S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/05/2016 - 01:30

తిరుపతి, జూలై 4: చిల్లర నాణేలు, పాత నోట్ల పరకామణికి త్వరలో నూతన భవనం నిర్మిస్తున్నట్లు టిటిడి కార్యనిర్వాహణాధికారి డాక్టర్ డి.సాంబశివరావు తెలిపారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో సోమవారం పరకామణి సేవలో ఇఓ పాల్గొన్నారు.

07/05/2016 - 01:30

మదనపల్లె, జూలై 4: తన అవినీతి అక్రమాలపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయించారంటూ ఆగ్రహించిన మదనపల్లె మున్సిపల్ మెప్మా ప్రాజెక్టులో పనిచేస్తున్న పిఆర్‌పి అదే సంస్థలో పనిచేస్తున్న సిఓ కుటుంబంపై అర్ధరాత్రి దాడికి పాల్పడిన పిఆర్‌పి ఉమేష్‌రావును వెంటనే సస్పెండ్ చేయాలని సోమవారం పట్టణ మహిళా సంఘాలు, సమాఖ్య లీడర్లు, దళిత, గిరిజన ప్రజాసంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

07/05/2016 - 01:29

తిరుపతి, జూలై 4: శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు అన్నప్రసాదాల తయారీ, ఇతర టిటిడి అవసరాలకు సంబంధించి బియ్యం, పప్పుదినుసులు, జీడిపప్పు తదితర సరుకులను 15 రోజులకు సరిపడా నిల్వ ఉంచుకోవాలని టిటిడి ఇఓ డాక్టర్ డి.సాంబశివరావు మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల కార్యాలయంలో సోమవారం సీనియర్ అధికారులతో ఇఓ వారపు సమీక్షా సమావేశం నిర్వహించారు.

07/05/2016 - 01:28

తిరుపతి, జూలై 4: రంజాన్ తోఫా పంపిణీలో ప్రొటోకాల్‌ను విస్మరించడంపై టిడిపి నేతలతో వైకాపా నేతలు వాగ్వివాదానికి దిగిన నేపథ్యంలో టిడిపి కార్యకర్తల దాడుల్లో గాయపడ్డ నగిరి మునిసిపల్ చైర్మన్ శాంతాకుమారిని మెరుగైన వైద్యం కోసం చెన్నైకి తరలించారు. ఆదివారం వైకాపా, టిడిపి నాయకుల మధ్య జరిగిన ఘర్షణలో శాంతాకుమారితో పాటు మరో ఇద్దరు కౌన్సిలర్లు కూడా గాయాలకు గురైన విషయం పాఠకులకు విధితమే.

07/05/2016 - 01:27

శ్రీకాళహస్తి, జూలై 4: శ్రీకాళహస్తీశ్వరాలయం సోమవారం భక్తులతో కిటకిటలాడింది. అమావాస్యకావడంతో తెల్లవారుజాము నుంచే రద్దీ మొదలైంది. స్వామి, అమ్మవార్లను దర్శించుకోవడానికి, రాహు-కేతు పూజలు చేయించుకోవడానికి భక్తులు ఒక్కసారిగా రావడంతో ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఇటీవల ఇఓ భ్రమరాంబ లోపల క్యూలైన్లను మార్పులు చేయడం వల్ల భక్తులు క్యూలైన్లలోకి వెళ్లలేకపోయారు.

07/05/2016 - 01:26

తిరుపతి, జూలై 4: గత కొంత కాలంగా స్పాండిలైటిస్ వ్యాధితో బాధపడుతూ బర్డ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సినీ నటుడు మాదాల రంగారావు ఆరోగ్యం కుదుట పడిందని సిపిఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు తెలిపారు. బర్డ్‌లో ఉన్న మాదాల రంగారావును సిపిఐ నేతలు పరామర్శించారు.

07/05/2016 - 01:25

తిరుపతి, జూలై 4: తిరుపతి నగర పాలక సంస్థలోని శివజ్యోతి నగర్‌లో కాలువ నిర్మాణాలు చేపట్టకపోవడంతో స్థానిక ప్రజలు గత ఎంతో కాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మీరైనా సమస్యలు పరిష్కరించాలని రాయలసీమ పోరాటసమితి కన్వీనర్ నవీన్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి నేతృత్వంలో సోమవారం నగర పాలక సంస్థ కమిషనర్ వినయ్‌చంద్‌కు కాలనీ వాసులు విజ్ఞప్తిచేశారు.

07/05/2016 - 01:24

చిత్తూరు, జూలై 4: కలెక్టరేట్‌లో వ్యక్తి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డ సంఘటన సోమవారం చోటు చేసుకొంది. ప్రజావాణి కార్యక్రమం ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరగడం ఆనవాయితీ, ఈ క్రమంలో ఎస్ ఆర్ పురం మండలం పిల్లిగుండ్ల గ్రామానికి చెందిన క్రిష్ణయ్య (41) ప్రజావాణి కార్యక్రమానికి వచ్చాడు.

07/05/2016 - 01:24

వెదురుకుప్పం, జూలై 4: మండలంలోని బాలుపల్లికి భాస్కర్‌రెడ్డి అనే రైతు టిప్పర్ బోల్తా పడటంతో గాయపడి మంగళవారం మృతిచెందాడు. మృతుడు వ్యవసాయ పనుల నమిత్తం ట్రాక్టర్ తోలుతూ వెళ్తుండగా వాహనం అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో భాస్కర్‌రెడ్డి ట్రాక్టర్ కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. భాస్కర్‌రెడ్డికి ఇద్దరు పిల్లలు, భార్య ఉన్నారు. మృతుడి కుటుంబాన్ని ఎమ్మెల్యే నారాయణ స్వామి పరామర్శించారు.

07/05/2016 - 01:23

తిరుపతి, జూలై 4: ట్రాన్స్‌కో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అప్పయ్యదొర పదవీ కాలాన్ని మరో రెండేళ్లపాటు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2013 ఆగస్టు 30న ట్రాన్స్‌కో సిఎండిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. మూడేళ్లుగా సిఎండిగా కొనసాగేందుకు ప్రభుత్వం అప్పుడు ఉత్తర్వులు జారీచేసింది.

Pages