S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/22/2016 - 14:27

హైదరాబాద్: కర్నూలులో కృష్ణా రివర్ బోర్డు కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని వైసీపీ నేతలు అవినాష్‌రెడ్డి, రఘురాంరెడ్డి శుక్రవారం సీఎస్ టక్కర్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి 874 అడుగుల నీరు చేరేవరకు కిందకు విడుదల చేయరాదని, తెలంగాణ అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను ఆపాలని కోరారు.

07/22/2016 - 14:24

హైదరాబాద్: హైదర్‌గూడ‌లో అదృశ్యమైన చిన్నారులు మాధవి, వైష్ణవిలను శుక్రవారం పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. రెండు రోజుల క్రితం ఇద్దరు చిన్నారులు అదృశ్యమయ్యారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తల్లి కొట్టడం వల్లే మాధవి తాతగారింటికి పారిపోయిందని, తానూ వస్తానని చెప్పడంతో వైష్ణవిని తీసుకెళ్లిందని పోలీసులు తెలిపారు.

07/22/2016 - 14:22

విజయవాడ: కంచికచర్ల మండలం దొనబండ దగ్గర గ్రానైట్‌ క్వారీలో శుక్రవారం బ్లాస్టింగ్ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

07/22/2016 - 14:14

విజయవాడ: 4,548 పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ ఏపీ డీజీపీ రాముడు శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఏపీ స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు పేరుతో వెబ్‌సైట్‌‌ను ప్రారంభించారు. ఉద్యోగాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నట్లు డీజీపీ తెలిపారు.

07/22/2016 - 13:56

చెన్నై: శుక్రవారం ఉదయం తాంబరం నుంచి పోర్టుబ్లెయిర్‌కు బయలుదేరిన ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన విమానం గల్లంతయ్యింది. ఉదయం 8.12 గంటల సమయంలో రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి. 29 మంది సిబ్బందితో బయలుదేరిన ఏఎన్‌-32 విమానం ఆచూకీ తెలుసుకునేందుకు ఎయిర్‌ఫోర్స్‌తో పాటు తీర రక్షక, నౌకాదళాల బృందాలు గాలిస్తున్నాయి. విమానం బంగాళాఖాతంలో కూలిపోయిందా? దారి మళ్లిందా ?

07/22/2016 - 12:29

విజయవాడ: పట్టిసీమ సాగునీటి ప్రాజెక్టును రికార్డు స్థాయిలో పూర్తి చేసి కృష్ణాడెల్టాను ఆదుకున్నామని ఎపి సిఎం చంద్రబాబు అన్నారు. కృష్ణాడెల్టా ప్రజాప్రతినిధులు, టిడిపి నేతలు, అధికారులతో ఆయన శుక్రవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పట్టిసీమ ప్రాజెక్టుతో పంటలు సమృద్ధిగా పండి పల్లెల్లో పండగ శోభ నెలకొనడం ఖాయమన్నారు. ప్రతి రైతు కళ్లలో ఆనందం కనపడాలన్నదే తన ధ్యేయమన్నారు.

07/22/2016 - 12:28

నల్గొండ: పిల్లాయిపల్లి కాల్వ ద్వారా తమ పొలాలకు సాగునీటిని అందించాలని డిమాండ్ చేస్తూ రైతులు తెలంగాణ విద్యుత్ మంత్రి జగదీశ్‌రెడ్డిని శుక్రవారం అడ్డుకున్నారు. భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం వద్ద రైతులు మంత్రి కాన్వాయ్‌ను నిలిపివేసి తమ సమస్యలను తెలిపారు. హరితహారం కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతున్న మంత్రిని రైతులు అడ్డగించడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు.

07/22/2016 - 12:27

మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లాలో చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరాం అన్నారు. తమ పొలాలకు నీళ్లు వస్తాయా? రావా? అని కొందరు, తమ ప్రాంత భూములకు తగిన నష్టపరిహారం ఇస్తారా? ఇవ్వరా? అని ఇంకొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఈ ప్రాజెక్టును రెండు దశల్లో చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

07/22/2016 - 12:27

విజయవాడ: చిట్టీల పేరుతో కోటి రూపాయలు వసూలు చేసిన ఓ మహిళ కనిపించకుండా పోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. నూజివీడులో నాగరత్నం అనే మహిళ చిట్టీల వ్యాపారం నిర్వహిస్తూ కొంతమంది నుంచి కోటిరూపాయల మేరకు వసూలు చేసింది. ఆమె ఆచూకీ లేకపోవడంతో బాధితులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నాగరత్నం ఇంటి ముందు వారు ధర్నాకు దిగారు.

07/22/2016 - 12:26

హైదరాబాద్: నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులకు, రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న అక్రమ హోర్డింగ్‌లు, బ్యానర్లను తక్షణం తొలగించాలని మున్సిపల్ మంత్రి కెటిఆర్ శుక్రవారం నాడు జిహెచ్‌ఎంసి అధికారులను ఆదేశించారు. తన హోర్డింగ్‌ల విషయంలోనూ మినహాయింపు ఇవ్వనక్కర్లేదన్నారు. అక్రమ హోర్డింగ్‌ల వల్ల ప్రమాదాలు జరిగితే అందుకు అధికారులే బాధ్యత వహించాలన్నారు.

Pages