S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/22/2016 - 02:50

హైదరాబాద్, నవంబర్ 21: పెద్ద నోట్ల రద్దు తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని తలకిందులు చేయడంతో ప్రభుత్వ ప్రాధాన్యతలు మారిపోనున్నాయి. నోట్ల రద్దు నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి గాడిలో పడే వరకూ ‘బంగారు తెలంగాణ’ విజన్‌ను పక్కన పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇకనుంచి ఏవిధమైన కార్యాచరణతో ముందుకు సాగాలన్న దానిపై రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకుంటోంది.

11/22/2016 - 01:13

హైదరాబాద్/ కుషాయిగూడ, నవంబర్ 21: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసు తీర్పు వాయిదా పడింది. ఈ కేసు తీర్పును ఎన్‌ఐఏ కోర్టు డిసెంబర్ 13వ తేదీకి వాయిదా వేసింది. 2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌లోని వెంకటాద్రి, కోణార్క్ థియేటర్‌ల వద్ద సంభవించిన బాంబు పేలుళ్లలో 18 మంది మృతి చెందగా, 136 మంది గాయపడిన విషయం తెలిసిందే.

11/22/2016 - 01:06

పోలవరం, నవంబర్ 21: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన కాంక్రీటు పనులు డిసెంబర్ 10వ తేదీ నుండి ప్రారంభమవుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. ప్రతి నెలా మూడో సోమవారం పోలవరం పనుల పరిశీలనలో భాగంగా సోమవారం ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు పనులు పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడారు.

11/22/2016 - 01:04

హైదరాబాద్, నవంబర్ 21: ఇకపై ఆరోగ్య శ్రీ సేవలు 50 శాతం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ఉండాలని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి సి లక్ష్మారెడ్డి సూచించారు. జిల్లా వైద్యాధికారులు, జిల్లా వైద్యశాలల సూపరింటెండెంట్‌లతో మంత్రి సోమవారం హైదరాబాద్‌లో సమావేశం అయ్యారు. ఇకపై ప్రసవాలు 50 శాతం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే జరగాలని చెప్పారు.

11/22/2016 - 01:02

హైదరాబాద్, నవంబర్ 21: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు సలహాదారుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ నియమితులు కానున్నట్టు అధికార వర్గాల సమాచారం. రాజీవ్ శర్మ వాస్తవానికి ఈ ఏడాది మే నెలలోనే పదవీ విరమణ కావాల్సి ఉంది. అయితే ముఖ్యమంత్రి విజ్ఞప్తి మేరకు మొదట మూడు నెలలు, ఆ తర్వాత మరో మూడు నెలలు ఆరు నెలల పాటు ఆయన పదవీకాలాన్ని కేంద్రం పొడిగించింది.

11/22/2016 - 01:00

న్యూఢిల్లీ, నవంబర్ 21: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై సుప్రీంకోర్టులో పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నందున గ్రీన్ ట్రిబ్యునల్‌లో జరుగుతున్న విచారణను నిరవధికంగా వాయిదా వేస్తామని ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ స్వతంత్రకుమార్ అన్నారు. ఈ పిటిషన్లపై తదుపరి విచారణను జనవరి 2నాటికి ట్రిబ్యునల్ వాయిదా వేసింది.

11/22/2016 - 00:59

న్యూఢిల్లీ, నవంబర్ 21: సుప్రీంకోర్టులో జరూసలెం మత్తయ్య కేసు విచారణ రెండు వారాలు వాయిదా పడింది. ఓటుకు నోటు కేసులో మత్తయ్య పేరును చార్జ్‌షీట్ నుండి తొలగిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసిబి) అధికారులు సుప్రీంకోర్టులో సవాలు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

11/22/2016 - 00:58

బళ్ళారి, నవంబర్ 21: మైనింగ్ డాన్ గాలి జనార్దన్‌రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కార్యాలయం, బళ్ళారిలోని గాలి ఇంటితోపాటు హైదరాబాద్‌లోని కోఠి (గుజరాత్ గల్లి)లోగల ఓ ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోమవారం సోదాలు నిర్వహించారు. హుబ్లీ ఆదాయశాఖ అధికారుల బృందం ఏకకాలంలో బళ్ళారిలోని ఓబుళాపురం మైనింగ్ కార్యాలయంలోనూ, గాలి ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు.

11/22/2016 - 00:57

న్యూఢిల్లీ, నవంబర్ 21: పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. పెద్ద నోట్ల రద్దు ఉద్యోగులు, పేదలు, రైతులు, శ్రామికులపై పెనుప్రభావం చూపుతోందని పేర్కొంటూ, దీనిపై సంబంధిత అధికారులకు, కేంద్రానికి తగిన ఆదేశాలు జారీ చేయాలని ఆ ఫిర్యాదులో కెవిపి కోరారు.

11/22/2016 - 00:56

హైదరాబాద్, నవంబర్ 21: పదవ వేతన కమిషన్ సిఫారసుల మేరకు మహిళా ఉద్యోగినులకు 90 నెలల చెల్డ్‌కేర్ సెలవును వర్తింప చేస్తూ తెలంగాణ ఆర్థిక శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణం అమలోకి వచ్చినట్టు ఆర్థిక శాఖ జీవో నంబర్ 209లో పేర్కొంది. ఈ సెలవును ఏ విధంగా వినియోగించుకోవచ్చో విధి విధానాలను ప్రభుత్వం విడుదల చేసింది.

Pages