S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/14/2016 - 15:30

ఆదిలాబాద్: నల్గొండ జిల్లా భువనగిరి సబ్ జైలు నుంచి బదిలీ అయిన సూపరింటెండెంట్ శ్రీనివాస్ అదృశ్యం కావడంపై జైళ్లశాఖ ఉన్నతాధికారులు లక్సెట్టిపేటలో బుధవారం విచారణ చేపట్టారు. భువనగిరి నుంచి శ్రీనివాస్‌ను రెండు రోజుల క్రితం లక్సెట్టిపేట జైలుకు బదిలీ చేశారు. తనను అకారణంగా బదిలీ చేశారని మనస్తాపం చెందిన శ్రీనివాస్ లక్సెట్టిపేట సబ్ జైలుకు వచ్చిన కొద్దిసేపటికే వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆయన ఆచూకీ తెలియరాలేదు.

09/14/2016 - 15:09

హైదరాబాద్‌: నగరంలోని జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, పంజాగుట్ట, అమీర్‌పేట్‌, ఖైరతాబాద్, లక్డీకాపూల్, కోఠి, దిల్‌సుఖ్‌నగర్‌, మియాపూర్‌, చందానగర్‌, జీడిమెట్లలో బుధవారం భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. తెల్లవారుజాము కాచిగూడ మేదరబస్తీలో ఓ పురాతన భవంతి కూలింది.

09/14/2016 - 14:13

హైదరాబాద్‌: నగరంలో గురువారం జరిగే నిమజ్జనం కోసం 25 వేల మంది పోలీసులతో బందోబస్తును , నిరంతర నిఘా కోసం 12వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌ మహేందర్‌రెడ్డి తెలిపారు. నగరంలో పలుచోట్ల ట్రాఫిక్‌ ఆంక్షలు విధించామని, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని పోలీసు కమిషనర్‌ సూచించారు.

09/14/2016 - 14:02

హైదరాబాద్‌: ఉత్తర కోస్తాంధ్ర, దానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, మరోవైపు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కొనసాగతున్నాయని, కోస్తాంధ్రలో రెండ్రోజుల పాటు అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముంద వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.

09/14/2016 - 13:59

హైదరాబాద్‌: జంటనగరాలు, రంగారెడ్డి జిల్లా పరిధిలో వినాయక నిమజ్జనం సందర్భంగా గురువారం సెలవు ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వినాయక నిమజ్జనం నేపథ్యంలో రేపు జంటనగరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. రేపటికి బదులు నవంబర్‌ 12 రెండో శనివారం పనిదినంగా ప్రభుత్వం ప్రకటించింది.

09/14/2016 - 11:50

హైదరాబాద్: హైదరాబాద్‌లో గురువారం వినాయక నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సారి ఖైరతాబాద్ వినాయకుడిని ముందుగానే నిమజ్జనం చేయనున్నారు. ఖైరతాబాద్ గణపతిని బుధవారం అర్థరాత్రి వరకు భక్తులకు దర్శనం కోసం అనుమతినిస్తారు. నిమజ్జనానికి 20వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్‌ మార్గ్‌లో 10, అప్పర్ ట్యాంక్‌బండ్‌పై 24 క్రేన్లను ఏర్పాటు చేశారు.

09/14/2016 - 11:46

హైదరాబాద్‌: యువకుడి వేధింపులు తాళలేక పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన మైలార్‌దేవ్‌పల్లి పీఎస్‌ పరిధిలో లక్ష్మీగూడ హౌసింగ్‌బోర్డు కాలనీలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది. విద్యార్థిని గాయత్రి తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. యువకుడి వేధింపులతో గాయత్రి ఆత్మహత్య చేసుకుందని బంధువులు ఆరోపిస్తున్నారు.

09/14/2016 - 11:42

సికింద్రాబాద్: సికింద్రాబాద్ క్లాక్ టవర్ వద్ద ఎస్‌బీఐలో మంగళవారం అర్ధరాత్రి దుండగులు చోరీకి విఫలయత్నం చేశారు. షట్టర్‌ తాళం పగలకపోవడంతో దుండగులు పారిపోయారు. బుధవారం ఉదయం ఎస్‌బీఐ సిబ్బంది ఫిర్యాదుతో పోలీసులు ఆధారాలు సేకరించేపనిలో నిమగ్నమయ్యారు.

09/14/2016 - 11:52

నల్గొండ: భువనగిరిలోని తన ఇంటి నుంచి మంగళవారం సాయంత్రం లక్సెట్టిపేటకు బయలుదేరిన భువనగిరి సబ్‌ జైలర్‌ శ్రీనివాసరావు ఆచూకీ తెలియలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం శ్రీనివాసరావును అదిలాబాద్‌ జిల్లా లక్సెట్టిపేటకు డిప్యుటేషన్‌పై బదీలీ చేశారు.

09/14/2016 - 05:20

హైదరాబాద్, సెప్టెంబర్ 13: వినాయక నిమజ్జనానికి పోలీసు ఉన్నతాధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఈ నెల 15న భాగ్యనగరంలో జరగనున్న వినాయక నిమజ్జన ఉత్సవం సజావుగా జరిగేలా చూడాలని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఇదివరకే పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.

Pages