S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహితి

05/08/2016 - 21:18

వాన చినుకులు
సత్తు గినె్నలతో
ఆర్కెస్ట్రా!

గుండెలో ఎంత కన్నీరు
ఘనీభవించిందీ!?
నీకై - అప్పుడప్పుడు కరుగుతూ!!

అంతర్జాల మహిమ!
పుస్తకం -
‘అటకె’క్కింది!!

నీ ఊహా వలపుల తొలకరి
ప్రణయాంకురమే -
నా మది మరి!

తేనెలో చీమను...
నీ ప్రేమని
ఆస్వాదిద్దామనుకున్న నేను...!

05/08/2016 - 21:12

సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ వార్షికోత్సవం సందర్భంగా 2015 సంవత్సరానికి గాను ఉత్తమ తెలుగు సాహిత్య విమర్శకు ‘సహృదయ సాహితీ పురస్కారం’ ఇవ్వాలని నిర్ణయించింది. 2011 నుంచి 2015వరకు అచ్చయిన గ్రంథాలు పురస్కారానికి అర్హమైనవి. రచయితలు పరిశీలనార్థం తమ రచనలను మూడు ప్రతులు 10 జూన్ 2016లోగా చేరేటట్లు కింది చిరునామాకు పంపించాలి. పురస్కారం ఎంపికపై న్యాయనిర్ణేతలదే తుది నిర్ణయం.

05/08/2016 - 21:09

మనిషి మనిషితనాన్ని
మరిచిపోతే,
విస్మరిస్తే...
ఎవరు ‘గురుతు’చేయాలి?
మనిషే...
సృష్టిలో ప్రతీ జీవీ-
జంతువులు, పక్షులు
క్రిమికీటకాదులు అన్నీ
వాటికి నిర్దేశించిన
పనుల్లే అవి చేస్తున్నప్పుడు
మనిషి ‘తన’ పనుల్ని తాను
చేయడెందుకు?...
వాక్కు, వివేచన, ఆలోచన
ఉన్నందుకా?!
మనిషి మనిషిగా
ప్రవర్తించే రోజుకోసం

05/08/2016 - 20:37

భావజాలం అనేది మనస్తత్వం యొక్క విశాల పరిధి. సాంఘిక ఆచరణ ద్వారా ఇది వ్యక్తమవుతుంది. భావజాలం ఆధారంగానే వ్యక్తకి లేదా సంఘానికి అస్తిత్వం స్థిరపడుతుంది. పరిస్థితులు భావజాలాన్ని మార్చగలిగినట్టే, భావజాలం పరిస్థితులను మార్చగలుగుతుంది. రచన అనేది భావజాల వ్యాప్తికోసం రచయిత ఎన్నుకున్న సాటిలేని మాధ్యమం.

05/08/2016 - 20:34

గ్రంథాంశ జ్ఞాన సాధికారత, విశే్లషణా సామర్థ్యం, రచనను, రచయిత
సత్తాకు తూకం వేయగల దక్షత ఉన్న వారిచే పీఠికలు రాయించుకుంటే ఆ గ్రంథానికి గ్రంథకర్తకు ప్రయోజనాధిక్యం వుంటుంది. అచ్చు పొత్తంలో ఏది వుంచుకోవాలన్నది ఎంచుకోవడంలో రచయిత లేక ప్రకాశకులదే హక్కు అయినా అతిగా వుంటే భరించవలసింది పాఠకులే అవుతారు. పీఠికలు
శిరోధార్యాలుగా ఉండాలేగాని
శిరోభారాలుగా ఉండటం
మంచిది కాదు.

05/01/2016 - 21:06

రవి గాంచని చోట కవి గాంచునన్నది కవిత్వ విస్తృతికి, గాఢతకు,
కాలాతీతమైన సమకాలీనతకు దర్పణం. వర్తమానంలో భవితను చూసే
దూరదృష్టి కవికి ఉంటుంది. సమాజాన్ని భిన్న కోణాల్లో స్పృశించి దాని
స్వభావాలను భిన్న పాత్రలతో చిత్రీకరించగలిగే సృజన కూడా కవి సొంతమే. కవి కలానికి ఉండే ఆలోచనల బలం విశ్వజనీన పాత్రలకు జీవం పోస్తుంది. కాలమేదైనా, ప్రాంతమేదైనా... భాష ఏదైనా ఆ పాత్రలు అజరామరంగా,

05/01/2016 - 21:02

సాంకేతికత అభివృద్ధి చెందని రోజుల్లో కవిత్వ పుస్తకాలని గ్రంథాలయాల్లో చదువుకునేవారు. ప్రతి గ్రామము, పట్టణం, మండలంలో విరివిగా గ్రంథాలయాలు ఉండేవి కాబట్టి వారంలో ఒక రోజు కవిత్వ పుస్తకాన్ని చదవడానికి కేటాయించేవారు. ఔత్సాహిక కవులు తమ కవితలను ఆయా పత్రికలకు తమ చిరునామాతో రాసి పంపేవారు. అవి వచ్చేదాకా రోజుల తరబడి ఎదురుచూసేవారు.

05/01/2016 - 20:59

ట్రాజెడీ, కామెడీ అన్నింటా షేక్స్‌పియర్‌ది అందెవేసిన చెయ్యి.
శతాబ్దాల నాటి పరిణామాలను కళ్లకు కట్టి.. భవిష్యత్ కళ్లు
తెరిపించిన నాటకాలివి. వేటికవే సాటి. మానవ నైజాన్ని
నిగ్గుదేల్చిన రంగస్థల దృశ్యకావ్యాలు.

05/01/2016 - 20:55

మానవ జాతి మనుగడ ప్రారంభించిన క్షణం నుంచీ - ఎన్ని సిద్ధాంతాలు ఎన్ని విధాలుగా తలెత్తాయో - ఎన్ని రకాలుగా తల వాల్చాయో; ఏ సిద్ధాంతాలు యుద్ధాలు - ఉత్పాతాలు సృష్టించి ఎంత రక్తపాత కారకాలయ్యాయో - ప్రజలే పాత్రధారులు. ప్రజలే కార్యకారణ సంబంధ వస్తుకాండము. పరిణామం కూడా పరిణామగ్రస్తమనే యదార్థ జ్ఞానం లేని మూర్ఖుల చేతుల్లోబడి ఎన్ని విలువలు నాశనమయ్యాయో మళ్ళీ ప్రజలే కారణం.

05/01/2016 - 20:53

మనమంతే..
భూమిని ఇచ్చేసి
భుక్తిని అడుక్కుంటాం.
చెట్టుని కొట్టేసి
నీడని కొనుక్కుంటాం.
చెరువుని అమ్మేసి
నీటిని వెదుక్కుంటాం.
మనమంతే..
తలని తాకట్టుపెట్టి
ముఖాన్ని వడ్డీకి తిప్పుతాం
దరిద్రాన్ని నెత్తికెత్తుకుని
తలరాతని తిట్టుకుంటాం.
వౌనంగా ఉన్నవాడిని
మాట్లాడమంటాం
మాటలాడే వాడితో
పోట్లాటలకి దిగుతాం.

Pages