S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/22/2016 - 07:18

కొత్తగూడెం, సెప్టెంబర్ 21: వార్షిక ఉత్పత్తిలో వెనుకబడిన సింగరేణికి విదేశీబొగ్గు అశనిపాతంగా మారి సంస్థ మనుగడకే ప్రమాదంగా పరిణమించింది. అన్ని కోణాల్లోనూ పరిశీలిస్తే సంస్థ తిరోగమనానికి సవాలక్ష కారణాలు కనిపిస్తున్నాయి.

09/22/2016 - 07:13

విజయవాడ, సెప్టెంబర్ 21: చంద్రన్న సంచార చికిత్స పథకానికి విస్తృత ఆదరణ లభిస్తోంది. పేదల ఆరోగ్య పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా, సంపూర్ణ ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధన లక్ష్యంలో భాగంగా ప్రారంభించిన ఈ పథకాన్ని గ్రామీణ ప్రాంతాల జనం పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటున్నారు. తమ ఊళ్లలో, తమ వాడల్లోకే వచ్చి వైద్యం అందిస్తున్న ఈ పథకం తమకెంతో ఉపయుక్తంగా ఉందని భావిస్తున్నారు.

09/22/2016 - 07:11

విజయవాడ (కార్పొరేషన్), సెప్టెంబర్ 21: మరికొద్ది రోజుల్లో జరుగబోయే దసర పండుగ ఉత్సవాలకు నగరంలోని కృష్ణానదీ ఘాట్లను సిద్ధం చేయాలని విఎంసి కమిషనర్ వీరపాండియన్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం నదీఘాట్లను పరిశీలించిన ఆయన అపరిశుభ్రంగా ఉన్న పరిసరాలను చూసిన ఆయన పారిశుద్ధ్య అధికారుల పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

09/22/2016 - 07:11

విజయవాడ, సెప్టెంబర్ 21: జిల్లాలో మలేరియా, డెంగ్యూ జ్వరాల బారినపడి చికిత్స పొందుతున్న వారి వివరాలు ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినికల్ లాబ్ అందుకు రూపొందించిన ఫార్మేట్‌లో జిల్లా యంత్రాంగానికి ఆన్‌లైన్‌లో పంపాలని జిల్లా కలెక్టర్ బాబు.ఎ కోరారు.

09/22/2016 - 07:10

విజయవాడ (రైల్వేస్టేషన్), సెప్టెంబర్ 21: ఆర్‌ఆర్‌ఐ (రూట్ రిలే ఇంటర్ లాకింగ్) సిస్టం ఆధునికీకరణ పనులు జరుగుతున్న సమయంలోనే ఎన్‌ఐ (నాన్ ఇంటర్ లాకింగ్) సిస్టమ్ ద్వారా 10వ నెంబర్ ప్లాట్‌ఫారం మీదకు ఖాజీపేట వైపు నుంచి విజయవాడ మీదుగా వచ్చే రైళ్లను 10వ నెంబర్ ప్లాట్‌ఫారం మీదకు తీసుకున్నారు.

09/22/2016 - 07:10

విజయవాడ, సెప్టెంబర్ 21: రైతుల్లో బీమా ద్వారా జరిగే ప్రయోజనాలను పెంపొందించడంలోను, అవగాహన పెంచడంలోను క్షేత్రస్థాయి అధికారులు మెరుగైన పనితీరును చూపాల్సి ఉందని కలెక్టర్ బాబు ఎ స్పష్టం చేశారు.

09/22/2016 - 07:07

జీడిమెట్ల, సెప్టెంబర్ 21: మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వరద నీటి ధాటికి కొట్టుకుపోయిన ఓ వ్యక్తి బావిలో పడిన సంఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. నిజామాబాద్ జిల్లా, ఆర్మూరు మండలం, పెరిక గ్రామానికి చెందిన నాగలింగం (55) కొంపల్లి సర్వీస్ రోడ్డులోని లక్ష్మినర్సింహ సాయి మెస్‌లో పనిచేస్తూ మెస్‌పక్కనే గల ఓ రూమ్‌లో ఉంటాడు. రూమ్ పక్కన బావి ఉంది.

09/22/2016 - 07:06

హైదరాబాద్, బేగంపేట, సెప్టెంబర్ 21: మహానగరంలో కురిసిన భారీ వర్షానికి బేగంపేటలోని దేవనార్ అంధుల పాఠశాల నీట మునిగింది. రాత్రి ఒకటిన్నర గంటల నుంచే పాఠశాలలోకి నీరు రావటాన్ని గమనించిన సిబ్బంది ఈ స్కూల్‌లోని అంధులను తెల్లవారుఝము 3 గంటల వరకు పై అంతస్తులకు తరలించారు.

09/22/2016 - 07:05

హైదరాబాద్, సెప్టెంబర్ 21: నగరంలో తరుచూ కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా హుస్సేన్‌సాగర్‌లోకి భారీగా వరద నీరు చేరుతోంది. ముఖ్యంగా మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షం కారణంగా కూకట్‌పల్లి, పికెట్ నాలాలతో పాటు దుర్గం చెరువు నుంచి వచ్చే నాలాల ద్వారా కూడా ప్రవహిస్తుండటంతో సాగర్‌లో నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరింది.

09/22/2016 - 07:05

హైదరాబాద్, సెప్టెంబర్ 21: నగర శివారులోని కుత్బుల్లాపూర్, బాలానగర్ మండలాల్లో మంగళవారం మధ్య రాత్రి నుండి కురిసిన భారీ వర్షానికి అనేక కాలనీలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాలతో పాటు ఆయకట్టు ప్రాంతాల్లో కూడా కాలనీలు నీట మునగడం గమనార్హం. ఇప్పటి వరకు చెరువులు, కుంటలు పరిరక్షించి శిఖం ప్రాంతాల్లో ఎలాంటి భవన నిర్మాణాలుజరగకూడదన్న నిబంధనలకు విరుద్ధంగా వందలాదిగా వెలసిన ఇళ్లు భారీ వర్షానికి నీట మునిగాయి.

Pages