అక్రమ హోర్డింగ్లు కనిపిస్తే చర్యలు తప్పవు: కెటిఆర్
Published Friday, 22 July 2016హైదరాబాద్: నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులకు, రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న అక్రమ హోర్డింగ్లు, బ్యానర్లను తక్షణం తొలగించాలని మున్సిపల్ మంత్రి కెటిఆర్ శుక్రవారం నాడు జిహెచ్ఎంసి అధికారులను ఆదేశించారు. తన హోర్డింగ్ల విషయంలోనూ మినహాయింపు ఇవ్వనక్కర్లేదన్నారు. అక్రమ హోర్డింగ్ల వల్ల ప్రమాదాలు జరిగితే అందుకు అధికారులే బాధ్యత వహించాలన్నారు.