S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/10/2016 - 00:22

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి రోజూ పెద్దనోట్ల రద్దుపై రాజ్యసభలో గొడవ చేసిన ప్రతిపక్షం శుక్రవారం రూటు మార్చింది. గోధుమల దిగుమతిపై సుంకాన్ని పూర్తిగా తొలగించడం ద్వారా ఎన్‌డిఏ ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను దెబ్బ తీసిందంటూ ప్రతిపక్షం శుక్రవారం రాజ్యసభను స్తంభింపజేసింది.

12/10/2016 - 00:15

ఫజిల్కా (పంజాబ్), డిసెంబర్ 9: పంజాబ్‌లో శుక్రవారం దట్టమైన పొగమంచు కారణంగా రెండు వాహనాలు ఢీకొనడంతో 13మంది ఉపాధ్యాయులు సహా 14 మంది దుర్మరణం చెందారు. ఫజిల్కా- జలాలాబాద్ రోడ్‌లో చాంద్‌మేరి టోల్ ప్లాజా సమీపంలో ఉపాధ్యాయులను పాఠశాలకు తీసుకెళ్తున్న వాహనం ఒక ట్రక్కును ఢీకొంది. దట్టమైన పొగమంచు కారణంగా సరిగా కనపడకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

12/10/2016 - 00:13

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చకు సిద్ధమని చెబుతూ వచ్చిన ప్రభుత్వం శుక్రవారం తోకముడించింది. నిబంధనలతో సంబంధం లేకుండా చర్చకు సిద్ధమని విపక్షం ప్రకటించగా ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ 16 రోజులు చర్చ జరగుకండా అడ్డుకున్నందుకు ప్రతిపక్షమే మొదట క్షమాపణలు చెప్పాలంటూ గందరగోళం సృష్టంచి సభ వాయిదా పడేలా చేసింది.

12/10/2016 - 00:11

వాషింగ్టన్, డిసెంబర్ 9: భారత్ బలమైన ఆర్థిక శక్తిగా శరవేగంగా ఎదుగుతోందని, అలాంటి దేశంతో వీలయినంత త్వరగా సన్నిహిత సంబంధాలు నెలకొల్పుకోవడం వల్ల ఇరు దేశాలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని అమెరికాలో ముగ్గు రు రక్షణ నిపుణులు అంటూ, అందువల్ల వీలయినంత త్వరగా భారత్‌తో సంబంధాలను పెంపొందంచుకోవాలని త్వరలో బాద్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి సలసా ఇచ్చారు.

12/10/2016 - 00:07

బెంగళూరు, డిసెంబర్ 9: తమిళనాడు మాజీ ముఖ్యమత్రి, అన్నా డిఎంకె అధినేత్రి జె.జయలలిత మరణం తర్వాత ఆ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం కొత్త రూపాన్ని సంతరించుకుంటున్నప్పటికీ ఎఐఎడిఎంకెకి, తమ పార్టీకి మధ్య పొత్తు గురించి ఇప్పుడే చర్చించడం ‘చాలా తొందరపాటు’ అవుతుందని బిజెపి సీనియర్ నాయకుడు, కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి ఎం.వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.

12/10/2016 - 00:05

చెన్నై, డిసెంబర్ 9: దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు వైద్యచికిత్స విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అంత గోప్యతను ఎందుకు పాటించిందని తమిళ నటి గౌతమి తడిమల్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రశ్నించారు. జయలలిత ఆసుపత్రిలో ఉన్న సమయంలో ఆమెను చూడటానికి ఎవరినీ ఎందుకు అనుమతించలేదని గౌతమి ప్రధాని మోదీకి రాసిన లేఖలో ప్రశ్నించారు. 68 ఏళ్ల జయలలిత గుండెపోటు కారణంగా ఈ నెల 5న ఆసుపత్రిలో మృతి చెందిన విషయం తెలిసిందే.

12/10/2016 - 00:03

శ్రీనగర్, డిసెంబర్ 9: కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు లష్కరే తోయిబా మిలిటెంట్లు హతమైనారు. 36 గంటలుగా కొనసాగిన ఎన్‌కౌంటర్ శుక్రవారం ముగిసింది. కాగా, గురువారం శాంతిభద్రతల సమస్య సందర్భంగా గురితప్పిన బులెట్ ఒకటి తగిలి పౌరుడొకరు మృతి చెందాడు.

12/10/2016 - 00:02

సియోల్, డిసెంబర్ 9: అధికార దుర్వినియోగం, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న దక్షిణ కొరియా తొలి మహిళా అధ్యక్షురాలు పార్క్ గియున్-హై అభిశంసనకు గురయ్యారు. శుక్రవారం ఆమెపై ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానాన్ని దక్షిణ కొరియా జాతీయ అసెంబ్లీ ఆమోదించింది.

12/10/2016 - 00:02

ఫతేపూర్, డిసెంబర్ 9: పెద్దనోట్ల రద్దు దేశప్రజలకు, ఆర్థిక వ్యవస్థకు అనుకోని వరమేనని హోమ్‌మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. 500,1000 నోట్ల రద్దును వ్యతిరేకిస్తున్నవారంతా నల్లకుబేరులేనని శుక్రవారం ఇక్కడ జరిగిన పరివర్తన ర్యాలీలో ధ్వజమెత్తారు. ఇప్పటి వరకూ అవినీతి కార్యకలాపాలతో అక్రమార్జన చేసినవారి ఆటకట్టయిందని అందుకే రోజువారీగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారని అన్నారు.

12/10/2016 - 00:01

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: జాతీయ దర్యాప్తు సంస్థ సిబిఐ తాత్కాలిక డైరెక్టర్‌గా రాకేష్ ఆస్థానాను నియమించడంపై సుప్రీం కోర్టు శుక్రవారం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. దేశాన్ని కుదిపేసిన 2జి స్పెక్ట్రం, బొగ్గు కుంభకోణం కేసు దర్యాప్తులను పర్యవేక్షించిన సీనియర్ అధికారి ఆర్‌కె దత్తాను పక్కనపెట్టి, తమ అనుమతి లేకుండా రాకేష్‌ను ఎలా నియమించారని కేంద్రాన్ని ప్రశ్నించింది.

Pages