S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కొలిక్కిరాని ముంపు సమస్య

రాజమహేంద్రవరం, జూలై 4: రివర్ సిటీ రాజమహేంద్రవరంలో కోట్లు కుమ్మరిస్తున్నా ముంపు సమస్య కొలిక్కి రావడం లేదు.. భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా పూర్వం నుంచీ వున్న చెరువులు ఆక్రమణలకు గురి కావడం, అభివృద్ధి పేరిట పూడుకుపోవడంతో నగరంలో కోట్ల నిధులు కుమ్మరించి పనులు చేపడుతున్నా కాసింత వర్షానికే ముంపు సమస్య తప్పడం లేదు. సరే ఇపుడు తాజాగా నగరంలో రూ.7.50 కోట్లతో డ్రెయిన్ల ఆధునీకరణ చేపట్టారు. 13వ ఫైనాన్స్ కమిషన్ నిధులతో ఈ పనులు చేపట్టారు. ప్రస్తుతం ఈ నిధులతో డ్రెయిన్లను లోతు చేయడం, వెడల్పు చేయడం వంటి పనులు చేపట్టారు. ఈ పనులతో లోతట్టు, పల్లపు ప్రాంతాల ముంపు బెడదకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నారు. వాస్తవానికి పూర్వం వర్షాకాలంలో కంబాలచెరువు నిండిన తర్వాత అక్కడ నుంచి నీరు ఆర్యాపురంలోని చెరువు నిండేది. అక్కడ నుంచి ఆవ కాల్వలోకి చేరేది. ఇది సహజసిద్ధంగా జరిగేది. అయితే అభివృద్ధి పేరిట ఈ చెరువులన్నీ ఆక్రమణలకు గురికావడం, కుంచించుకుపోవడంతో ముంపు బెడద ముంచెత్తుతోంది. కాసింత వర్షానికే నగరంలోని రోడ్లన్నీ జలదిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి. కారల్ మార్స్క్ రోడ్డు, రైల్వే స్టేషన్ రోడ్డు, ఇన్నీసుపేట, సీతంపేట, ఆర్యాపురం, లలితానగర్, కృష్ణానగర్, శేషయ్యమెట్ట, గాంధీ నగర్, ఆల్కట్ గార్డెన్స్ తదితర ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. దీంతో కంబాలచెరువు వద్ద లిఫ్ట్ పెట్టి ఆవ ఛానల్‌కు మురుగునీరు మళ్లించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీతో ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అంచనా వేసి ప్రస్తుతం జరుగుతున్న డ్రెయిన్ల ఆధునీకరణతో పాటు రూ.700 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణానికి ప్రతిపాదించారు. గోదావరి నది ప్రక్షాళనతో పాటు నగరంలోని ముంపు సమస్య కూడా శాశ్వతంగా కనుమరుగవుతుందని అంచనా వేస్తున్నారు.