S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/05/2016 - 01:37

కాకినాడ సిటీ, జూలై 4: జిల్లాలోని కడియం మండల పరిధిలో ఉన్న నర్సరీ రైతులకు 500 సౌరశక్తితో పనిచేసే పంపుసెట్లను ఏర్పాటు చేయనున్నట్టు జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ తెలిపారు.

07/05/2016 - 01:37

కాకినాడ, జూలై 4: జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు అమలుచేసే శాఖలు తమ లక్ష్యాల సాధనలో ఉత్తమ పద్ధతులు పాటించటం ద్వారా మంచి ఫలితాలు పాటించవచ్చని జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లోని కోర్టు హాలులో జిల్లాలో జరుగుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆయా శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.

07/05/2016 - 01:36

రాజమహేంద్రవరం, జూలై 4: రివర్ సిటీ రాజమహేంద్రవరంలో కోట్లు కుమ్మరిస్తున్నా ముంపు సమస్య కొలిక్కి రావడం లేదు.. భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా పూర్వం నుంచీ వున్న చెరువులు ఆక్రమణలకు గురి కావడం, అభివృద్ధి పేరిట పూడుకుపోవడంతో నగరంలో కోట్ల నిధులు కుమ్మరించి పనులు చేపడుతున్నా కాసింత వర్షానికే ముంపు సమస్య తప్పడం లేదు. సరే ఇపుడు తాజాగా నగరంలో రూ.7.50 కోట్లతో డ్రెయిన్ల ఆధునీకరణ చేపట్టారు.

07/05/2016 - 01:35

డి గన్నవరం, జూలై 4: ఊపిరి ఉన్నంత వరకూ కాపుజాతి హక్కుల కోసం అలుపెరుగని పోరాటం సాగిస్తానని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. ఆయన సోమవారం పి గన్నవరం గ్రామం బోడపాటివారి పాలెంలో కృతజ్ఞతాపూర్వక పర్యటనలో భాగంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికలప్పుడు కాపు జాతికి ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చమని కోరుతున్నాను తప్ప, వేరే ఏ రాజకీయ దురుద్దేశం తనకు లేదన్నారు.

07/05/2016 - 01:35

మండపేట, జూలై 4: మండలంలోని చినద్వారపూడిలో సిసి రోడ్డు కాలువలోకి కుంగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో స్థానికులు అనేక ఇక్కట్లకు గురయ్యారు. గ్రామంలో ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న పంట కాలువకు రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు చేపట్టారు. ఈ క్రమంలో రోడ్డును ఆనుకుని సుమారు 7 అడుగుల లోతుకు మట్టిని తవ్వించారు.

07/05/2016 - 01:34

శంఖవరం, జులై 4: ప్రత్తిపాడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జిగా ఉన్న పర్వత శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి సమక్షంలో హైదరాబాద్‌లో సోమవారం వైసిపిలో చేరారు. మండల కేంద్రమైన శంఖవరం గ్రామానికి చెందిన పర్వత ప్రసాద్ దివంగత మాజీ ఎమ్మెల్యే పర్వత సుబ్బారావు అన్న కుమారుడు.

07/05/2016 - 01:34

కొత్తపేట, జూలై 4: నిర్మాణంలో ఉన్న వంతెనకు సమీపంలోనే అక్రమంగా ఇసుక తవ్వకాలు చేస్తుండటంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. మండల పరిధిలోని వాడపాలెం శివారు నారాయణలంక తొగరపాయపై సుమారు కోటి ఎనభై లక్షల వ్యయంతో వంతెన నిర్మాణం ప్రారంభించారు. చాలాకాలంగా వంతెన కోసం ప్రయత్నాలు జరిగినా చివరకు నిర్మాణ పనులు ఇటీవలే ప్రారంభమయ్యాయి.

07/05/2016 - 01:33

అల్లవరం, జూలై 4: బోడసకుర్రు - పాశర్లపూడి వంతెనపై సోమవారం మారుతీ కారుకు నిప్పంటుకుని పూర్తిగా కాలిపోయింది. ప్రమాదం సమయంలో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు బయటకు దూకేయడంతో ప్రాణ నష్టం తప్పింది. కారు అమలాపురం వైపు నుండి పాశర్లపూడి వెడుతుండగా వంతెన మధ్యకు వచ్చేసరికి మంటలు చెలరేగాయి. ఈ సందర్భంగా వంతెనపై సుమారు గంటసేపు రాకపోకలు నిలిచిపోయాయి. అల్లవరం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

07/05/2016 - 01:32

అమలాపురం, జూలై 4: దేశ స్వాతంత్య్ర పోరాటంలో స్ఫూర్తిదాయకమైన పాత్ర నిర్వహించిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు చిరస్మరణీయుడని ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. అల్లూరి 120వ జయంతిని పురస్కరించుకుని సోమవారం అమలాపురం రూరల్ మండలం వనె్నచింతలపూడి గ్రామంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో రాజప్ప ముఖ్య అతిథిగా పాల్గొని అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

07/05/2016 - 01:32

రావులపాలెం, జూలై 4: అధికారం కోసం గత ఎన్నికల సమయంలో ప్రజలకు ఎన్నో హామీలిచ్చిన చంద్రబాబు నేడు ఆ హామీలను తుంగలోకి తొక్కి అన్ని వర్గాల ప్రజలను మోసగించారని, దీనిపై కాంగ్రెసు ప్రజల పక్షాన నిలబడి ఇక నుండి నెలకొక ఆందోళన ద్వారా ప్రభుత్వంపై వత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తుందని డిసిసి అధ్యక్షుడు కందుల దుర్గేష్ అన్నారు. సోమవారం రావులపాలెం సిఆర్సీ ఆడిటోరియంలో డిసిసి సమావేశం జరిగింది.

Pages