S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహితి

03/14/2016 - 05:01

ఏదో సన్నని రాగం
చెవిలో వినిపిస్తుంది
ఏదో కరుణ తరంగిణి
ఆ స్వరం మోసుకొస్తూ వుంది

రెండు కొండల మధ్యలో
నది పాయగా వెళుతూ
కొండతో చెప్పిన ముచ్చట్లు
వినిపిస్తున్నాయి

‘నదికి కదా గాయాలవ్వాలి
కొండకేమిటి’ అంది నది
అప్పుడు కొండ స్నేహితా
ఇప్పుడు నదీ తరంగాలు పదును తేరాయి

03/14/2016 - 05:04

ఎప్పుడు చూసాడో
ఎలా తీసాడో
తెలియదు

సాయంత్రం
ఇంటికి వచ్చేసరికి
దేహ కాన్వాసు
దాచివున్న కాగితాలు
తను రంగరించిన రంగులతో
మెరిసిపోతుంటాయి

ఇష్టమైన తినుబండారాల్ని తింటూ
ఒళ్ళంతా పులుముకున్నట్టు
మోహించిన రంగుల్ని
శరీరంపై హత్తుకుని
వాటినే
కాగితంపై అలుముతాడు

03/14/2016 - 05:04

సాహిత్యంలో 1935-1965 మధ్యకాలం కొవ్వలి నవలా యుగం. అయితే చరిత్రకారులు గానీ, విమర్శకులు గానీ దీనిని గుర్తించలేదు. తెలిసినా పట్టించుకోలేదు. కొన్ని పుస్తకాలలో ‘కొవ్వలి - జంపన’ అనేవారుండే వారన్నట్టు రెండు వాక్యాలలో స్పృశించటం చూస్తాం. కొవ్వలి విషయానికి వస్తే గురజాడ అన్న ‘మనవాళ్ళొట్టి వెధవాలయలోయ్’ అన్నది గుర్తుకు వస్తుంది. మన తెలుగువాడే! వెయ్యి నవలలు (నవలికలు) రాసిన ఏకైక తెలుగువాడే!

03/14/2016 - 04:58

బాల సాహిత్యం అనగానే పంచతంత్ర కథలు, పేదరాసి పెద్దమ్మ కథలు, ఈసపు కథలు, చందమామ కథలు గుర్తురావడం సహజం. మారుతున్న కాలంతో బాటు మనము మారుతున్నట్టే పిల్లలు కూడా మారుతున్నారు. కాలం బాటే వేగం అందుకుని అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకు దూసుకుపోతున్నారు. పూర్వకాలంలో సమష్టి కుటుంబాలు ఉండేవి. ఎక్కువమంది సంతానం ఉండేవారు. అప్పట్లో అందరికీ విద్య, ఆహారం, వసతులు కల్పించడం కష్టమయ్యేది అమ్మానాన్నలకు.

03/06/2016 - 21:58

గూడు విడిచిన
పిల్లపిట్టల్ని ఎడబాసి
మోడువారిన
ఎడారి మొఖాల్ని తడిమే
చల్లని చూపుల
చలువ పందిళ్ళై అల్లుకుంటరు

కటిక చీకటి
వాకిట్లో పూసిన
పున్నమి చెట్టుమీద
ఎన్నీలై వాలిపోతరు

నిర్వేదపు అంచుల్ని
పటాపంచలు చేసి
ఆరిపోయిన పెదాలమీద
అనుబంధాల
తేనె బిందువుల్ని వొలికిస్తరు

03/06/2016 - 21:57

కరచాలనాల కాలమా ఇది?
హస్త లాఘవాల కాలం కదా!
కాని, కేకుని చాకుతో కోసినంత తేలిగ్గా
కాలానికి ఎదురీదే వాళ్లు
ఉంటూనే ఉంటారు మన మధ్యే
అలాంటివాడే అతను
పేరేదైతేనేం
మనిషిగా పిల్చుకోవచ్చు
కారిడార్లోనో, క్యాంటీన్లోనో, సెక్షన్లోనో
నవ్వుల కరచాలనమై ఎదురొస్తాడు
చేతులు కలిపి మనలోకి అనురాగ ప్రసారం కావిస్తాడు
అతని కరచాలనం మరేం కాదు

03/06/2016 - 21:56

యిప్పుడు నాకేం పనిలేదు
ఆ ఉయ్యాల చుట్టూ పరిభ్రమించడం తప్ప
ఏడుస్తే ఎత్తుకోవడం
నవ్విస్తూ ఆడుకోవడం

దగ్గరగా కనబడితే
నడుము నాట్యం చేస్తుంది
చేతుల్లో ఎన్ని భంగిమలో!
ముట్టుకుంటే... గలగలా నవ్వుల కేరింతలు
దూరంగా జరిగితే
ఏడుపుల రాద్ధాంతాలు

03/06/2016 - 21:55

మగత నిద్ర ముసుగులో
మనసు పొరల్లో
చిరకాల స్వప్నాలు
బొమ్మకట్టుకుంటున్నాయి

మెల్లగా
నానుంచి నేను
అదృశ్యమైనట్టు భ్రమ
మనిషిని కదా...
ఆవేదనతో
ఆరాటంతో, అనే్వషణలో
మళ్ళీ నన్ను నేను
కలుసుకునేందుకు
నలుదిశలా పరుగుతీస్తున్నాను
నాలుగురోడ్ల కూడలిలో
హఠాత్తుగా
నా ముందు మల్లిరేకు వంటి మనిషి...!

03/06/2016 - 21:54

అయ్యదేవర పురుషోత్తమరావు హడావుడి మనిషి. నిరంతరం సాహిత్య కార్యక్రమాలో, నాటక సప్తాహాలో, పుస్తకావిష్కరణలో నిర్వహించాలని అతడి తాపత్రయం. ఇలాంటివి ఏర్పాట్లు చేయకపోతే ఆయనకు సంతృప్తిగా ఉండదు. ఒకసారి ఏమి ఉత్సాహం కలిగిందో డా.కె.ఎల్.రావుగారిని పెద్దఎత్తున సత్కరించాలని అతడు సంరంభించాడు. కార్యనిర్వహణ దక్షుడే. అందుకు సందేహం లేదు.

Pages