S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/27/2016 - 04:31

అవనిగడ్డ: కృష్ణానదికి వరద నీరు విడుదల కావటంతో మండల పరిధిలోని తీరగ్రామాల నదిలో నీటిమట్టం క్రమేపీ పెరుగుతోంది. శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ మండలంలోని కృష్ణానది పరీవాహక గ్రామాలను ఆదివారం సందర్శించారు. రెవెన్యూ అధికారులు తీసుకుంటున్న సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు గ్రామస్తులను తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.

09/27/2016 - 04:30

హనుమాన్ జంక్షన్: ఒలింపిక్స్ పోటీల్లో రజత పతకం సాధించిన భారత షట్లర్ పివి సింధు ఆదివారం స్థానిక అభయాంజనేయుని దర్శించుకున్నారు. గన్నవరం నుంచి ద్వారకా తిరుమల వెళుతున్న సింధు హనుమాన్ జంక్షన్‌లో కొద్దిసేపు ఆగారు. ఈసందర్భంగా అభయాంజనేయ స్వామి ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు.

09/27/2016 - 04:30

కూచిపూడి: రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కృష్ణామిల్క్ యూనియన్ శ్రేయస్సు కోసం తాను అన్ని పార్టీలతో సఖ్యతగా ఉంటానని, తనది ‘పాల పార్టీ’ అని ఛైర్మన్ మండవ జానకిరామయ్య అన్నారు. వినియోగదారులకు తక్కువ ధరకు నాణ్యమైన పాల సరఫరా, పాల రైతులకు అత్యధిక ధరను చెల్లించి ఏడాదికి రూ.560 కోట్ల టర్నోవర్‌తో రాష్ట్రంలోని అన్ని మిల్క్ యూనియన్‌ల కన్నా కృష్ణామిల్క్ యూనియన్ అగ్రభాగాన నిలిచిందని తెలిపారు.

09/27/2016 - 04:28

విజయవాడ: జీవితంలో అన్నిటికన్నా సమయం విలువైనదని, యువత అవకాశాల కోసం ఎదురు చూడకుండా వచ్చిన అవకాశాలను చేదక్కించుకోవాలని మాజీ సిఐడి జాయింట్ డైరక్టర్, మహారాష్ట్ర, నాం దేడ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వివి లక్ష్మీనారాయణ సూచించారు.

09/27/2016 - 04:25

గుంటూరు, సెప్టెంబర్ 26: ‘వ్యవసాయ రంగంలో అనేక సంక్షోభాలను ఎదుర్కొంటున్నాం. జాతీయ స్థాయిలో వృద్ధిరేటు గణనీయంగా తగ్గింది. విశ్వవిద్యాలయాలు స్వయం పోషకత్వంతో నిత్యనూతన పరిశోధనలను ఆవిష్క రించాలి. నాణ్యమైన విత్తనోత్పత్తితోనే లాభసాటి వ్యవసాయం చేయగలం. ఆ దిశగా అవసరమైన శాస్త్ర, సాంకేతికతలను జోడించి విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చేందుకు కృషి జరగాలి’.. అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు.

09/27/2016 - 04:23

గురజాల, సెప్టెంబర్ 26: గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో భారీ వర్షాలతో వచ్చిన వరదలకు పంటలు పూర్తిగా దెబ్బతిని రైతులకు తీవ్ర నష్టం జరిగిందని, ప్రభుత్వం మాత్రం రైతులను పూర్తిగా విస్మరించిందంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి విమర్శించారు. వరదల వల్ల నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు సోమవారం గురజాల వచ్చిన ఆయన పట్టణంలోని బ్రహ్మనాయుడు విగ్రహం సెంటర్‌లో మాట్లాడారు.

09/27/2016 - 04:21

మచిలీపట్నం, సెప్టెంబర్ 26: బందరు ఓడరేవు, పారిశ్రామికవాడ నిర్మాణానికి అవసరమైన భూములను సమీకరించేందుకు మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (మడ) సిద్ధమైంది. ఈ రెండు ప్రాజెక్టులకు అవసరమైన 33 వేల 337 ఎకరాల భూములకు సంబంధించి వారం రోజుల క్రితం ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ జారీ చేసిన మడ అధికారులు మంగళవారం నుండి గ్రామసభల నిర్వహణకు సిద్ధమయ్యారు. మూడురోజుల పాటు నిర్వహించనున్నారు.

09/27/2016 - 04:20

ఏలూరు/ఒంగోలు , సెప్టెంబర్ 26: అప్పులోళ్ల బాధలు భరించలేక కలెక్టరేట్‌ల వద్ద ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యాయత్నం చేశారు. సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు, ప్రకాశం జిల్లా ఒంగోలులో ఈ సంఘటనలు చోటుచేసుకున్నాయ. ఏలూరు కలెక్టరేట్‌లో సోమవారం ఒక వ్యక్తి చెదల నివారణకు ఉపయోగించే మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. అతడిని హుటాహుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా, కోలుకుంటున్నాడు.

,
09/27/2016 - 04:18

కడప, సెప్టెంబర్ 26: కడప నగరంలో సోమవారం జరిగిన మంజునాథ్ కమిటీ విచారణలో రసాభాస చోటుచేసుకుంది. బిసి మహిళా నేత ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాపులను బిసిల్లో చేర్చవద్దంటూ బిసి సంఘాల నాయకులు ఆందోళన చేయడంతో గందరగోళం నెలకొంది.

09/27/2016 - 04:15

గుంటూరు, సెప్టెంబర్ 26: ‘నాది సుదీర్ఘ రాజకీయ జీవితం. నాలుగు దశాబ్దాల కాలంలో నిప్పులా బతికాను. నీతి నిజాయతీగా ఉన్నా. వ్యాపార లావాదేవీల్లో ఎలాంటి అక్రమాలకు తావివ్వద్దని స్వయానా కుటుంబ సభ్యులకే చెప్పా. నా అనుభవం అంత వయసులేని వాళ్లు అపనిందలు వేస్తున్నారు. ప్రజల కోసం అన్నీ సహిస్తున్నా. నా జీవితంలో భయమంటే ఏమిటో తెలియదు’.. అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

Pages