S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వర్షాల నష్టంపై నివేదిక పంపాలి

వరంగల్, సెప్టెంబర్ 26: జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఏర్పడిన నష్టంపై సమగ్ర నివేదికను రూపొందించి పునరావాస కమీషనర్‌కు పంపించాలని జిల్లా ప్రత్యేకాధికారి అరవింద్‌కుమార్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తాత్కాలిక, ప్రత్యామ్నయ ఏర్పాట్లు సత్వరం చేపట్టాలని సూచించారు. కలెక్టరేట్ మీటింగ్ హాల్‌లో వివిధ శాఖల అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అధికారి అరవింద్‌కుమార్ సమావేశమై పునరావాస చర్యలపై సమీక్ష జరిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు ఇంకా కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన కారణంగా ప్రజలకు, పశువులకు ఇబ్బందులు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. రోడ్లు, కల్వర్టులు, భవనాలు, కాల్వలకు నష్టం జరగకుండా ముందు జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశించారు. నాలాలను ఆక్రమంచి అక్రమ నిర్మాణాలు చేపట్టిన కారణంగా వర్షాలు, వరదల సందర్భంగా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ ఆక్రమణల విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. వర్షాలు తగ్గుముఖం పట్టాక పూర్తి స్థాయి సహాయక చర్యలతో పాటు నష్టాలపై నివేదిక రూపొందించి ప్రభుత్వానికి పంపించాలని అన్నారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన సహాయక, పునరావాస కార్యక్రమాలను ఆయన సంబంధిత అధికారులతో సమీక్ష జరిపారు. జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ భారీ వర్షాలతో జిల్లాలో ఇప్పటి వరకు గ్రామ రెవెన్యూ అధికారితో పాటు మరో ముగ్గురు వ్యక్తులు మరణించారని తెలిపారు. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాల నుంచి తరలించిన ప్రజలకు పునరావాస కేంద్రాలలో ఆహారం, మంచి నీరు అందించేందుకు పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేసిందని చెప్పారు.