S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/02/2016 - 06:41

హైదరాబాద్, నవంబర్ 1: తెలంగాణ రాష్ట్రంలో యవజన, క్రీడా శాఖలకు సంబంధించి ప్రభుత్వం రూపొందించిన పథకాలు, కార్యక్రమాలు అట్టడుగు వరకు చేరేందుకు వీలుగా సంబంధిత అధికారులంతా పనిచేయాలని రాష్ట్ర యువజన, క్రీడల శాఖ మంత్రి పద్మారావు ఆదేశించారు. క్రీడలు, యువజన సర్వీసుల శాఖలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చిన నేపథ్యంలో 31 జిల్లాల్లో పనిచేస్తున్న జిల్లా అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు.

11/02/2016 - 06:40

హైదరాబాద్, నవంబర్ 1: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి రోజున ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ జవహర్‌లాల్ నెహ్రూను తక్కువ చేసి మాట్లాడడం భావ్యం కాదని ఎఐసిసి నాయకుడు, మాజీ ఎంపి వి. హనుమంత రావు విమర్శించారు. సర్దార్ పటేల్‌ను కాంగ్రెస్ ఎప్పుడూ తక్కువ చేయలేదని ఆయన మంగళవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ చెప్పారు.

11/02/2016 - 03:50

హైదరాబాద్, నవంబర్ 1: తెలంగాణ ఆవిర్భావంతో నష్టం తప్పదన్న ఊహాగానాలను పటాపంచలు చేస్తూ దేశంలోనే రాష్ట్రం నంబర్‌వన్‌గా నిలిచిందని ఐటి, పరిశ్రమల మంత్రి కె తారక రామారావు తెలిపారు. సచివాలయంలో మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సిఎం కెసిఆర్ కోరుకున్న విధంగా సంస్కరణలు తీసుకొచ్చి తెలంగాణను పెట్టుబడులకు అనువైన ప్రాంతంగా తీర్చిదిద్దామన్నారు.

11/02/2016 - 03:47

హైదరాబాద్, నవంబర్ 1: సచివాలయాన్ని కూల్చి వేసి నూతన భవనాలు నిర్మించాలన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనపై హైదరాబాద్ హైకోర్టు తాత్కాలిక బ్రేకు వేసింది. 10 రోజుల వరకూ కూల్చి వేతలు చేపట్టరాదని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సచివాలయంలోని భవనాలను తెలంగాణ ప్రభుత్వం ఎందుకు కూల్చి వేయాలనుకుంటున్నదో వివరాలు తెలియజేస్తూ అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా కోర్టు రాష్ట్ర అడ్వకేట్ జనరల్ కె.

11/02/2016 - 03:38

హైదరాబాద్, నవంబర్ 1: అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రవేశ ఎంపిక పరీక్షల్లో అక్రమాలకు పాల్పడుతున్న వైనాన్ని గుర్తించిన తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్, ఈనెల 11నుంచి జరిగే గ్రూప్-2 రిక్రూట్‌మెంట్‌కు పకడ్బందీ చర్యలు చేపట్టింది. అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు అనుమానిత వస్తువులు తేవొద్దని సూచించింది.

11/02/2016 - 03:32

హైదరాబాద్, నవంబర్ 1: తెలంగాణ రాష్ట్రం వాణిజ్యపన్నుల శాఖలో ఖాళీగా ఉన్న 244 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్. శివశంకర్ పేరుతో మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఖాళీల భర్తీ ప్రక్రియ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు ద్వారా చేపట్టాలని నిర్ణయించారు.

11/01/2016 - 07:32

హైదరాబాద్, అక్టోబర్ 31: సమాజంలో అవినీతి కూడా ఒక రుగ్మతేనని, అవినీతిని రుగ్మతతో, నిజాయితీని ఆరోగ్యంతో పోలుస్తూ నిజాయితీని ప్రోత్సహించడం ద్వారా శరీరానికి లాగే సమాజఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరముందని పాట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి అన్నారు.

11/01/2016 - 07:31

హైదరాబాద్, అక్టోబర్ 31: గ్రామాల అభివృద్ధి ద్వారానే దేశ అభివృద్ధి, పేదరిక నిర్మూలన సాధ్యమని, గ్రామీణాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. రాజేంద్రనగర్‌లోని ఎన్‌ఐఆర్‌డిలో ప్లానింగ్ అండ్ మేనేజ్‌మెంట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్‌పై అంతర్జాతీయ శిక్షణ శిబిరాన్ని మంత్రి కృష్ణారావు ప్రారంభించారు.

11/01/2016 - 07:30

హైదరాబాద్, అక్టోబర్ 31: సర్దార్ వల్లభాయి పటేల్ లేకుంటే తెలంగాణ లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ పేర్కొన్నారు. తెలంగాణ లేకుంటే సిఎంగా కె చంద్రశేఖరరావుకు అవకాశం వచ్చేది కాదని వ్యాఖ్యానించారు. రాష్ట్రీయ ఏక్తా దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించాలని కేంద్రం సూచించినా, టిఆర్‌ఎస్ ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదని లక్ష్మణ్ పేర్కొన్నారు.

11/01/2016 - 07:29

హైదరాబాద్, అక్టోబర్ 31: తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ కె.లక్ష్మణ్‌కు పార్టీ రాష్ట్ర కమిటీని నియమించుకోవడం తలకు మించిన భారమైంది. ఈవారంలో కొత్త కమిటీ ప్రకటించేందుకు అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కొత్త కమిటీలో ప్రస్తుతం ఉన్న వారిలో ఎంత మందికి తిరిగి చోటు దక్కుతుందో, ఎంత మందికి పదవులు ఊడతాయోనన్న ఊహగానాలు, చర్చ పార్టీలో జరుగుతున్నది.

Pages