S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహితి

03/21/2016 - 00:11

అస్సలు తోచనీయని సమయాలు
కొన్ని ఉంటాయి.
మాటే వినని మనసులుంటాయి

ఎక్కడో ఉన్న అమ్మని తలచే తలపులుంటాయి
కంటి కొలుకుల్లోంచి జారి పడని నీళ్ళుంటాయి
విలవిలలాడే ఆక్రోశాలుంటాయి

03/21/2016 - 00:09

రతీయ సమాజంలో ఆధునిక యుగం - 1850 ప్రాంతాల్లో ప్రారంభమయింది. 1857లో తొలి స్వాతంత్య్ర సమరం జరిగింది. అందువల్ల, ఆధునికతకు 1857ని చారిత్రక చిహ్నంగా గుర్తుపెట్టుకోవచ్చు. గతంలో తుప్పు పట్టిన ఇనుప ముక్కలేకాదు, వెదికిపట్టుకుని పరిరక్షించుకోవాల్సిన వజ్రాలూ, రత్నాలూ కూడా ఉంటాయి- అన్న చారిత్రక వాస్తవాన్ని మన సమాజం స్వీకరించి, ఆచరిస్తుంది.

03/21/2016 - 00:07

కలం ఎప్పుడూ శోకించదు
కవి స్ఫూర్తి వేదన భరించనపుడు
విషాద మేఘచ్ఛాయాలు క్రమ్మి
పరావర్తనం చెందినపుడు
భావస్ఫోరకమై సంచలిస్తూ
విచలితం జ్వలనమై
అశృతప్త కాసారమవుతుంది.
విరి తోటను విస్మరించిన విరజాజి
పరిమళాన్ని విదిల్చి వెళ్ళిపోయింది
నిన్నటి సంధ్యాసమయంలా
నిరుడు కురిసిన శ్రావణమేఘంలా
స్వర్ణమరుూ... సుకుమారీ...

03/21/2016 - 00:05

రామా చంద్రవౌళి
‘ఒక ఏకాంత సమూహంలోకి...’ కవితా సంపుటి

03/21/2016 - 00:03

పూలపిట్ట: వెల:రు.100/-
పుటలు: 96, సోమిశెట్టి స్వర్ణలత
ప్రతులకు: సోమిశెట్టి నరసింహారావు,
ప్లాట్ నెం.1502, జి.బ్లాక్
సేథి మ్యాక్స్‌రాయల్, సెక్టార్- 76
నోయిడా- ఉత్తరప్రదేశ్
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు.

03/14/2016 - 05:03

== పుస్తకమ్ ==

ఒక మేఘం కథ
కథల సంపుటి
రచయిత: సుంకోజి దేవేంద్రాచారి
ధర: రూ.120/-; పేజీలు: 189
ప్రతులకు: అన్ని ప్రముఖ
పుస్తక దుకాణాలు.

03/14/2016 - 05:02

చిలుకల గుంపుకు
జాంకాయ ముక్కలు వేసారు
దూరపు కొండలు మురిపిస్తున్నాయి
యజమాని బడిలో పెరిగాయిగా అవే కూతలు!

మనకు పక్కోడిని చూసే వ్యూహమే లేదు
పేదోడి బతుకు చట్రంలో వేరే లోకమే లేదు
చీకటి... వెలుతురు లోకమంతా
రెండు మెతుకులు పొట్టలోకి వెళ్ళేందుకే
వచ్చే ఆదాయంలో
ఎన్ని రంగుల్ని నింపుకుంటారో
ఎన్ని ఆశల్ని రగిల్చుకుంటామో కదా?!

03/14/2016 - 05:01

ఏదో సన్నని రాగం
చెవిలో వినిపిస్తుంది
ఏదో కరుణ తరంగిణి
ఆ స్వరం మోసుకొస్తూ వుంది

రెండు కొండల మధ్యలో
నది పాయగా వెళుతూ
కొండతో చెప్పిన ముచ్చట్లు
వినిపిస్తున్నాయి

‘నదికి కదా గాయాలవ్వాలి
కొండకేమిటి’ అంది నది
అప్పుడు కొండ స్నేహితా
ఇప్పుడు నదీ తరంగాలు పదును తేరాయి

03/14/2016 - 05:04

ఎప్పుడు చూసాడో
ఎలా తీసాడో
తెలియదు

సాయంత్రం
ఇంటికి వచ్చేసరికి
దేహ కాన్వాసు
దాచివున్న కాగితాలు
తను రంగరించిన రంగులతో
మెరిసిపోతుంటాయి

ఇష్టమైన తినుబండారాల్ని తింటూ
ఒళ్ళంతా పులుముకున్నట్టు
మోహించిన రంగుల్ని
శరీరంపై హత్తుకుని
వాటినే
కాగితంపై అలుముతాడు

03/14/2016 - 05:04

సాహిత్యంలో 1935-1965 మధ్యకాలం కొవ్వలి నవలా యుగం. అయితే చరిత్రకారులు గానీ, విమర్శకులు గానీ దీనిని గుర్తించలేదు. తెలిసినా పట్టించుకోలేదు. కొన్ని పుస్తకాలలో ‘కొవ్వలి - జంపన’ అనేవారుండే వారన్నట్టు రెండు వాక్యాలలో స్పృశించటం చూస్తాం. కొవ్వలి విషయానికి వస్తే గురజాడ అన్న ‘మనవాళ్ళొట్టి వెధవాలయలోయ్’ అన్నది గుర్తుకు వస్తుంది. మన తెలుగువాడే! వెయ్యి నవలలు (నవలికలు) రాసిన ఏకైక తెలుగువాడే!

Pages