S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/09/2016 - 23:17

ఆసిఫాబాద్, డిసెంబర్ 9: మాతా శిశుమరణాలు అరికట్టేందుకు వైద్య ఆరోగ్య సిబ్బంది గ్రామీణ ప్రాంత ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని కుమ్రం భీం జిల్లా కలెక్టర్ చంపాలాల్ అన్నారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో వైద్య ఆరోగ్యశాఖ అధ్వర్యం లో గర్భిణీల కోసం ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

12/09/2016 - 23:16

ఆదిలాబాద్, డిసెంబర్ 9: దేశాన్ని పట్టిపీడిస్తున్న అవినీతి వ్యవస్థను కూకటివేళ్ళతో పెకిలించేలా ప్రతి ఒక్కరు అవినీతిరహిత సమాజం, దేశాభివృద్దికోసం భాగస్వాములుకావాలని కలెక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి పిలుపునిచ్చారు. శుక్రవారం జడ్పీ సమావేశ మందిరంలో జిల్లా అవినీతి నిరోధక శాఖ అధ్వర్యంలో అవినీతి వ్యతిరేక వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

12/09/2016 - 23:05

తూప్రాన్, డిసెంబర్ 9: డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి వాహనానికి స్వల్ప ప్రమాదం జరిగింది. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి శుక్రవారం ఉదయం చేగుంటలో ఓ వివాహానికి హాజరై హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమైంది. మనోహరాబాద్ శివారులో ఆమె వెళ్తున్న వాహనానికి ముందుగా వెళ్తున్న తూప్రాన్ పోలీసుల ఎస్కార్ట్ వాహనానికి ఆకస్మికంగా ఓ ఆటో అడ్డు రావడంతో పోలీస్ వాహనానికి సడన్ బ్రేక్ వేశారు.

12/09/2016 - 23:04

నారాయణఖేడ్ డిసెంబర్ 9: నారాయణఖేడ్ నియోజకవర్గం వెనకబడి ఉందని, ఇందుకు కారణం గత పాలకులేనని తేలిందని, అందుకుగాను ఉప ఎన్నికలకు ముందు నుంచి ఖేడ్‌ను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకున్నామని ఉప ఎన్నికల్లో రైతులకు ప్రజలకు ఇచ్చిన మాట నిలుపుకున్నట్లు భారీ నీటి పారుదలశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు తెలిపారు.

12/09/2016 - 23:04

సంగారెడ్డి టౌన్, డిసెంబర్ 9: కాంగ్రెస్ పార్టీ మెడలు వంచ్చేంత దమ్ము,్ధర్యం కెటిఆర్‌కు ఉందా? నీ వయస్సు ఎంత.. నీ రాజకీయ అనుభవమేంత? అని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి (జగ్గారెడ్డి) ప్రశ్నించారు. కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ సాధించుకున్నామంటూ గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.

12/09/2016 - 23:03

నర్సాపూర్,డిసెంబర్ 9: అఖిలభారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ బర్త్‌డే సందర్భంగా శుక్రవారంనాడు కెక్ కట్ చేసి ఘనంగా జరుపుకొన్నారు. నర్సాపూర్‌లోని అంధుల పాఠశాల భవనంలో మాజీ మంత్రి, డిసిసి అధ్యక్షురాలు సునీతారెడ్డి ఆధ్వర్యంలో సోనియాగాంధీ బర్త్‌డేను ఘనంగా జరుపుకొన్నారు. ఈసందర్భంగా కెక్ కట్ చేసి అంధ విద్యార్థులకు పంచిపెట్టారు.

12/09/2016 - 23:03

గజ్వేల్, ములుగు, డిసెంబర్ 9: ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలలో ఎక్కడ చూసినా చెట్లతో పచ్చగా, నిండుగా కనిపించాలని ముఖ్యమంత్రి కార్యాలయం ఒఎస్టీ ప్రియాంక వర్గీస్ పేర్కొన్నారు. ఈ రెండు గ్రామాలలో హరితహారం క్రింద మొక్కలు నాటుతుండడాన్ని ఆమె శుక్రవారం జిల్లా కలెక్టర్ వెంకట్‌రాంరెడ్డితో కలిసి పరిశీలించారు.

12/09/2016 - 23:02

మెదక్, డిసెంబర్ 9: డాక్టర్ బిఆర్.అంబేద్కర్ ఆశయాలను గత కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని బిజెపి రాష్ట్ర కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం మెదక్ జికెఆర్ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డాక్టర్ బిఆర్.అంబేద్కర్ ఆశయాలను అనుగుణంగా దేశంలో ప్రతి ఒక్కరు సమానులుగా ఉండాలనే భావనతో పద్దనోట్లను ప్రధాని మోదీ రద్దు చేశారని ఆయన తెలిపారు.

12/09/2016 - 23:00

నల్లగొండ, డిసెంబర్ 9: ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతోనే అవినీతి రహిత సమాజం సాధ్యమవుతుందని ఇందుకు ప్రజలంతా బాధ్యతగా ముందుకు రావాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రం అంబేద్కర్ భవన్‌లో జిల్లా అవినీతి నిరోధక శాఖ నిర్వహించిన అవినీతి నిరోధక దినోత్సవ సదస్సును ఆయన ప్రారంభించి ప్రజలు, అధికారులు, విద్యార్థులతో అవినీతి వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు.

12/09/2016 - 23:00

కనగల్, డిసెంబర్ 9: పెండింగ్ ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని, కెజి టూ పిజి ఉచిత విద్య హామీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్సీ, ఎస్టీ, బిసి విద్యార్ధి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ముందు ఒక్కరోజు దీక్షను నిర్వహించారు.

Pages