S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/22/2016 - 03:34

తాడేపల్లి, నవంబర్ 21: గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరంలో బకింగ్‌హామ్ కెనాల్‌లో సోమవారం ప్రమాదవశాత్తూ ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. విజయవాడలోని శాంతినగర్, రాజీవ్‌నగర్‌కు చెందిన ఐదుగురు స్నేహితులు సోమవారం సీతానగరంలోని బకింగ్‌హామ్ కాలువ హెడ్ స్లూయిజ్ సమీపంలో కాలువలోకి దిగి చేపలు పట్టడానికి ప్రయత్నిస్తుండగా అంజి ప్రవాహంలో కొట్టుకుపోయాడు.

11/22/2016 - 03:34

సీలేరు, నవంబర్ 21: మావోయిస్టు మిలీషియా సభ్యులతో పాటు 101 మంది మద్దతుదారులు మల్కన్‌గిరి జిల్లా ఎస్పీ ఎదుట సోమవారం లొంగిపోయారు. వీరికి ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుందని ఎస్పీ తెలిపారు.

11/22/2016 - 03:24

విజయవాడ, నవంబర్ 21: సహకార బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న రైతులు తమ బకాయిలను పాత 500, 1000 నోట్లతో చెల్లించేలా వెసులుబాటు కల్పించేందుకు రాష్టస్థ్రాయి బ్యాంకర్ల సమితి ప్రత్యేక సమావేశం తీర్మానించింది. రైతుల రుణాల రీషెడ్యూల్‌ను వచ్చే జూన్ వరకూ పొడిగించేలా కేంద్ర ప్రభుత్వాన్ని, ఆర్‌బిఐని కోరాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన విజయవాడలో సోమవారం రాత్రి జరిగిన సమావేశంలో తీర్మానించారు.

11/22/2016 - 03:23

గుంటూరు, నవంబర్ 21: రాష్టవ్య్రాప్తంగా సంచలనం రేపిన పత్తి కొను‘గోల్‌మాల్’ వ్యవహారంలో మార్కెటింగ్ శాఖ డైరెక్టర్‌తోపాటు ఇద్దరు సంయుక్త సంచాలకులు, మరో 89మంది కిందిస్థాయి అధికారులు, ఉద్యోగులపై చార్జిషీటు దాఖలైంది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో కమిషనర్ మల్లికార్జున నేతృత్వంలో అవినీతి ఉద్యోగులకు తాఖీదులు అందాయి.

11/22/2016 - 03:21

ఏలూరు, నవంబర్ 21: వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి రాష్ట్రాన్ని సోలార్ హబ్‌గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. సౌరశక్తికి సంబంధించి వచ్చే ఏప్రిల్ నాటికి దేశంలోనే రాష్ట్రం ఆగ్రస్ధానంలో నిలవడానికి అనువుగా ఏర్పాట్లు చేశామన్నారు. కాగా సౌర, పవన విద్యుత్ ప్లాంట్ల మేళవింపు ద్వారా అధికంగా ప్రయోజనాలు సాధించవచ్చునని అంచనా వేస్తున్నామని, ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు.

11/22/2016 - 03:03

హైదరాబాద్, నవంబర్ 21: తెలంగాణలో ఎస్సెస్సీ, ఒఎస్‌ఎస్‌సి, ఎస్సెస్సీ వొకేషనల్ పరీక్షల షెడ్యూలు ఖరారైంది. పరీక్షలు 2017 మార్చి 14న ప్రారంభమై 30 వరకూ జరుగుతాయి. పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకూ జరుగుతాయి. కొన్ని పరీక్షలకు మాత్రం సమయాలను అనుకూలంగా మార్చారు. ఆబ్జెక్టివ్ టైప్ పేపర్ మాత్రం చివరి అర్ధగంటలో సమాధానాలు రాయాలని పరీక్షల బోర్డు కార్యదర్శి బి శేషుకుమారి తెలిపారు.

11/22/2016 - 03:02

న్యూఢిల్లీ, నవంబర్ 21: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో చేతిలో నగదు లేక ఇబ్బంది పడుతున్న రైతులకు ఆర్థిక శాఖ మరింత ఊరట కలిగిస్తూ పలు చర్యలను ప్రకటించింది.

11/22/2016 - 03:08

ముంబయి, నవంబర్ 21: దేశంలో పెద్ద నోట్ల చెలామణిని రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 8న సంచలన నిర్ణయం ప్రకటించిన తర్వాత బ్యాంకుల్లో జరిగిన డిపాజిట్లు, విత్‌డ్రాలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ సోమవారం ప్రకటన విడుదల చేసింది. వెయ్యి, 500 రూపాయల నోట్ల చెలామణిని రద్దు చేస్తున్నట్లు ప్రధాని సంచలన నిర్ణయం ప్రకటించిన విషయం తెలిసిందే.

11/22/2016 - 03:29

న్యూఢిల్లీ, నవంబర్ 21: తెలంగాణలోని జాతీయ రహదారుల విస్తరణకు అవసరమైన భూమిని వీలైనంత త్వరగా సేకరించి ఇచ్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీకి హామీ ఇచ్చారు.

11/22/2016 - 02:53

న్యూఢిల్లీ, నవంబర్ 21: పెద్ద నోట్ల రద్దు వ్యవహారంపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో విపక్షాలు తమ ఆందోళనను మంగళవారం నుంచి ఉద్ధృతం చేయాలని నిర్ణయించాయి.

Pages