S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/24/2016 - 03:12

హైదరాబాద్, సెప్టెంబర్ 23: అల్పపీడనంతో తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టంపై ఆదుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి విజ్ఞప్తి వస్తే కేంద్ర ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధి (సిడిఆర్‌ఎఫ్) నుంచి తాత్కాలిక సహాయం అందజేస్తుందని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు.

09/24/2016 - 03:10

హైదరాబాద్, సెప్టెంబర్ 23: ఈ నెల 29,30 తేదీల్లో జైళ్లలో సంస్కరణలపై ఢిల్లీలో బ్యూరో ఆఫ్ పోలీసు రీసెర్చి అండ్ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు తెలంగాణ, ఆంధ్రరాష్ట్రానికి చెందిన జైళ్ల శాఖాధికారులు హాజరు కానున్నారు. రాష్ట్రంలో జైళ్లలో అమలు చేస్తున్న సంస్కరణలను కేంద్రానికి తెలియచేసేందుకు తెలంగాణ జైళ్ల శాఖ నివేదిక రూపొందించింది.

09/24/2016 - 03:09

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: తెలంగాణలో ప్రకృతిసిద్ధమైన సందర్శనీయ స్థలాలు ఎన్నో ఉన్నాయని, వాటిని మరింత అభివృద్ది చేసేందుకు పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర పర్యాటక, సాంసృతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ పిలుపునిచ్చారు. శుక్రవారంనాడు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన ఇంక్రెడిబుల్ ఇండియా టూరిజం ఇనె్వస్టర్స్ సమ్మిట్‌లో తెలంగాణ తరపున చందూలాల్ పాల్గొన్నారు.

09/24/2016 - 03:08

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: సిగంపూర్‌నుంచి చెన్నై వస్తున్న విమానంలో శుక్రవారం శామ్‌సన్ గెలాక్సీ నోట్-2 పేలిపోయింది. ఈ రోజు ఉదయం 7.45 గంటల సమయంలో చెన్నై విమానాశ్రయంలో విమానం లాండయ్యే సమయంలో ఈ ఫోన్ పేలినట్లు తెలుస్తోంది. ఫలితంగా విమానంలో స్వల్పంగా మంటలు చెలరేగగా, సిబ్బంది మంటలార్పే యంత్రాలతో ఆ మంటలను ఆర్పేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని అధికారులు తెలిపారు.

09/24/2016 - 03:08

హైదరాబాద్, సెప్టెంబర్ 23: తెలంగాణ గ్రూప్-2 కేటగిరి పోస్టులకు దరఖాస్తు చేసే గడువును ఈ నెల 26వ తేదీ వరకూ పొడిగిస్తున్నట్టు పబ్లిక్ సర్వీసు కమిషన్ కార్యదర్శి పార్వతి సుబ్రమణియన్ చెప్పారు. హైదరాబాద్ సహా తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో దరఖాస్తు గడువును మరో మూడు రోజుల పాటు పొడిగించినట్టు తెలిసింది.

09/24/2016 - 03:07

సూళ్లూరుపేట, సెప్టెంబర్ 23: నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుండి ఈ నెల 26న జరిపే పిఎస్‌ఎల్‌వి-సి 35 ప్రయోగానికి సంబంధించిన ఏర్పాట్లన్నింటిని శాస్తవ్రేత్తలు పూర్తిచేశారు. ఇస్రో చేపట్టిన ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ శనివారం ఉదయం 9:12గంటలకు ప్రారంభం కానుంది. ప్రయోగం పై శుక్రవారం షార్‌లోని బ్రహ్మప్రకాష్ హాలులో డాక్టర్ బిఎన్.

09/24/2016 - 03:05

హైదరాబాద్, సెప్టెంబర్ 23: ఆంధ్ర-తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉమాభారతి సమక్షంలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ భేటీ తదనంతర ప్రచార పరిణామంలో తాము పూర్తిగా వెనుకబడిపోయామని ఏపి మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

09/24/2016 - 02:42

హైదరాబాద్, సెప్టెంబర్ 23: రాష్ట్రంలోని చాలాప్రాంతాల్లో శనివారం భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) హెచ్చరించింది. గురువారం ఏర్పడిన అల్పపీడనం ఉత్తరకోస్తాంధ్ర, తెలంగాణ, దక్షిణ చత్తీస్‌గఢ్ మధ్యభాగంలో ప్రభావం చూపగా, ప్రస్తుతం ఇది తెలంగాణ, దక్షిణ చత్తీస్‌గఢ్, విదర్భ మధ్య కొనసాగుతోంది.

09/24/2016 - 02:40

అడ్డూఆపూ లేని వర్షాలతో తెలంగాణ జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. శుక్రవారం వర్షాల కారణంగా మెదక్ జిల్లాలో ఐదుగురు, వరంగల్ జిల్లా ఇద్దరు, నల్గొండ జిల్లాలో ఇద్దరు, సికింద్రాబాద్‌లో ఒకరు మరణించారు. హైదరాబాద్‌లోని ఆల్వాల్‌లో అత్యధికంగా 25సెంటిమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. జంట నగరాల్లో 48 పురాతన భవనాలను కూల్చివేశారు. హుస్సేన్‌సాగర్‌లోకి ఇన్‌ఫ్లో తగ్గడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

09/24/2016 - 02:56

హైదరాబాద్, సెప్టెంబర్ 23: అసాధారణ వర్షాలతో సంభవించిన నష్టాలను అంచనా వేసి నివేదిక ఇవ్వాల్సిందిగా సిఎస్ రాజీవ్ శర్మను సిఎం కె చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. భారీ నష్టాలపై కేంద్ర సాయం కోరనున్నట్టు వెల్లడించారు. శుక్రవారం ఉదయం ఢిల్లీ పర్యటన నుంచే సిఎం వర్షాలు, వరదల పరిస్థితిని సమీక్షించారు.

Pages