S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

బలవంతంగా లాక్కోవద్దు

సంగెం, సెప్టెంబర్ 26: భూనిర్వాసితుల పక్షాన తెలంగాణ రాష్ట్ర కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాంరెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్య కార్యదర్శి ఓఎస్‌డి భవానీ శంకర్‌ను కలిసినట్లు పరకాల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఇనగాల వెంకట్రాంరెడ్డి తెలిపారు. సంగెం, గీసుకొండ మండలాల్లో టెక్స్‌టైల్ పార్క్, ఇండస్ట్రియల్ కారిడార్‌కు భూములు సేకరించడాన్ని వ్యతిరేకిస్తూ కోదండరెడ్డి, ఇనగాల వెంకట్రాంరెడ్డి ఆధ్వర్యంలో వంద మంది రైతులతో సోమవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి భవానీశంకర్‌కు రైతుల గోడు వినిపించారు. భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కోవద్దని వినతిపత్రం అందచేశారు. జిఓ 19, 123, 45 ప్రకారం రైతుల భూములు తీసుకోవద్దని కార్యదర్శిని కోరారు. రైతుల భూముల్లో ఏడాదికి రెండు మూడు పంటలు పండుతాయని ఇవి వ్యవసాయానికి సారవంతమైన భూములని ఈ భూములను ప్రభుత్వం తీసుకుంటే రైతులు జీవనోపాధి కోల్పయి బజారున పడుతారని తెలిపారు. దీనిపై ముఖ్య కార్యదర్శి సానకూలంగా స్పందించి రైతులకు న్యాయం చేస్తానని తెలిపినట్లు ఇనగాల తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తీగల రవీందర్‌గౌడ్, రైతులు ఇండ్ల శ్రీనివాస్, జగమోహన్‌రెడ్డి, సమ్మయ్య రైతులు పాల్గొన్నారు.

పంటలకు నష్టపరిహారం
వెంటనే చెల్లించాలి
బిజెపి జిల్లా అధ్యక్షుడు
ఎడ్ల అశోక్ రెడ్డి
వడ్డేపల్లి సెప్టెంబర్ 26: జిల్లాలో అకాల వర్షాల కారణంగా నష్టపోయన రైతులను ప్రభుత్వం ఆదుకుని వెంటనే నష్టపరిహారం చెల్లించాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు ఎడ్లఅశోక్‌రెడ్డి డిమాండ్ చేశారు.సోమవారం జిల్లా పార్టీకార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో అకాల వర్షాల వలన పంట నష్టం వాటిల్లిన రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ప్రవేశ పెట్టిన ఫసల్ భీమా పథకాన్ని రాష్ట్రప్రభుత్వం సకాలంలో రైతులకు అందచేయక పోవడంతోతీవ్ర నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాంటి పథకాలలో అవినీతి,కుంభకోణాలు ఎక్కువగా జరిగాయని,అవినీతికి పాల్పడిన కాంట్రాక్టర్లలకు డబ్బులు చెల్లించ కూడదని ఆయన అన్నారు.