S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహితి

05/01/2016 - 20:50

ఆతడి వాడి వేడి వ్రేళ్లు నిప్పులతో ఆటలాడతాయ
ఎగసిపడే మంటల్ని పొదివి పట్టుకుంటాయ
ఆతడి మరిగిన రక్తం కరిగిన లోహద్రవంతో
పోటీపడి ఉరకలెత్తుతుంది

05/01/2016 - 20:48

ద్రవ్యోల్బణం ‘జాతీయం’ చేయబడింది!
ధరలు అభివృద్ధిపథంలో...
కరెన్సీ ఖరీదు దినదినం తగ్గు
ప్రజల జీవన ప్రమాణం
ధర్మాసుపత్రిలో జీవనరేఖ
భూకంప లేఖిని గీస్తున్న గీతలా
పైకీ కిందకు ఊగిసలాడుతోంది
ఎక్కువ ఓట్లు పొందినవారు
ఎక్కువ ధరలు చెల్లించే స్థితిలో ఉన్నారు
పాపం పేదవాడు
ఓటుకు రేటు తగ్గింది
తప్పు చేశానేమోననీ
తప్పటడుగు వేశానేమోననీ

05/01/2016 - 20:47

అక్షరమా....!!
నా మదిలో మొలిచిన లక్షణమా
ఏకాంత హృదయాన
పంజరాలు పగలగొట్టిన స్వేచ్ఛా విహంగం

జన పథాన అడుగుజాడ
జయ పథాన మువ్వల సవ్వడి సంగీతం
రక్తసిక్త చరిత్రలోన
రాతి గుండె శాసనం
స్వేదమే వేదమై ఎగసిన జయ కేతనం!

04/24/2016 - 21:09

నీ కోసం
మళ్లీ పుట్టి పెరగాలనుంది
నేనెవరో చెప్పాలనుంది

నీతో మాటాడిన ఈ రాత్రి
నాతో కెరటాలు కొట్టుకుంటున్నాయి

ఏదో ప్రచ్ఛాయ నన్ను వెంటాడుతోంది

నాకే అర్థంకాని సంగతులు
నన్ను కలవరపెడుతున్నాయి

నీ కోసం అమృతం తాగాలనుంది
ఏవో తెరలు తొలిగిపోతున్నాయి
దేహం కాలపరీక్షకు నిలవలేక
రూపదీపాలు ఆరిపోతాయి

04/24/2016 - 21:07

పతాక శీర్షికల్లో
రక్త కపోతమై రాలినవాడు

సింహాసనం కింద
సింహమై గర్జించినవాడు

నేడు
నాలుగు పంక్తులకే
పరిమితమై పోయాడు

కొమ్మకొమ్మకూ వేలాడుతున్న
వాడి మృత్యు చిత్రం
కలాలకూ గళాలకూ
దిష్టిబొమ్మలా కనపడుతున్నదేమో

పాడిపంటై పరిమళించిన వాడు
ఎద్దై ఏడ్చినవాడు
నేడు అనాథ కళేబరమై
కుళ్ళిపోతున్నాడు

04/24/2016 - 21:06

చీకటి రాత్రి
తెరలు తెరలుగా జరిగే
ఉల్కాపాతం లాగ
కుప్పలు తెప్పలుగా
సమాచారం
పనికొచ్చేవి పది, పనికిరానివి వేలు, లక్షలు
విలోమ గణితం
తుప్పలు దుబ్బులుగా పెరిగిన పిచ్చిమొక్కల్లోంచి
పూల మొక్కల్ని వెతుక్కోవాల్సిన దుస్థితి
బ్రేకింగ్ న్యూస్
బీపిని బ్రేక్‌డ్యాన్సు చేయస్తూ
ఫ్లాష్ ఫ్లాష్.. అంటూ ఫ్లష్ అవుట్‌లా చెత్త

04/24/2016 - 21:04

వర్తమాన సాహిత్య జగత్తులో ఆర్ష ధర్మాన్ని ఆధునిక భావజాలాన్ని సమన్వయించుకొని ద్వైదీభావం లేని ద్వైతాన్ని అనితర మార్గంగా ఎంచుకొని ప్రయాణిస్తున్న కవి, విమర్శకుడు, పండితుడు ఆచార్య మసన చెన్నప్ప! పాండిత్యం, కవనం, విమర్శనం, వక్తృత్వచాలనం చతుర్ముఖమై సాహితీ ప్రపంచంలో ఉనికిని చాటుకున్న అభ్యుదయశీలి మానవతావాది మసన చెన్నప్ప!

04/24/2016 - 21:03

‘బ్రహ్మరథం’.. సోపాన మార్గం కావాలి

04/24/2016 - 21:02

తెలుగు భాషకు ‘బ్రహ్మరథం’ అనే శీర్షికతో ‘సాహితి’ (11-4-2016)లో వచ్చిన వ్యాసంలో ఎం.వి.ఆర్.శాస్ర్తీగారు తెలుగు భాషకు పట్టిన దుర్గతికి తన ఆవేదనను వ్యక్తం చేశారు. నేటి నవతరానికి వ్యాకరణ నియమాలు, భాషా ప్రమాణాలు, శైలీ శాస్త్రాలు పాత చింతకాయ పచ్చడిలా బూజుపట్టి పోయాయని బాధపడ్డారు. ఇంతవరకు బాగానే వుంది. భాషకు వ్యాకరణం, ఒక పద్ధతి, శైలి వగైరాలు ఉండాల్సిందే. అయితే భాష జడపదార్థం కాదు.

04/24/2016 - 21:01

శివలెంక రాజేశ్వరీదేవి చిరపరిచితమైన కవి. స్వస్థలం
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట. జననం 1954. రచనా వ్యాసంగం 1970లలో ఆరంభించారు. కడవరకు కొనసాగించారు. అరుదైన కవిగా ఆదరణ పొందారు. గత నలభై ఏళ్ళలో ఆమె రచనలు కొన్ని రేడియోలో ప్రసారం కాగా పత్రికల్లో అనేకం
అచ్చయ్యాయి. రాజేశ్వరీదేవి గుంపున ఎప్పుడూ లేరు.
జీవితంలో ఏకాకిగానే తలపడ్డారు. చంద్రుడికి జతగా

Pages