S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/04/2016 - 22:32

కనిపించని సంకెళ్ళ బంధం
పెరిగిపోతున్న నీటిమట్టం
ముట్టడిస్తున్న ప్రాణభయం
పోవటమా? ఉండిపోవటమా??
అన్న ప్రశ్నలకు
మృత్యువు రెండు గొంతులతో
జవాబు చెప్తున్న వేళ
నీ పాదాల ముందు వాలుతుందొక
పులిహోర పొట్లం
మెతుకు మెతుకు మీద నీ పేరుతో
అన్నదాత సంతకంతో

12/04/2016 - 22:30

ప్రఖ్యాతి పొందిన రచనలకు లేదా అప్పటికే ప్రచురింపబడిన కథ లేదా నవలకు కొనసాగింపుగా చేసిన రచనలనే సీక్వెల్ అని అంటారు. తెలుగులో వచ్చిన సీక్వెల్ సాహిత్యాన్ని వేళ్ళమీద లెక్కబెట్టుకోవచ్చు. నవీన్ రాసిన ‘‘అంపశయ్య, ముళ్ళపొదలు, ‘‘అంతస్స్రవంతి’’ సీక్వెల్ నవలలే. ‘అంపశయ్య’ రవి విద్యార్థి జీవితాన్ని, ‘‘ముళ్ళపొదలు’’ రవి నిరుద్యోగ జీవితాన్ని, ‘‘అంతస్స్రవంతి’’ రవి ఉద్యోగ-వైవాహిక జీవితాన్ని చిత్రీకరించింది.

12/04/2016 - 22:28

నువ్వు దూర తీరాలకు తరలిపోతున్నావని
రోజంతా నా గుండె భారంగా ఉంది.
కన్నవారికి దూరంగా కనె్నపిల్ల పెళ్ళంటే,
నదిలోకి ఒక చిన్న నావను వదిలినట్టే
నీ తల్లి గతించే నాటికి నువ్వు చిన్నదానవు
అందువలన నువ్వు నా గారాలపట్టివైనావు
నిన్ను ఇంత దానిని చేసింది నీ పెద్దక్క,
ఇప్పుడు విలపిస్తున్నారిద్దరూ ఒకరినొకరు విడువలేక
ఇది నా శోకాన్ని ఘనీభవింప చేస్తూంది

12/04/2016 - 22:11

పామర సంస్కృతం - వెల: 300/-
రచన: కపిలవాయి లింగమూర్తి
- ప్రతులకు -
కె.సంధ్య అశోక్, 17-100,
వాణీసదనం, విద్యానగర్ కాలనీ,
నాగర్‌కర్నూల్. ఫోన్: 9000185437
**

12/04/2016 - 22:09

సాంఘిక జీవనంలో ఆశ్రీత జనపక్షపాతం (నెపోటిజమ్) అనేది పాలకవర్గాన్ని, అధికార పదవులలో వున్నవాళ్లను అంధులను చేస్తుంది. నిజానికి యిది లంచగొండితనం (కరప్షన్) కంటె కూడ ప్రమాదమయినది, పక్కనపెట్టవలసినదీని!

12/04/2016 - 22:01

‘్భక్తిం కిం నకరోతి అహో వనచరః భక్తా వతంసాయతే’ అంటారు శంకరాచార్యులు శివానందలహరిలో. తిన్నడు వనచరుడు. చెంచుకులములో జన్మించాడు. భక్తిశేఖరుడయ్యాడు గదా అని ప్రశంసించారు. అంగస్య కూర్చాయతే దివ్యా భిషేకాయతే నవ్యోపహారాయతే అని తిన్నడి పూజావిధానమును శివానుగ్రహ అదృష్టముగా ప్రస్తావించారు. తిన్నని భక్తి జగద్వితము.

12/04/2016 - 21:59

కృష్ణా జిల్లా దివిసీమలో వెలసిన శ్రీ దుర్గా పార్వతీ సమేత నాగేశ్వరస్వామివారి ఆలయం కృష్ణా నదీ తీరాన పెద్దకళ్ళేపల్లిలో దివ్యక్షేత్రంగా విలసిల్లుతోంది. సాధారణంగా పవిత్ర నదీ తీరాల్లో సిద్ధపురుషులు, యోగులు, మహర్షులు చిరకాల తపస్సుచేసిన కారణంగా సమీప ఆలయాలు మహిమాన్వితమైన కారణంగా వేలాది మంది యాత్రికులు ఆ క్షేత్రమును దర్శించుకుంటారు.

12/04/2016 - 21:55

ప్రపంచ సాహిత్యంలో భగవద్గీతకు సాటియైనది, దీనికి మించినది మరియొకటి లేదు. మతాల ప్రసక్తికి అతీతంగా అందరూ చదవవల్సిన గ్రంథం. ఏ మతానికి చెందిన వారికైనా సకల మానవాళి శ్రేయస్సును కోరేదీ, జ్ఞానాన్ని ప్రసాదించేదీ భగవద్గీత. పరిశీలనం చేస్తే సర్వమత సిద్ధాంతాలకనుగుణంగా ఉన్న ఏకైక గ్రంథం భగవద్గీత.

12/04/2016 - 21:53

* శివలింగం యొక్క ఆది అంతాలను కనుగొనమని విష్ణువును, బ్రహ్మను పరీక్షలో నిలపడంలో ఆంతర్యమేమిటి? బ్రహ్మ ఆవుతో అబద్ధం చెప్పించాడా?
- రామలక్ష్మి , సికింద్రాబాదు

12/04/2016 - 21:51

గర్గ మహర్షికి స్వయంగా శివుడే గురువు. గర్గుడికి అన్ని విద్యలు శివుడే నేర్పించాడు. గర్గుడు బ్రహ్మ మానస పుత్రుడు. అనేకమంది రాజులు గర్గుడిని కుల గురువుగా పెట్టుకున్నారు. ఒకసారి గర్గుడు శిష్యుల్ని తీసుకుని దేవకీ వసుదేవుల కోరిక ప్రకారం రేపల్లె వచ్చాడు. శిష్యులతో వచ్చిన గర్గ మహర్షిని చూసి యశోద సత్కారంచేసి కూర్చోమని చెప్పి.. ‘మహర్షీ మీరెవరో గొప్ప తేజస్సుతో విష్ణుమూర్తిలా ఉన్నారు.

Pages