S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/28/2018 - 03:47

హైదరాబాద్, సెప్టెంబర్ 27: టీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వలసలు కొనసాగుతున్నాయి. నల్లగొండ జిల్లా పరిషత్ చైర్మన్ బాలు నాయక్, జడ్పీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే కెఎస్ రత్నం గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్‌పీ మాజీ నాయకుడు కె జానారెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. బాలునాయక్ వెంట పెద్ద ఎత్తున కార్యకర్తలు గాంధీభవన్‌కు తరలివచ్చారు.

09/28/2018 - 03:45

హైదరాబాద్, సెప్టెంబర్ 27: ప్రఖ్యాత ధ్వన్యానుకరణ కళాకారుడు , శాసనమండలి మాజీ సభ్యుడు నేరెళ్ల వేణుమాధవ్ పేరిట అవార్డును ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు చెప్పారు. శాసనమండలిలో గురువారం నాడు నేరెళ్ల వేణుమాధవ్ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెడుతూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. తెలంగాణను ప్రపంచ చిత్రపటంలోకి తీసుకువెళ్లిన విశ్వవిఖ్యాత మిమిక్రీ కళాకారుడు వేణుమాధవ్ అని సీఎం కొనియాడారు.

09/28/2018 - 03:45

హైదరాబాద్, సెప్టెంబర్ 27: తెలంగాణలో బడ్జెట్ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, పీజీ కాలేజీల మనుగడ ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో వాటి సమస్యలను ప్రభుత్వానికి, ప్రతిపక్ష పార్టీల రాష్ట్ర అధ్యక్షులకు నివేదించేందుకు బడ్జెట్ విద్యాసంస్థల పరిరక్షణకు ఆత్మగౌరవ సభ ఏర్పాటు చేసినట్టు కేజీ టు పీజీ విద్యాసంస్థల రాష్ట్ర జాక్ చైర్మన్ గింజల రమణారెడ్డి చెప్పారు.

09/28/2018 - 03:44

హైదరాబాద్, సెప్టెంబర్ 27: భారత విద్యార్థి ఫెడరేషన్ 16వ అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ ఆలిండియా అధ్యక్షుడు వీపీ సాను చెప్పారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సిమ్లాలో అక్టోబర్ 30 నుండి నవంబర్ 2వ తేదీ వరకూ జాతీయ మహాసభలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.

09/28/2018 - 03:44

హైదరాబాద్, సెప్టెంబర్ 27: కొండా లక్ష్మణ్ బాపూజీ మృత దేహాన్ని ఖననం చేసిన స్థలంలోనే బీసీ భవనాన్ని నిర్మించాలని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు. మహా గొప్ప వ్యక్తిత్వం ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీ అందరికీ ఆదర్శప్రాయమని, ఆయన జీవితం పాఠ్యపుస్తకాల్లో పాఠ్యాంశంగా చేర్చాలని సూచించారు. ప్రతిష్టాత్మకమైన ట్యాంకు బండ్‌పై ఆయన విగ్రహాన్ని నెలకోల్పాలని దత్తాత్రేయ కోరారు.

09/28/2018 - 03:43

హైదరాబాద్, సెప్టెంబర్ 27: బతుకమ్మ చీరలను 2019 అక్టోబర్ 12 నుండి పంపిణీ చేస్తామని చేనేత, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు మసాబ్ ట్యాంక్‌లోని పురపాలక శాఖ కార్యాలయంలో నిలువ చేసిన బతుకమ్మ చీరలను గురువారం ఆయన పరిశీలించారు.

09/28/2018 - 03:42

హైదరాబాద్, సెప్టెంబర్ 27: శాసనమండలి సభ్యుడు ఎన్ రామచందర్‌రావు రాసిన ‘శాసనమండలి ప్రసంగాలు’ గ్రంథాన్ని మండలి చైర్మన్ కే స్వామిగౌడ్ శుక్రవారం సాయంత్రం ఆవిష్కరించనున్నారు.

09/28/2018 - 03:40

హైదరాబాద్, సెప్టెంబర్ 27: నవంబర్ చివరలో ఎన్నికలు జరగుతాయని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పరోక్షంగా హింట్ ఇచ్చారు. ఎన్నికల కమిషన్ వేగం చూస్తుంటే నవంబర్‌లోనే ఎన్నికలు జరిగేలా ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్ శాసనసభా పక్ష కార్యాలయంలో గురువారం మీడియాతో ఇష్ఠాగోష్ఠిగా ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ప్రజల తీర్పు స్పష్టంగా ఉంటుందన్నారు. ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా దక్కవన్నారు.

09/27/2018 - 06:07

హైదరాబాద్, సెప్టెంబర్ 26: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన అనతికాలంలోనే విద్యారంగంలో అనేక మార్పులు చేపట్టామని, అవన్నీ ఇపుడు సత్ఫలితాలు ఇస్తున్నాయని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి సింగపూర్ విద్యామంత్రి యా కుంగ్ ఒంగ్‌కు వివరించారు. ప్రపంచ విద్యా సదస్సులో పాల్గొనేందుకు రాష్ట్రం నుంచి వెళ్లిన బృందానికి ప్రొఫెసర్ టి పాపిరెడ్డి నాయకత్వం వహిస్తున్నారు.

09/27/2018 - 06:04

హైదరాబాద్, సెప్టెంబర్ 26: రానున్న రోజుల్లో దశల వారీగా ప్రభుత్వ కార్యాలయాల్లో స్మార్ట్ మీటర్లు ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయని దక్షిణ తెలంగాణ విద్యుత్ మండలి సీఎండీ రఘమారెడ్డి తెలిపారు.

Pages