S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/09/2016 - 23:40

నెల్లిమర్ల, డిసెంబర్ 9: ప్రజలు నగదు రహిత లావాదేవీలు అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ కోరారు. శుక్రవారం మండలంలోని దన్నానపేట గ్రామంలో వెలుగు ఆధ్వర్యంలో నగదు రహిత కార్యకలాపాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిల్లర సమస్య తీరాలంటే ఈ విధానాన్ని వినియోగించాలన్నారు.

12/09/2016 - 23:39

విజయనగరం, డిసెంబర్ 9: పొట్ట చేతపట్టుకొని కూలీ పనుల కోసం హైదరాబాద్ వెళ్లిన కూలీల బతుకులు చిద్రమయ్యాయి. నిర్మాణంలో ఉన్న ఏడు అంతస్తుల భవనం పేక మేడలా కుప్పకూలిన సంఘటనలో జిల్లాకు చెందిన తల్లికూతురు మృత్యువాతపడ్డారు. వీరు బలిజపేట మండలం చిలకలపల్లికి చెందిన వారుగా గుర్తించారు. గురువారం రాత్రి 9.30 గంటల సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.

12/09/2016 - 23:38

విజయనగరం, డిసెంబర్ 9: వచ్చే ఏడాది జనవరి నుంచి ఆర్టీసీలోని అన్ని బస్సులకు అడ్వాన్స్ బస్ ఎంక్వైరీ సిస్టమ్ విధానాన్ని అమలుచేయనున్నట్టు ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ మాలకొండయ్య వెల్లడించారు. శుక్రవారం ఆయన ఆర్టీసీ వర్క్‌షాపు, బస్సు డిపోలను పరిశీలించారు.

12/09/2016 - 23:37

గజపతినగరం,డిసెంబర్ 9: ఆర్థిక వెనుకబాటు ప్రాతిపదికన అగ్రవర్ణ పేదలకు విద్య ఉద్యోగ రిజర్వేషన్లను కల్పించాలనే డిమాండ్‌తో జాతీయ ఉద్యమం నిర్వహిస్తామని ఓసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కరుణాకరరెడ్డి అన్నారు.

12/09/2016 - 23:37

విజయనగరం (్ఫర్టు), డిసెంబర్ 9: ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడం ద్వారా ఆదాయాన్ని పెంచేందుకు కృషి చేయాలని, తద్వారా నష్టాలను తగ్గించాలని ఆర్టీసీ వైస్‌చైర్మన్, మేనేజింగ్‌డైరెక్టర్ ఎం.మాలకొండయ్య కోరారు. పట్టణంలో జోనల్‌వర్క్స్‌షాపు, ఆర్టీసీ డిపోలను శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నష్టాల ఊబిలో ఉన్న సంస్థను కాపాడుకోవల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

12/09/2016 - 23:36

విజయనగరం (్ఫర్టు), డిసెంబర్ 9: మున్సిపల్ కౌన్సిల్ సమావేశం సాదాసీదాగా జరిగింది. మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ అధ్యక్షతన శుక్రవారం జరిగిన సమావేశంలో కౌన్సిల్ సభ్యులు గతానికి భిన్నంగా అరుపులు, కేకలు లేకుండా అజెండాలో పొందుపర్చిన అంశాలను ఆమోదించారు. ఈ సందర్భంగా చైర్మన్ రామకృష్ణ మాట్లాడుతూ పట్టణ అభివృద్ధిపై అధికారులు దృష్టి సారించారు.

12/09/2016 - 23:18

బెజ్జూర్, డిసెంబర్ 9: భర్త చేతిలో భార్య దారుణహత్యకు గరైన సంఘటన బెజ్జూర్ మండలంలో శుక్రవారం సంచలనం సృష్టించింది. ఈ సంఘటనకు సంబంధింన వివరాలు కౌటాల సిఐ అచ్చేశ్వర్ రావు కథనం ప్రకారం ఇలా ఉన్నాయి. మండలంలోని పాపన్‌పేట గ్రామానికి చెందిన ఉబిడె శకుంతల (28)ను ఆమె భర్త సురేష్ గురువారం రాత్రి గొంతుకోసి హత్యచేసినట్లు సిఐ తెలిపారు. గతేడాది శకుంతల, సురేష్‌లకు బెజ్జూర్ రంగనాయకుల ఆలయంలో ప్రేమవివాహం జరిగింది.

12/09/2016 - 23:18

ఆదిలాబాద్ టౌన్, డిసెంబర్ 9: మున్సిపాలిటీలోని 36 వార్డుల్లో దశలవారీగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అన్ని రంగాల్లో అభివృద్ది పర్చేందుకు కృషిచేయడం జరుగుతుందని చైర్‌పర్సన్ రంగినేని మనీషా అన్నారు. శుక్రవారం పట్టణంలోని 21, 3 వార్డుల్లో సిసి రోడ్డు, మురికి కాలువల పనులకు చైర్‌పర్సన్ శంకుస్థాపన చేశారు.

12/09/2016 - 23:17

మంచిర్యాల, డిసెంబర్ 9: రైతులు నష్టపోకుండా సన్నరకం వరి ధాన్యంను మిల్లర్లు కొనేలా అధికారులు శ్రద్ద చూపాలని జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయం సమావేశం మందిరంలో వరి ధాన్యం కొనుగోలుపై పౌర సరఫరాలు డీ ఆర్‌డీ ఓ, ఐకేపీ అధికారులతో సమావేశం నిర్వహించారు.

12/09/2016 - 23:17

మంచిర్యాల, డిసెంబర్ 9: మున్సిపల్ పాలక వర్గం పాలన అధ్వానంగా ఉందని అభివృద్ది పేరుతో నిధులు దుర్వినియోగం చేస్తున్నారని అధికార ప్రతిపక్ష పార్టీల కౌన్సిలర్లు మండి పడ్డారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయం ఆవరణంలోని ఐకేపి భవనం నిర్వహించిన అత్యవసర సమావేశం చైర్‌పర్సన్ వసుంధర అధ్యక్షతన జరిగింది.

Pages