S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/22/2016 - 08:46

విశాఖపట్నం, సెప్టెంబర్ 21: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కోస్తాను ఆనుకుని అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం బుధవారం రాత్రి ప్రకటించింది. దీనికి సమాంతరంగా 7.6 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది క్రమంగా తెలంగాణ ప్రాంతానికి విస్తరించనుంది. దీని ప్రభావంతో తెలంగాణ జిల్లాల్లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపారు.

09/22/2016 - 08:45

మరో రెండు మూడు రోజులు వర్షాలు ఉన్నాయ. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టండి.
అవసరమైతే ఆర్మీ సహకారం తీసుకుందాం.

భారీ ట్రాఫిక్ జామ్. వర్షానికి నదీ ప్రవాహాన్ని తలపిస్తున్న హైదరాబాద్ ప్రధాన రహదారులు

09/22/2016 - 08:42

హైదరాబాద్, సెప్టెంబర్ 21: తెరాసలో చేరిన 12మంది తెలంగాణ తెదేపా ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్లపై వచ్చే మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ మదుసూధనాచారిని హైకోర్టు బుధవారం ఆదేశించింది.

09/22/2016 - 08:30

పట్టిసీమ, పోలవరంలో మాకూ వాటా వెనక్కి తగ్గేది లేదన్న తెలంగాణ డిండి, పాలమూరుతో మాకు నష్టం
ప్రాజెక్టుల నిర్మాణం కూడదన్న ఆంధ్ర ఏకాభిప్రాయానికి తావులేని వాదనలు మూడు అంశాలపై ఇరుపక్షాలు ఓకే
ఇక అపెక్స్ కౌన్సిల్ భేటీలు ఉండవు జల సమస్యలపై వాళ్లే తేల్చుకోవాలి కేంద్ర జలవనరుల మంత్రి ప్రకటన

09/22/2016 - 08:29

విజయవాడ, సెప్టెంబర్ 21: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. కృష్ణా, గుంటూరు జిల్లాలు, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు రాయలసీమలోనూ పెద్ద ఎత్తున వర్షాలు ముంచెత్తాయి. ఒక్క కడప జిల్లాలోనే గత 24 గంటల్లో దాదాపు 13 సెంటీమీటర్ల వర్షం కురిసింది. బుధవారం రాత్రి మరింత తీవ్రంగా వర్షాలు కురుస్తున్నాయి. కడప నగరంతో పాటు, పలు ప్రాంతాల్లో ఏరులు పొంగి పొర్లుతున్నాయి.

09/22/2016 - 08:28

న్యూయార్క్, సెప్టెంబర్ 21: కాశ్మీర్ సమస్య పరిష్కారం కాకుండా భారత్- పాక్‌ల మధ్య శాంతియుత సంబంధాలు నెలకొనే అవకాశమే లేదని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితిలో బుధవారం మాట్లాడిన షరీఫ్ భారత్‌తో సత్సంబంధాలను పాదుగొల్పేందుకు తాము చేస్తున్న కృషిని వివరించారు. అన్ని వివాదాస్పద అంశాలనూ శాంతియుత చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని ప్రతిపాదిస్తూ తాము ఎన్నో ప్రయత్నాలు చేశామని వివరించారు.

09/22/2016 - 08:26

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా మూలంగా పదేళ్లలో కలిగే ప్రయోజనాలను కేవలం రెండేళ్లలో కల్పించేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ భరోసా ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ఇటీవల ప్రకటించిన ప్యాకేజీకి వచ్చే కేంద్ర మంత్రివర్గం సమావేశంలో చట్ట భద్రత కల్పిస్తామని సిఎం చంద్రబాబుకు జైట్లీ హామీ ఇచ్చినట్లు తెలిసింది.

09/22/2016 - 08:20

గుంటూరు, సెప్టెంబర్ 21: రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న మున్సిపల్ ఎన్నికలపై తెలుగుదేశం పార్టీ దృష్టి సారించింది. ఇటీవల ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం ప్రజలతో మమేకం కావాలని అధిష్ఠానం పార్టీశ్రేణులకు ఆదేశాలిచ్చింది. అంతేకాదు సభ్యత్వ నమోదు, నామినేటెడ్ పదవుల భర్తీకి కసరత్తు ప్రారంభించింది. సభ్యత్వ నమోదులో ఇప్పటివరకు దేశంలోనే ఏ పార్టీకి లేని బలం టిడిపికి ఉంది.

09/22/2016 - 08:17

విజయవాడ, సెప్టెంబర్ 21: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం గురువారం సాయంత్రం సిఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగనుంది. ఇందులో ప్రధానంగా బుధవారం ఢిల్లీలో జరిగిన అపెక్స్ కౌన్సిల్‌లో జరిగిన చర్చలు, నిర్ణయాలు పై చర్చ జరగనుంది. భవిష్యత్‌లో కృష్ణాజలాల పరిరక్షణపై పంటల పరిరక్షణపై తీసుకోవాల్సిన చర్యలపై కూడా సమీక్ష జరుగుతుంది.

09/22/2016 - 08:17

న్యూఢిల్లీ, సెప్టెంబరు 21: ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో దేశంలోనే కీలకపాత్ర పోషిస్తోందని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. బుధవారం నాడు ఢిల్లీ పర్యాటనలో టూరిజం ఇనె్వస్టర్స్ సమ్మిట్-2016లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఏపీ పర్యాటకపరంగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో సదుపాయాలను ఏర్పాటు చేసిందని వివరించారు.

Pages