S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/22/2016 - 04:09

విజయవాడ (క్రైం), నవంబర్ 21: విజయవాడ కేంద్రంగా పశ్చిమ గోదావరి, గుంటూరు ప్రాంతాలకు చెందిన కొందరు వ్యక్తులు ముఠాలుగా ఏర్పడి రద్దయిన పాత నోట్లను మారుస్తూ పట్టుబడ్డారు. 17 మందిని అరెస్టు చేసిన విజయవాడ పోలీసులు నిందితుల నుంచి 6 లక్షల 80వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో కొంత నగదు కొత్తగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రెండు వేల రూపాయలు నోట్లు కాగా, ఎక్కువ శాతం వంద నోట్లు ఉన్నాయి.

11/22/2016 - 04:03

జమ్మూ, నవంబర్ 21: జమ్మూకాశ్మీర్ సరిహద్దులో పాకిస్తాన్ దళాలు మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. పూంచ్ జిల్లా కృష్ణా ఘటీ సెక్టార్‌లో పాక్ సైన్యం కాల్పుల్లో ఓ బిఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ మృతిచెందాడు. సోమవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల సమయంలో ఎల్‌ఓసి వద్ద భారత శిబిరాల లక్ష్యంగా పాక్ కాల్పులకు దిగింది.

11/22/2016 - 04:02

అమరావతి, నవంబర్ 21: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ప్రజలనుంచి వస్తున్న వ్యతిరేక ప్రభావం రాజకీయంగా తమపై పడకుండా జాగ్రత్తపడాలని తెలుగుదేశం నిర్ణయించింది. రెండురోజుల నుంచి మంత్రులు, పార్టీ నేతల స్వరం పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా కనిపిస్తోంది.

11/22/2016 - 04:01

ఇస్లామాబాద్/లాహోర్, నవంబర్ 21: దేశ భద్రతకు సంబంధించి ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోడానికి సైన్యం సిద్ధంగా ఉందని పాకిస్తాన్ సర్వసేన్యాధికారి రహీల్ షరీఫ్ వెల్లడించారు. ఈ నెల 29న పదవీ విరమణ చేయనున్న రహీల్ సోమవారం నుంచి ఫేర్‌వెల్ విజిట్ ప్రారంభించారు. ఆయన పదవీకాలం పొడిగిస్తారని మీడియాలో కథనాలకు వెలువడ్డాయి. అయితే రహీల్ ఫేర్‌వెల్ టూర్‌తో పదవీకాలం పొడిగింపు లేనట్టే.

11/22/2016 - 04:01

అనంతపురం, నవంబర్ 21: అనంతపురం నగరంలో రోడ్ల విస్తరణకు స్థానిక ఎమ్మెల్యే, నగర మేయర్ అడ్డుపడుతున్నారని ఆరోపిస్తూ ఎంపి జెసి దివాకర్‌రెడ్డి సోమవారం చేపట్టిన నిరసనదీక్షను పోలీసులు భగ్నం చేశారు. సోమవారం ఉదయం నగర పాలకసంస్థ కార్యాలయం ఎదుట ఎంపి నిరసనదీక్ష ప్రారంభించారు. నగరంలో పారిశుద్ధ్యం అధ్వానంగా మారిందని, ప్లాస్టిక్ వినియోగం నిషేధించాలని, రోడ్లను విస్తరించాలని డిమాండ్ చేశారు.

11/22/2016 - 04:00

న్యూఢిల్లీ, నవంబర్ 21: మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా కొత్త వరి వంగడాలు రావాలని ప్రముఖ వ్యవసాయ శాస్తవ్రేత్త ఎంఎస్ స్వామినాథన్ స్పష్టం చేశారు. వ్యవసాయ శాస్తవ్రేత్తలకు విశ్రాంతి అన్నది ఉండదని పరిస్థితులకు అనువైన కొత్త రకాలకు అనే్వషణ జరగాలని పిలుపునిచ్చారు. వాతావరణ మార్పులను అనువైన వంగడాలు అభివృద్ధి చేస్తూ వరి అధికోత్పత్తికి కృషి చేయాలని ఆయన చెప్పారు.

11/22/2016 - 04:11

హైదరాబాద్, నవంబర్ 21: అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం వాయిదా వేయాలని రాష్ట్ర హైకోర్టు ఎపి ప్రభుత్వాన్ని సోమవారం నాడు ఆదేశించింది. అగ్రిగోల్డ్ మోసంపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తూ అగ్రి గోల్డ్ డిపాజిటర్లు, ఏజెంట్ల సంక్షేమ సంఘం దాఖలు చేసిన పిటీషన్‌ను జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యం, జస్టిస్ ఎస్ వి భట్‌లతో కూడిన డివిజన్ బెంచ్ సోమవారం నాడు విచారించింది.

11/22/2016 - 03:59

కాబూల్, నవంబర్ 21: అఫ్గాన్‌లోని ఓ మసీదులో ఆత్మాహుతి దాడి జరగడంతో 28 మంది మృతిచెందారు. పశ్చిమ కాబూల్‌లో షియాలు ప్రార్థనలు చేస్తున్న మసీదులో ఆత్మాహుతి బాంబర్ తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ సంఘటనలో మరో 45 మంది తీవ్రంగా గాయపడ్డారు. రెండస్థులున్న మసీదులోని కింది అంతస్థులో పేలుడు జరిగింది. ‘నేను మసీదులోనే ఉన్నారు. ఆ సమయంలో ముల్లా ప్రార్థనలు చదువుతున్నాడు. ఒక్కసారిగా పెద్దశబ్దంతో పేలుడు సంభవించింది..

11/22/2016 - 03:58

విజయవాడ, నవంబర్ 21: రాష్ట్రంలో మెగా సీడ్ పార్క్ ఏర్పాటుకు అమెరికాకు చెందిన ఐవా స్టేట్ వర్శిటీ ముందుకొచ్చింది. ఈమేరకు అమెరికాలోని ఐవాలో ఎపి ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు, ఐవా స్టేట్ వర్శిటీ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. రాష్ట్రంలో సీడ్ పార్క్‌తో పాటు ఎపి సీడ్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది.

11/22/2016 - 03:56

చింతకాని, నవంబర్ 21: పెద్దనోట్ల మార్పిడి ఇబ్బందులు అభం శుభం తెలియని మూడేళ్ల చిన్నారి పసిప్రాణాన్ని బలిగొన్నాయి. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ రైల్వే కాలనీలో నివాసముండే నెరుసుల నాగరాజు దంపతులకు ఇద్దరు పిల్లలు. పాప యమునకి మూడేళ్లు. వారం క్రితం చిన్నారికి తీవ్ర జ్వరం రావడంతో ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకొని ఇంటికి తిరిగొచ్చారు.

Pages