందన్నారు. ఈ బీమాను నేషనల్ ఇన్స్యురెన్స్ కంపెనీ లిమిటెడ్ అమలు చేస్తుందన్నారు.

07/15/2017 - 02:12

హైదరాబాద్, జూలై 14: నార్కోటిక్స్ విక్రయం, వినియోగం రెండింటినీ నియంత్రించేందుకు తగిన చర్యలు తీసుకోవల్సిందిగా ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కేంద్ర ప్రభుత్వం కోరినట్టు కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సీనియర్ అధికారి పంకజ్ ద్వివేదీతో తెలుగు రాష్ట్రాల్లో మాదక ద్రవ్యాల వినియోగం, యువత ఆరోగ్యంపై అది చూపుతున్న ప్రభావంపై దత్తాత్రేయ చర్చించారు.

07/15/2017 - 01:46

హైదరాబాద్, జూలై 14: కాంగ్రెస్ పార్టీకి చెందిన బిసి నాయకులు శుక్రవారం సమావేశం కావడంతో ఆ పార్టీ ఇతర కులాలకు చెందిన నాయకుల్లో దడ పుట్టించింది. కాంగ్రెస్ బిసి ఫోరం కన్వీనర్ టి. నాగయ్య నేతృత్వంలో పార్టీ బిసి నాయకులంతా లక్‌డికాపూల్‌లోని ఓ హోటల్‌లో సమావేశమయ్యారు. పార్టీలో, ప్రభుత్వాలలో బిసిలకు దక్కాల్సిన వాటా కోసమే తమ ఫోరం ఉద్దేశ్యమే తప్ప ఇది ఎవరికీ వ్యతిరేకం కాదని నాయకులు తమ ప్రసంగాల్లో చెప్పారు.

07/15/2017 - 01:45

హైదరాబాద్, జూలై 14: తెలంగాణ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా బిజెపి పనిచేస్తోందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ పేర్కొన్నారు. శుక్రవారం నాడు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన కార్యకర్తల శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 74 మంది జిల్లా స్థాయి కార్యకర్తలకు యుపి నుండి తీసుకువచ్చిన మోటార్ సైకిళ్లను పంచారు.

07/15/2017 - 01:41

హైదరాబాద్, జూలై 14: ఇండియన్ ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ (ఈఎస్‌డిఎం) పరిశ్రమకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రీమియర్ వాణిజ్య సంస్థ ఇండియా ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీకండక్టర్ అసోసియేషన్ (ఐఈఎస్‌ఏ) తొలిసారి హైదరాబాద్‌లో డిఫ్ట్రానిక్స్ 2017ను నిర్వహిస్తోంది.

07/15/2017 - 01:40

హైదరాబాద్, జూలై 14: తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రేషన్ డీలర్లందరికి గౌరవ వేతనంగా రూ.30 వేలు ప్రతి నెల చెల్లించాలని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సిఎం కెసిఆర్‌ను కోరారు. దీంతో పాటు రేషన్ డీలర్ల పలు డిమాండ్లను కూడా ఆయన సిఎం దృష్టికి తెచ్చారు. డీలర్ల న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చకపోతే ఆగస్టు 1 నుంచి రేషన్ షాపుల నిరవధిక బంద్ పాటిస్తారని హెచ్చరించారు.

Pages