S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/24/2016 - 04:36

హైదరాబాద్, సెప్టెంబర్ 23: నగరానికి మరో రెండురోజుల పాటు భారీ వర్ష సూచనలుండటంతో ఎలాంటి విపత్కరమైన పరిస్థితులను ఎదుర్కొనేందుకు తాము సిద్దంగా ఉన్నామని మున్సిపల్ మంత్రి కె. తారకరామారావు వెల్లడించారు.

09/24/2016 - 04:35

అల్వాల్, సెప్టెంబర్ 23: అల్వాల్‌లో డ్రైనేజీ, వరద నీటి కాలువల సమస్య శాశ్వతంగా పరిష్కరించటానికి ప్రజలు సహకరించాలని రాష్ట్ర మంత్రులు కెటి రామారావు, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి కోరారు. శుక్రవారం సాయంత్రం టెంపుల్ అల్వాల్ ప్రాంతంలో వరద నీటి ముంపు ప్రాంతాలను పరిశీలించారు.

09/24/2016 - 04:26

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 23: గద్వాల జిల్లా ఏర్పాటు చేయాలని జరుగుతున్న ఆందోళనలు తార స్థాయికి చేరుకున్నాయి. గద్వాల జె ఎసి, అఖిలపక్షం ఆద్వర్యంలో మూడు రోజుల సకల జనుల బంద్‌కు పిలుపునిచ్చారు. అందులో బాగంగా శుక్రవారం సకల జనుల బంద్ సందర్భంగా జనమంతా రోడ్లపైకి వచ్చి గద్వాల పట్టణంలో కవాతు నిర్వహించారు. సకల జనుల బంద్ సందర్భంగా గద్వాల ఆర్టిసీ డిపో మూతపడింది. బస్సులు డిపోలకే పరిమితం అయ్యిపోయాయి.

09/24/2016 - 04:24

హైదరాబాద్, సెప్టెంబర్ 23: భారీ వర్షాల కారణంగా గుంటూరు డివిజన్‌లోని సత్తెనపల్లి-పిడుగురాళ్ళ సెక్షన్‌లో రైలు పట్టాలు దెబ్బ తిన్న కారణంగా ఒక రైలును రద్దు చేయగా, మరో రైలును మళ్లించినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. మణుగూరు-కాజిపేట ప్యాసింజర్‌ను 24వ తేదీన రద్దు చేసింది.

09/24/2016 - 04:23

హైదరాబాద్, సెప్టెంబర్ 23: హైదరాబాద్‌లో ప్రసిద్ధ విద్యాసంస్థ కేశవ్ మెమోరియల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డిజిటల్ విద్యా పోర్టల్‌ను ప్రారంభించింది. బిగ్ డాటా, హడూప్, ఆర్, సేల్స్‌ఫోర్సు, అడోబ్ తదితర సంస్థల సమన్వయంతో డిజిటల్ ఎడ్యుకేషన్ పోర్టల్ నిర్వహించనుంది.

09/24/2016 - 04:23

హైదరాబాద్, సెప్టెంబర్ 23: వేములఘాట్ గ్రామంలో 114 సెక్షన్ కింద ఆంక్షలు విధించడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో గ్రామస్తులు దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం వాదనలు ముగిసాయి. కాగా న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు తీర్పును రిజర్వు చేసినట్టు ప్రకటించారు.

09/24/2016 - 04:22

హైదరాబాద్, సెప్టెంబర్ 23: ఆంధ్రా బ్యాంకు నేతృత్వంలో ఎనిమిది బ్యాంకుల కన్సార్టియంగా ఏర్పడి మిషన్ భగీరథకు మొత్తం 6750 కోట్ల రూణాన్ని అందజేయనున్నాయి. శుక్రవారం సైఫాబాద్ లోని ఆంధ్రాబ్యాంక్ ప్రధాన కార్యాలయంలో కన్సార్టియం సమావేశం జరిగింది.

09/24/2016 - 04:21

హైదరాబాద్, సెప్టెంబర్ 23: ప్రకృతి కనె్నర్ర చేయడంతో ప్రజలను ఆదుకునేందుకు ప్రతిపక్షాలన్నీ నడుం బిగించాయి. సహాయక కార్యక్రమాల్లో ముందుండాలని పార్టీ అగ్ర నాయకులు తమ పార్టీల కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వర్షం, వరద బాధితులను ఆదుకునేందుకు సహాయక కార్యక్రమాల్లో ముందుండాలని తెలుగు దేశం పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు ఎల్. రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు.

09/24/2016 - 04:20

హైదరాబాద్, సెప్టెంబర్ 23: వర్షం, వరదలతో తెలంగాణలోని అన్ని ప్రాంతాల ప్రజలు తల్లడిల్లుతుంటే సహాయక కార్యక్రమాలు సకాలంలో చేపట్టడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విపక్షాల నేతలు మండిపడ్డారు. కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ నగరంలో వర్షంతో జలమయమైన వివిధ ప్రాంతాలను శుక్రవారం సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజలు ఆశించిన విధంగా సేవలు అందడం లేదని విమర్శించారు.

09/24/2016 - 04:19

హైదరాబాద్, సెప్టెంబర్ 23: మరో మూడు రోజుల పాటు భారీ వర్షాల ప్రమాదం పొంచి ఉన్నందున సహాయ కార్యక్రమాల కోసం ఆర్మీని, ఎన్‌డిఆర్‌ఎఫ్‌ను సిద్ధంగా ఉంచినట్టు మున్సిపల్ మంత్రి కె తారక రామారావు తెలిపారు. భారీ వర్షాలకు నీట మునిగిన పలు ప్రాంతాల్లో కెటిఆర్ పర్యటించారు. వచ్చే రెండు నెలల్లో నగరంలోని రోడ్లను పూర్తి స్థాయిలో నిర్మిస్తామని చెప్పారు.

Pages