S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/24/2016 - 03:37

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: కాశ్మీర్‌లో తాజా పరిస్థితులపైనా, వచ్చే నెలలో జరగబోయే బ్రిక్స్ సమావేశాల భద్రతా ఏర్పాట్లపై చర్చించేందుకు రక్షణ మంత్రి మనోహర్ పారికర్ శుక్రవారం హోంమంత్రి రాజ్‌నాథ్‌తో భేటీ అయ్యారు. అరగంటపాటు జరిగిన ఈ ఇద్దరు సీనియర్ మంత్రుల సమావేశంలో పలు కీలక విషయాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

09/24/2016 - 03:36

ముంబయి, సెప్టెంబర్ 23: జమ్మూకాశ్మీర్‌లోని యూరి సెక్టార్‌లో భారత సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసిన నేపథ్యంలో పాకిస్తాన్‌కు చెందిన ఫావద్ ఖాన్ వంటి కళాకారులు తక్షణమే భారత్‌ను వదలిపోవాలని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్) శుక్రవారం డిమాండ్ చేసింది. లేకుంటే వారి షూటింగ్‌లను అడ్డుకుంటామని హెచ్చరించింది.

09/24/2016 - 03:35

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ (ఎన్‌సిబిసి) చేసిన తీర్మానం ప్రకారం పదేళ్ల లోపు అమ్మానాన్నలిద్దరిని కోల్పోయి, సంరక్షకులు ఎవరూ లేక అనాథలుగా మిగిలిన జనరల్ కేటగిరికి చెందిన పిల్లలు ప్రభుత్వ విద్యాసంస్థలు, ఉద్యోగాలలో ఇతర వెనుకబడిన తరగతుల (ఒబిసి) కోటాలో రిజర్వేషన్లు పొందుతారు.

09/24/2016 - 03:35

జమ్ము, సెప్టెంబర్ 23: కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న భర్త రెండోపెళ్లి చేసుకున్నాడన్న ఆగ్రహంతో ఓ మహిళ అతనిపై యాసిడ్ కుమ్మరించింది. ఈ ఘటనలో ఆమెకూ తీవ్ర గాయాలయ్యాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వీరిద్దరినీ ఆసుపత్రికి తరలించారు. కతువా జిల్లాలోని బని పట్టణంలో మహమ్మద్ దిన్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. పదేళ్ల క్రితం షమీమా అఖ్తర్‌తో వివాహం జరిగింది. వీరికి ఓ కుమార్తె కూడా ఉంది.

09/24/2016 - 03:33

చెన్నై, సెప్టెంబర్ 23: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జ్వరంతో బాధపడుతుండటంతో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం జ్వరం తగ్గుముఖం పట్టిందని, సాధారణ ఆహారం తీసుకుంటున్నారని, ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అపోలో ఆసుపత్రి ప్రతినిధి సుబ్బయ్య విశ్వనాథన్ ఓ ప్రకటనలో తెలిపారు.

09/24/2016 - 03:30

హైదరాబాద్: బాబు వస్తే వర్షాలు రావు. రిజర్వాయర్లు నిండవు. కరవు విలయ తాండవం చేస్తుంది! ఇదీ గత కొనే్నళ్ల నుంచి ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ఉన్న సెంటిమెంటుకు సంబంధించిన ముద్ర!! గత రెండేళ్ల నుంచి ఏపిలో సరైన వర్షాలు కురవకపోవడం, అంతకుముందు తొమ్మిదేళ్లు సీఎంగా చేసినప్పటి కరవును దృష్టిలో పెట్టుకుని విపక్షాలు చేసిన విమర్శలు, కొందరు స్వాములు చేసిన వ్యాఖ్యలు ఒక సెంటిమెంటుగా మారాయి.

09/24/2016 - 03:21

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: భారత్‌లో ఉగ్రవాద దాడులను ప్రేరేపిస్తున్న పాకిస్తాన్‌తో ఇప్పట్లో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడే ప్రసక్తే లేదని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) చైర్మన్ అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశాడు. శనివారం అతను పిటిఐతో మాట్లాడుతూ ఉగ్రవాదానికి పాక్ మద్దతునిస్తున్నదని, ఫలితంగానే ఉరీలోని భారత సైనిక స్థావరంపై దాడి జరిగిందని అన్నాడు.

09/24/2016 - 03:16

హైదరాబాద్, సెప్టెంబర్ 23: ఆస్తుల పంపకానికి సంబంధించి సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో షెడ్యూలు 10 బిలోని విద్యాసంస్థలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టిసారించింది.

09/24/2016 - 03:16

హైదరాబాద్, సెప్టెంబర్ 23: తెలంగాణలో దొడ్డిదారిన మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు జరుగుతున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. వాస్తవానికి అన్ని మెడికల్ కాలేజీల్లో సీట్లను మెరిట్ ప్రాతిపదికగానే నింపాల్సి ఉంది. మెరిట్ ప్రాతిపదికపైనే సీట్ల భర్తీ జరుగుతోందా? లేదా? అన్నది ఆయా రాష్ట్రాల వైద్యవిద్యా విభాగం పర్యవేక్షించాల్సి ఉంటుంది.

09/24/2016 - 03:15

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: సంవత్సరానికి కోటిన్నర టర్నోవర్ కలిగిన వ్యాపార సంస్ధలు, పరిశ్రమలపై నియంత్రణాధికారాలను రాష్ట్రాలకే అప్పగించేందుకు కేంద్రం అంగీకరించినట్టు తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన శుక్రవారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ రెండవ సమావేశానికి ఆర్థిక మంత్రి రాజేందర్ హాజరయ్యారు.

Pages