S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/04/2016 - 20:58

రైజింగ్ డ్రీమ్ ప్రొడక్షన్స్ సమర్పణలో జ్ఞాన్, సూర్య శ్రీనివాస్, ప్రియాంకా పల్లవి ప్రధాన తారాగణంగా పరంధ్ కళ్యాణ్ దర్శకత్వంలో భాషా మజర్ రూపొందించిన చిత్రం ‘నేనొస్తా’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేశారు. ఇటీవల సినిమాకు సంబంధింన టీజర్‌ను పూరి జగన్నాధ్ విడుదల చేయగా, మంచి ఆదరణ లభించిందని నిర్మాత తెలియజేశారు.

12/04/2016 - 20:57

సన్నీలియోన్... జిస్మ్-2 సినిమా తరువాత ఇండియన్ సినిమా చరిత్రలో ఓ సంచలన తారగా నిలిచిపోయింది. అంతకుముందు పలువురు భామలు అందాలతో ప్రేక్షకులను రెచ్చగొట్టే ప్రయత్నాలెన్నో చేశారు. కానీ సన్నీ రాకతో వారందరికీ ఫుల్‌స్టాప్ పడింది. అసలే పోర్న్‌స్టార్‌గా పాపులారిటీ తెచ్చుకున్న ఈ భామను మించి అందాలు ఆరబోయడంలో అందరూ దిగదుడుపే. ఆ సినిమా తరువాత బాలీవుడ్‌ని సన్నీ ఫీవర్ పట్టేసింది.

12/04/2016 - 20:56

బాలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన క్వీన్ సినిమా దక్షిణాదిలో రీమేక్ అవుతోంది. ఇందులో లీడ్ పాత్ర పోషించి జాతీయ ఆవార్డును అందుకుంది గ్లామర్ భామ కంగనా రనౌత్. ప్రముఖ తమిళ దర్శక నిర్మాత త్యాగరాజన్ రీమేక్ హక్కులు స్వంతం చేసుకున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు మొదలుపెట్టాడు. ఒక్కో భాషలో ఒక్కో హీరోయిన్‌తో ఈ సినిమా చేయిస్తున్నారట.

12/04/2016 - 08:20

రాప్తాడు, డిసెంబర్ 3: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని, నగదు రహిత లావాదేవీలపై ప్రజలకు అవగాహన కల్పించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు.

12/04/2016 - 08:18

కడప,డిసెంబర్ 3: జిల్లా యంత్రాంగం అధికారుల సమన్వయంతో చేపట్టిన ఎలక్టోరల్ రోడ్ సంతృప్తికరంగా ఉందని, జాబితాలో ఓటర్ల ఎపిక్ కార్డు, ఫోటో వంద శాతం సాధించినందుకు యంత్రాంగాన్ని రోల్ అబ్జర్వర్ జిఎస్‌ఆర్‌కెఆర్ విజయకుమార్ అభినందించారు. ఎలక్టోరల్ రోల్ 2017కు సంబంధించి జిల్లాలో చేపట్టిన స్పెషల్ సమ్మరి రివిజన్ పై వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులు, ఇఆర్‌ఓలు, ఏఇఆర్‌ఓలతో శనివారం సాయంత్రం అబ్జర్వర్ సమీక్షించారు.

12/04/2016 - 08:16

తిరుపతి, డిసెంబర్ 3: తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారికి నిర్వహిస్తున్న కార్తీక బ్రహ్మోత్సవంలో చివరిరోజైన ఆదివారం పంచమీతీర్థ ముఖ్య ఘట్టం జరుగనుంది. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం నుంచి తన ప్రియసఖి అయిన అమ్మవారికి స్వామివారు సారెను పంపనున్నారు. ఈ సారెను తిరుమల నుంచి జె ఇ ఓ శ్రీనివాసరాజు తిరుచానూరుకు తీసుకొచ్చి జె ఇ ఓ పోలాభాస్కర్‌కు అప్పగిస్తారు.

12/04/2016 - 08:14

రాజమహేంద్రవరం, డిసెంబర్ 3: పోలవరం జాతీయ ప్రాజెక్టులో నిర్వాసితులకు భూమికి భూమి దక్కేలా కనిపించడం లేదు. ఇప్పటికీ నిర్వాసితులకు భూమికి భూమి సేకరించే పని పూర్తికాలేదు. ప్రధాన పనులకు మాత్రమే భూమి సేకరణ జరిగింది. అందుకు తగిన పరిహారం ఇచ్చారు. కొత్త ఆర్ అండ్ ఆర్ ప్రకారం నిర్వాసితులకు పరిహారం అందించాలంటే ప్రస్తుత నాబార్డు నిధుల నుంచి సరిపెట్టలేని దుస్థితి దాపురించింది.

12/04/2016 - 08:11

గుంటూరు, డిసెంబర్ 3: విద్యార్థులు తమ కలలను సాకారం చేసుకునేందుకు నిరంతరం పట్టుదలతో కృషి చేయాలని బిసిసిఐ సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్, హిందూ కళాశాల పూర్వ విద్యార్థి ఎమ్మెస్కే ప్రసాద్ అన్నారు. శనివారం స్థానిక హిందూ కళాశాలలోని ఏకా దండయ్య పంతు లు హాలులో కళాశాల పాలకమండలి ఆధ్వర్యాన నిర్వహించిన ప్రసాద్ సత్కార సభకు పాలకమండలి అధ్యక్షుడు ఎస్‌విఎస్ సోమయాజి అధ్యక్షత వహించారు.

12/04/2016 - 07:59

నెల్లూరు, డిసెంబర్ 3: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు నగదు రహిత లావాదేవీలు నిర్వహించే విధంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు తెలిపారు. శనివారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో నగదు రహిత ఆర్థిక లావాదేవీలపై అధికారులతో ఆయన సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి అధికారి గ్రామాలకు వెళ్లి యువతకు నగదు రహిత ఆర్థిక లావాదేవీలపై అవగాహన కల్పించాలన్నారు.

12/04/2016 - 07:58

కర్నూలు, డిసెంబర్ 3: విభిన్న ప్రతిభావంతుల్లో జాలి, దయతోపాటు ఏకాగ్రత, ధైర్యాన్ని దేవుడు నింపారని శాసన మండలి చైర్మన్ చక్రపాణియాదవ్ అన్నారు. శనివారం నగరంలోని సనయన ఆడిటోరియంలో విభిన్న ప్రతిభావంతులు, వయోద్దుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ ప్రత్యేక ప్రతిభావంతుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు.

Pages