S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/22/2020 - 05:08

హైదరాబాద్, మార్చి 21; ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటలకు జనతా కర్ఫ్యూ పాటించాలని ఇచ్చిన పిలుపును అమలు చేస్తామని తెలంగాణ హాస్పిటల్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు డాక్టర్ అశోక్ రెడ్డి, కార్యదర్శి డాక్టర్ మోహన్ గుప్తా తెలిపారు. వైద్య వృత్తిలో ఉన్న వారి పట్ల మోదీకి ఉన్న చిత్తశుద్ధి, గౌరవం తెలియచేస్తుందన్నారు.

03/22/2020 - 05:07

హైదరాబాద్, మార్చి 21: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను అడ్డుకుందామని, ప్రధాని నరేంద్రమోదీ జనతా కర్ఫ్యూకు ఐక్యతతో మద్దతు పలుకుదామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ పేర్కొన్నారు. శనివారం నాడు ఎలక్ట్రానిక్ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కరోనాను నివారించే ప్రయత్నం చేస్తోందని అన్నారు. జనతా కర్ఫ్యూ పాటించడం ద్వారా కరోనా చెయిన్‌ను రద్దు చేయగలుగుతామని చెప్పారు.

03/22/2020 - 05:05

హైదరాబాద్, మార్చి 21: ఉగాది వేడుకలను ప్రభుత్వం నిర్వహించడం అనాదిగా వస్తోందని, అయితే ప్రాణాంతక కరోనా వైరస్ కట్టడి ముందస్తు చర్యల్లో భాగంగా ఈ ఏడాది ఉగాది వేడుకలను నిరాడంబరంగగా నిర్వహిస్తున్నట్లు దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. భద్రాద్రిలో జరిగే శ్రీరామనవమి వేడుకలను కూడా భక్తులకు అనుమతి లేదన్నారు.

03/22/2020 - 05:03

హైదరాబాద్, మార్చి 21: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ రాజ్యసభ సభ్యుడిగా నియమితులు కావడం అనైతికమని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ పేర్కొన్నారు. పదవీవిరమణ చేసి ఎంతో కాలం గడవక ముందే ఆయనను రాజకీయ పదవికి నామినేట్ చేయడం చూస్తుంటే బీజేపీతో ఆయనకు ఉన్న సంబంధాలపై అనుమానాలు వస్తాయని, వాస్తవికంగా ఆపార్టీతో సంబంధాలు ఉన్నా లేకున్నా ప్రజల్లో అపోహలు వస్తాయని పేర్కొన్నారు.

03/22/2020 - 05:02

హైదరాబాద్, మార్చి 21: రాష్ట్రంలో వడగండ్ల వానల వల్ల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని, రైతులను సీఎం కేసీఆర్ ఆదుకోవాలని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. చేతికి వచ్చిన పంటలు నేలపాలు కావడంతో రైతులు తల్లడిల్లుతున్నారన్నారు. తక్షణమే రైతులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదుకోవాలన్నారు.

03/22/2020 - 05:00

హైదరాబాద్, మార్చి 21: ప్రపంచ దేశాలను వణికిస్తూ భారత్‌లోనూ చాపకింద నీరులా పారుతున్న కరోనా వైరస్ అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ వైరస్ కట్టడికి వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంటోంది. విదేశాలకు వెళ్లి వచ్చిన వారికి ఎక్కువగా వైరస్ ఉంటుండడంతో అధికారులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హైదరాబాద్‌కు ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారనే విషయాలపై ఆరా తీస్తున్నారు.

,
03/22/2020 - 04:58

తిరుపతి: కరోనా వైరస్ నేపథ్యంలో శుక్రవారం నుంచి భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించకుండా నిలిపివేసిన నేపథ్యంలో భక్తుల కోసం ముందస్తుగా తయారుచేసిన లడ్డూలను టీటీడీ ఉచితంగా ఉద్యోగులకు అందించింది. సుమారు 2.50లక్షల లడ్డూలు భక్తులను స్వామిదర్శనం నిలిపివేసే సమయానికి మిగిలిపోయాయి.

03/22/2020 - 04:53

న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంతో సామాజిక దూరాన్ని అవలంబిస్తున్నందున తలెత్తనున్న సమస్యల నుంచి బయటకు వచ్చేందుకు భారత పెట్రోలియం కార్పొరేషన్ (ఐఓసీ) స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. ఎటువంటి పరిస్థితుల్లోనూ పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగదని ఐఓసీ హామీ ఇచ్చింది. ఎయిర్‌లైన్స్‌కు కూడా ఇంధనం ఇదివరకటి మాదిరిగానే అందుతుందని ఐఓసీ చైర్మన్ సంజీవ్ సింగ్ స్పష్టం చేశారు.

03/22/2020 - 04:51

న్యూఢిల్లీ: సార్క్ దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదనకు విశేష స్పందన వస్తోంది. తాజాగా మాల్దీవులు, భూటాన్, నేపాల్ ప్రభుత్వాలు కోవిడ్-19 ఎమర్జెన్సీ నిధికి భారీ ఎత్తున నిధులు అందించాయి. ఈ దేశాలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు.

03/22/2020 - 04:50

న్యూఢిల్లీ, మార్చి 21: ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన జనతా కర్ఫ్యూ పిలుపు మేరకు ఆదివారం (22న) ఇంటిలోనే ఉండిపోవడం ద్వారా కరోనావైరస్ వ్యాప్తిని దెబ్బ తీయాలని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ అధ్యక్షుడు ఎం. వెంకయ్య నాయుడు దేశ ప్రజలకు శనివారం పిలుపు ఇచ్చారు.

Pages