S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/22/2016 - 04:30

ఎల్‌బినగర్, నవంబర్ 21: రైతుల పక్షపాతిగా మార్కెట్ కమిటీ వ్యవహరించి సమస్యలను పరిష్కరించాలని మార్కెటింగ్ శాఖమంత్రి తన్నీరు హరీష్‌రావు సూచించారు. సోమవారం గడ్డిఅన్నారం మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్ర మంత్రులు నాయిని నర్సింహ్మరెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గంచే ప్రమాణ స్వీకారం చేయించారు.

11/22/2016 - 04:30

సికిందరాబాద్, నవంబర్ 21: రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు బకాయిపడ్డ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను రెండు రోజుల్లో చెల్లించాలని టిఎన్‌ఎస్‌ఎఫ్ అధ్యక్షుడు చిలుక మధుసూధన్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ సెక్రటేరియట్ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

11/22/2016 - 04:29

కీసర, నవంబర్ 21: రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించేలా అధికారులు చర్యలు చేపట్టాలని వ్యవసాయాధికారులను కలెక్టర్ ఎంవి రెడ్డి ఆదేశించారు. కార్యాలయంలో అధికారులతో చర్చించారు. రబీకి సంబంధించి రైతులకు ట్యాంకుల్లో నీళ్లు అందేలా చూడాలని అన్నారు. పట్టుపరిశ్రమ, వ్యవసాయశాఖ, పశుసంవర్ధక శాఖ, ఉద్యానవన శాఖ, ఇవే కాకుండా లాభదాయకమైన డైరీ, పట్టుపరిశ్రమ, కూరగాయల పంటలపై రైతుల దృష్టి సారించేలా చూడాలన్నారు.

11/22/2016 - 04:28

హైదరాబాద్, నవంబర్ 21: తెలంగాణ టూరిజం సౌజన్యంతో అరుణోదయ ఆర్ట్స్ సోమవారం సాయంత్రం రవీంద్ర భారతిలో టివి అవార్డులను ప్రదానం చేశారు.

11/22/2016 - 04:20

హైదరాబాద్, నవంబర్ 21: తెలంగాణలో ఏ వర్గం ప్రజలూ సంతోషంగా లేరని, అంతా తీవ్ర ఆందోళనకు, ఇబ్బందులకు గురవుతున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. ఇదే సరైన తరుణంగా తీసుకుని బిజెపి కార్యకర్తలు ప్రజలు ఎదుర్కోంటున్న సమస్యలపై ఉద్యమాలు, పోరాటాలు చేసి బిజెపిని బలీయమైన శక్తిగా తయారుచేయాలని సూచించారు.

11/22/2016 - 04:18

హైదరాబాద్, నవంబర్ 21: బంగారు తెలంగాణలో మత్స్యకారుల కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నామని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ‘ప్రపంచ మత్స్యదినోత్సవం’ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లోని ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

11/22/2016 - 04:16

హైదరాబాద్, నవంబర్ 21: రాష్ట్ర ప్రభుత్వానికి తలభాగంగా చెప్పుకోదగ్గ భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సిసిఎల్‌ఎ) పోస్టు ఖాళీగా ఉండటంతో ఈ కార్యాలయం వెలవెల పోతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రెండున్నర ఏళ్లు గడిచినప్పటికీ ఈ పోస్టులో రెగ్యులర్ అధికారిగా నియామకం అయినవారు కేవలం 10 నెలలపాటే ఉన్నారు. మూడు నెలల కింద రేమాండ్‌పీటర్ సిసిఎల్‌ఎ పదవిలో ఉంటూ పదవీవిరమణ చేశారు. ఆ తర్వాత ఈ పోస్టు ఖాళీగానే ఉంది.

11/22/2016 - 04:15

హైదరాబాద్, నవంబర్ 21: 2014-16 బ్యాచ్‌లోని డిఇడి రెండో సంవత్సరం విద్యార్థులకు పరీక్షలను ఈ నెల 24 నుండి 29 వరకూ నిర్వహిస్తున్నట్టు పరీక్షల బోర్డు సంచాలకురాలు బి శేషుకుమారి చెప్పారు. కొత్త జిల్లాల్లో విద్యార్థులకు సైతం ఈ పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ఇప్పటికే హాల్‌టిక్కెట్లను జారీ చేశామని, 22వ తేదీ నుండి ఆన్‌లైన్‌లో హాల్‌టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని శేషుకుమారి తెలిపారు.

11/22/2016 - 04:15

హైదరాబాద్, నవంబర్ 21: తెలంగాణలో ఆస్తుల మార్కెట్ విలువ ఎందుకు పెంచలేదో చెప్పాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకు వారం రోజుల గడువు విధించింది. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఎం కోదండరెడ్డి దాఖలు చేసిన ప్రజావాజ్య పిటిషన్(పిల్)ను విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్ , జస్టిస్ ఎ శంకర్ నారాయణలతో కూడిన డివిజన్ బెంచ్ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది.

11/22/2016 - 04:14

హైదరాబాద్, నవంబర్ 21: సెంట్రల్ యూనివర్శిటీ అడ్వాన్స్‌డ్ సెంటల్ ఫర్ రీసెర్చి ఇన్ హై ఎనర్జీ మెటీరియల్స్ (ఎక్రం) లో పరిశోధన చేస్తున్న విద్యార్థి మోజెస్ అబ్రహాం గత 18న ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటనపై యూనివర్శిటీ విచారణ ప్రారంభించింది. క్యాంపస్‌లో ఇలాంటి ఘటనలు జరుగకుండా చర్యలు ప్రారంభించింది. ఈ సందర్భంగా యూనివర్శిటీ ప్రొవైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ విపిన్ శ్రీవాత్సవ ఒక ప్రకటన విడుదల చేశారు.

Pages