S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/04/2016 - 07:55

(ఆంధ్రభూమి బ్యూరో - శ్రీకాకుళం)

12/04/2016 - 07:54

మార్కాపురం, డిసెంబర్ 3: మార్కాపురం నియోజకవర్గంలో ఎడమొఖం, పెడముఖంగా ఉన్న నేతలు ఐక్యతా రాగం ఆలపించడంతో కార్యకర్తల్లో నూతనోత్తేజం వెల్లివిరిసింది. జనచైతన్య యాత్రల ముగింపు సందర్భంగా పట్టణంలో జరిగిన మోటారుసైకిల్ ర్యాలీలో ఇరు వర్గాలకు చెందిన నేతలు పాల్గొనడంతో కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశారు.

12/04/2016 - 07:51

విజయనగరం(టౌన్), డిసెంబర్ 3: దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయడానికి అవసరమైన చర్యలు ప్రభుత్వం అమలుచేస్తున్నదని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి కిమిడి మృణాళిని తెలిపారు.

12/04/2016 - 07:50

దేవరాపల్లి, డిసెంబర్ 3: పని చూసుకుని అర్ధరాత్రి ఇంట్లోకి వెళ్ళే సమయంలో విశాఖ డెయిరీలో పశువుల ఎక్స్‌టెన్షన్ వర్కర్‌ను గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేసి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. దేవరాపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చోడవరం మండల గవరవరం గ్రామానికి చెందిన రాము (28) గత కొంత కాలంగా విశాఖ డెయిరీలో పశువుల ఎక్స్‌టెన్షన్ వర్కర్‌గా పని చేస్త్తున్నాడు.

12/04/2016 - 07:47

ఏలూరు, డిసెంబర్ 3 : జిల్లాలో మెట్ట ప్రాంత ప్రజానీకానికి రైలు సౌకర్యం కల్పించడానికి కొవ్వూరు - భద్రాచలం రైల్వే మార్గాన్ని ఫిబ్రవరి నాటికల్లా సర్వే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ రైల్వే అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో శనివారం జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పనుల ప్రగతిపై అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులతో కలెక్టర్ సమీక్షించారు.

12/04/2016 - 07:45

ఖమ్మం, డిసెంబర్ 3: దేశాభివృద్ధి కోసం ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న పెద్దనోట్ల రద్దుపై ప్రజలకు అవగాహన కల్పించాలని బిజెపి రాష్ట్ర కార్యదర్శి ఎం శ్రీనివాస్ కార్యకర్తలకు సూచించారు.

12/04/2016 - 07:45

వరంగల్, డిసెంబర్ 3: రెవెన్యూ, రిజిస్ట్రార్ శాఖ ల బలోపేతానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. రాష్టవ్య్రాప్తంగా అద్దె ఇళ్లలో నిర్వహిస్తున్న రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మిస్తున్నామని చెప్పారు. వరంగల్ నగరంలోని ఉర్సుగుట్ట ప్రాంతంలో నిర్మించిన ఖిల్లా వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ భవన నిర్మాణాన్ని ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ శనివారం ప్రారంభించారు.

12/04/2016 - 07:42

మహబూబ్‌నగర్, డిసెంబర్ 3: కాంట్రాక్టర్లు టెండర్లు వేసుకుని ఆ పనులను వారుచేయకుండా పర్సెంటేజీలకు అమ్ముకుని పనులను బినామీ కాంట్రాక్టర్లకు ఇస్తున్నారని ఇలాంటి వ్యవస్థను ఉపేక్షించేది లేదని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు.

12/04/2016 - 07:41

నిజామాబాద్, డిసెంబర్ 3: కేంద్రం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం హవాలా దందాకు మళ్లీ ప్రాణం పోసినట్లయ్యింది. నల్లధనం, నకిలీ కరెన్సీని నిరోధించేందుకు చేపట్టిన చర్యలు ఎంతవరకు సత్ఫలితాలు అందిస్తాయో కానీ, అంతరించిపోయిందనుకున్న హుండీ వ్యాపారాన్ని తిరిగి తెరపైకి తెచ్చిందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

12/04/2016 - 07:38

కేతేపల్లి, డిసెంబర్ 3: మండలంలోని కొర్లపహాడ్ గ్రామశివారులో గల టోల్‌ఫ్లాజా వద్ద గత అర్దరాత్రి నుంచి టోల్ రుసుము వసూళ్లు చేస్తుండడం వల్ల వాహనదారుల సందడి వాతావరణంతో పాటు సరిఫడా లభించకపోవడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. గత 11వ తేదీ నుండి ఈనెల 1వ తేదీ వరకు రద్దు అయిన పెద్దనోట్ల వల్ల చిల్లర కష్టాలు తీర్చే క్రమంలో టోల్ వసూళ్లు రద్దు జరిగింది.

Pages