S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/27/2016 - 04:38

మంగపేట, సెప్టెంబర్ 26: మంగపేట గోదావరి తీరం వెంట కరకట్ట నిర్మాణం చేపట్టి గ్రామాన్ని రక్షిస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రజలకు హామీ ఇచ్చారు. సోమవారం మంగపేట పుష్కరఘాట్ వద్ద గోదావరి ఉద్ధృతిని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పరిశీలించారు.

09/27/2016 - 04:37

వరంగల్, సెప్టెంబర్ 26: భారీ వర్షాల నుండి వరంగల్ నగరం ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. గత వారం రోజులుగా వరంగల్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు జిల్లా అతలాకుతలమైంది. భారీ వర్షాల నేపథ్యంలో నష్టం అంచనా వేయడానికి ప్రభుత్వం ప్రత్యేక అధికారుల బృందాలను ఇక్కడికి పంపించింది.

09/27/2016 - 04:37

వరంగల్, సెప్టెంబర్ 26: జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఏర్పడిన నష్టంపై సమగ్ర నివేదికను రూపొందించి పునరావాస కమీషనర్‌కు పంపించాలని జిల్లా ప్రత్యేకాధికారి అరవింద్‌కుమార్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తాత్కాలిక, ప్రత్యామ్నయ ఏర్పాట్లు సత్వరం చేపట్టాలని సూచించారు.

09/27/2016 - 04:36

జనగామ టౌన్, సెప్టెంబర్ 26: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, సిపిఐ రాష్ట్ర నాయకుడు గంగసాని సత్యపాల్‌రెడ్డి (80) గుండెపోటుకు గురై సోమవారం హైదరాబాద్‌లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో మృతిచెందారు. ఆయన మృతదేహాన్ని నాయకుల సందర్శనార్థం హైదరాబాద్‌లోని మగ్ధుం భవన్ తరలించారు.

09/27/2016 - 04:36

సంగెం, సెప్టెంబర్ 26: భూనిర్వాసితుల పక్షాన తెలంగాణ రాష్ట్ర కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాంరెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్య కార్యదర్శి ఓఎస్‌డి భవానీ శంకర్‌ను కలిసినట్లు పరకాల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఇనగాల వెంకట్రాంరెడ్డి తెలిపారు.

09/27/2016 - 04:35

ఏటూరునాగారం, సెప్టెంబర్ 26: ఎగువ ప్రాంతాలలో గత పదిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రధాన ప్రాజెక్టులు నిండడంతో దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేశారు. దీంతో జిల్లాలోని ఏజన్సీ ప్రాంతమైన ఏటూరునాగారం మండలం కేంద్రంలోని ఓడగూడెం, మానసపల్లి, హరిజన కాలనీ లోతట్టు ప్రాంతాల వారిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు చేపట్టారు.

09/27/2016 - 04:35

మంగపేట, సెప్టెంబర్ 26: ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వరద నీటితో క్రమంగా గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. సోమవారం గోదావరి ఉద్ధృతి మరింత పెరిగింది. మండలంలోని పొద్మూరు కాలనీ, బోరు నర్సాపురం, అకినేపల్లి మల్లారం, కత్తిగూడెం, అకినేపల్లి మల్లారం ఎస్టీ కాలనీలోని పలు ప్రాంతాలతో పాటు మండలంలో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం ఉండడంతో రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తమయింది.

09/27/2016 - 04:34

మంగపేట, సెప్టెంబర్ 26: మండల కేంద్రమైన మంగపేట సమీపంలోని పొద్మూర్ కాలనీలో లోతట్టు ప్రాంతానికి చెందిన పలు కుటుంబాలను మంగపేట రెవెన్యూ అధికారులు మంగపేట హైస్కూల్‌లోని పునరావాస కేంద్రానికి తరలించారు.

09/27/2016 - 04:34

ఏటూరునాగారం, సెప్టెంబర్ 26: విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ఏజెన్సీ ప్రజలు అనారోగ్యాల బారిన పడకుండా వైద్య అధికారులు అప్రమత్తంగా ఉండి వైద్య సేవలందించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వైద్య అధికారులను ఆదేశించారు. సోమవారం ఎగువున కురిసిన వర్షాలకు ఆయా ప్రాజెక్టులనుండి నీటిని విడుదల చేయడంతో గోదావరి ముంపునకు గురయ్యే లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసేందుకు అధికారులను అప్రమత్తం చేశారు.

09/27/2016 - 04:33

వరంగల్, సెప్టెంబర్ 26: ఎగువప్రాంతం విదర్భ, మధ్యప్రదేశ్‌లలో కురుస్తున్న భారీవర్షాలకు గోదావరిలో భారీగా వరదనీరు చేరుతుండటంతో ప్రభుత్వ హెచ్చరికల మేరకు జిల్లాయంత్రాంగం అలర్ట్ అయింది. జిల్లాలోని గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ముందుజాగ్రత్తలు ప్రారంభించింది.

Pages