S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/09/2016 - 23:47

కర్నూలు, డిసెంబర్ 9:మానవ జీవితంతో పెనవేసుకుపోయిన అవినీతి మహమ్మారిని పూర్తిస్థాయిలో నియంత్రించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై వుందని కలెక్టర్ విజయమోహన్ సూచించారు. కలెక్టరేట్‌లోని సమావేశ భవనంలో శుక్రవారం అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ అవినీతి అనేది ప్రతి ఒక్కరిలో ఆలోచన రేకత్తించే అంశమన్నారు.

12/09/2016 - 23:46

కర్నూలుసిటీ, డిసెంబర్ 9:ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ పాలన స్వర్ణయుగం లాగా నడిచిందని, అయితే ప్రస్తుత టిడిపి ప్రభుత్వం పేదల ప్రాణాలతో చెలగాటం ఆడుతుందని వైకాపా రాష్ట్ర కార్యదర్శి బివై రామయ్య విమర్శించారు. వైకాపా జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి అధ్యక్షతన శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు.

12/09/2016 - 23:46

కర్నూలుసిటీ, డిసెంబర్ 9:గత కాంగ్రెస్ పదేళ్ల పాలనలో పతనమైన ప్రజారోగ్య వ్యవస్థను పట్టాలెక్కించి ప్రతి కుటుంబానికి ఆరోగ్య భద్రత కల్పించటమే లక్ష్యంగా సిఎం చంద్రబాబు పాలన కొనసాగిస్తున్నారని టిడిపి జాతీయ క్రమశిక్షణ కమిటీ సభ్యులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.

12/09/2016 - 23:45

బేతంచెర్ల, డిసెంబర్ 9:నగదు కోసం బ్యాంకుకు వెళ్లగా అక్కడ నో క్యాష్ బోర్డు దర్శనం ఇవ్వడంతో ఆగ్రహించిన ఖాతాదారులు శుక్రవారం పట్టణంలోని ఎస్‌బిఐ శాఖ ముందు నగదు కోసం రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. పారిశ్రామిక కేంద్రమైన బేతంచెర్లతో పాటు ఆర్‌ఎస్ రంగాపురం ఎస్‌బిఐ శాఖల్లో పెద్ద నోట్లు రద్దు అయినప్పటి నుంచి ఖాతాదారులకు సక్రమంగా నగదు అందలేదు.

12/09/2016 - 23:43

కడప,డిసెంబర్ 9: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అత్యంత విలువైన బేరియం ఖనిజసంపద రైల్వేకోడూరు మంగంపేట గనుల్లో లభ్యవౌతుండటంతో ఏపిఎండిసిచే గనుల నిర్వాసిత ప్రాంతాల్లో వౌలిక సదుపాయాలు కల్పించాల్సివుంది. అయితే ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధిసంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వెంకయ్య చౌదరి గనుల ప్రాంతంలోని నిర్వాసితుల ప్రాంతాలకు వౌలిక సదుపాయాలు కల్పిస్తామని ప్రతి ఏటా రూ.8కోట్లు ఖర్చు చేస్తామని పేర్కొన్నారు.

12/09/2016 - 23:43

ముద్దనూరు, డిసెంబర్ 9: జిల్లాలోనే మొదటిసారిగా సిండికేట్‌బ్యాంక్ దత్తత తీసుకున్న యామవరం గ్రామాన్ని బ్యాంక్ ఆధ్వర్యంలో నగదురహిత గ్రామంగా చేసేందుకు ప్రణాళికలు సిద్ధంచేయడం జరిగిందని కలెక్టర్ కెవి.సత్యనారాయణ పేర్కొన్నారు.

12/09/2016 - 23:43

చింతకొమ్మదినె్న,డిసెంబర్ 9: అడవులను పరిరక్షించితే వాతావరణ కాలుష్యనివారణతోపాటు వర్షాలు సకాలంలో కురుస్తాయని ,అడవుల్లోని ఎర్రచందనాన్ని పరిరక్షించాలని అటవీ టాస్క్ఫోర్స్ సిబ్బంది పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిధిలోని ఇప్పెంట పంచాయతీ వెంకట్రామ్‌పల్లెలో ఎర్రచందనం పరిరక్షణపై అవగాహన సదస్సులు ప్రజలకు వివరించారు.

12/09/2016 - 23:42

ఎర్రగుంట్ల,డిసెంబర్ 9: కేంద్రప్రభుత్వం తీసుకున్న నోట్లరద్దు గ్రామీణ రైతాంగాన్ని కరెన్సీ కష్టాల్లో ముంచింది. పట్టణ ప్రాంతాల్లో వ్యాపార లావాదేవీలతో ఎంతోకొంత నగదు దొరుకుతోంది. అదే గ్రామీణ ప్రాంతాల్లో రైతు పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది.

12/09/2016 - 23:42

కమలాపురం, డిసెంబర్ 9: గ్రామీణ స్థాయి పాఠశాలల నుంచే విద్యార్థులకు క్రీడలపట్ల మక్కువపెంచి ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని డిఈవో ప్రతాపరెడ్డి అన్నారు. ఆయన మండల పరిధిలోని పెద్దచెప్పల్లి బాలుర జడ్పీ హైస్కూల్లో మూడురోజులుగా జరుగుతున్న యర్రగుంట్ల జోనల్‌మీట్ క్రీడల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.

12/09/2016 - 23:41

కడప,డిసెంబర్ 9: ఆరోగ్యమే మహాభాగ్యమన్న నినాదంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రూపొందించిన ఆరోగ్యశ్రీపై చంద్రబాబునాయుడు ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు చేపట్టిందని ఈ పథకాన్ని నిర్లక్ష్యం చేయడం పేద ప్రజలకు అన్యాయం చేయడమేనని పలువురు వైకాపా నేతలు తీవ్రంగా విమర్శించారు. పార్టీ అధిష్ఠానం పిలుపుమేరకు శుక్రవారం స్థానిక కలెక్టరేట్ ఎదుట వైకాపా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా జరిగింది.

Pages