S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/23/2016 - 02:59

న్యూఢిల్లీ, జూలై 22: ప్రత్యేక హోదాపై ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రస్తుతం రాజ్యసభలో వాయిదా వేయగలిగారే దాన్ని ఓటింగ్ రాకుండా అడ్డుకోలేరని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్‌రావుస్పష్టం చేశారు. ఈ బిల్లు రాజ్యసభలో మళ్లీ అడ్డుకోడానికి ఎన్ని కుట్రలు చేస్తారో చూడాలని ఆయన అన్నారు. విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై అనేక పార్టీలు ముక్తకంఠంలో ఖండించాయని శుక్రవారం ఇక్కడ చెప్పారు.

07/23/2016 - 02:59

హైదరాబాద్, జూలై 22: మహానగరాభివృద్ధిలో కార్పొరేటర్లు కీలక భాగస్వాములు కావాలని మేయర్ బొంతు రామ్మోహన్ పిలుపునిచ్చారు. నార్త్‌జోన్ పరిధిలోని కార్పొరటర్లతో ఆయన శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మిణఆన్ని చేపట్టడానికి ప్రస్తుతమున్న మురికివాడల ప్రజలను ఒప్పించాలని సూచించారు.

07/23/2016 - 02:58

అహ్మదాబాద్, జూలై 22: దళితుల ఆందోళనలతో అట్టుడికిన గుజరాత్‌లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. అనేక ప్రాంతాల్లో నిరసన ర్యాలీలు కొనసాగుతున్నాయి. బోటా డ్ జిల్లాలో ఆవుచర్మం క్రయిస్తున్నారన్న ఆరోపణలతో నలుగురు దళితులను అర్థనగ్నం చేసి దాడి చేసిన ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. అనేక ప్రాంతాల్లో మూడు రోజులుగా హిం సాత్మక సంఘటనలు జరిగాయి.

07/23/2016 - 02:57

లక్నో, జూలై 22: బిఎస్పీ అధినేత్రి మాయావతిపై ఉత్తరప్రదేశ్ బిజెపి నేత దయాశంకర్ సింగ్ అసభ్య వ్యాఖ్యల వివాదం శుక్రవారం కొత్త మలుపు తిరిగింది. తన భర్త ప్రాణాలు తీసేంతవరకు నిద్ర పోరని ఆరోపిస్తూ మాయావతిపైన, ఆమె పార్టీకి చెందిన నాయకులపైన దయాశంకర్ భార్య నగరంలోని హజరత్ గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

07/23/2016 - 02:57

తార్నాక, జూలై 22: నిరు పేదలకు సేవలందించే సికింద్రా బాద్ గాంధీ ఆస్పత్రికి శుక్రవారం సాయంత్రం నుంచి విద్యుత్ కట్‌చేశారు. విద్యుత్ కొరతతో రోగులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. అధిక మొత్తంలో విద్యుత్ బకాయలు పడటంతో విద్యుత్ శాఖ అధికారులు కోత విధించినట్లు సమాచారం. ఈవిషయమై వివరణ ఇచ్చేందుకు శుక్రవారం రాత్రి అధికారులు అందుబాటులో లేరు. ఒక్కసారిగా విద్యుత్ కట్ కావడంతో ఆస్పత్రిలో అంధకారం నెలకొంది.

07/23/2016 - 02:56

హైదరాబాద్, జూలై 22: మహానగరంలో రోజురోజుకీ పెరిగిపోతున్న జనాభా, రద్దీ నుంచి వాహనదారులు, పాదచారులకు ఉపశమనం కలిగించేందుకు ఏ కార్యక్రమాన్ని చేపట్టినా, అధికారవర్గాల్లో ముందుచూపు లేకుండా పోతోంది. త్వరలో జూబ్లీహిల్స్‌లోని కెబిఆర్ పార్కు చుట్టూ ప్రభుత్వం స్ట్రాటెజికల్ రోడ్డు డెవలప్‌మెంట్ ప్లాన్(ఎస్‌ఆర్‌డిపి) కింద స్కైవేలు, మల్టీలెవెల్ ఫ్లై ఓవర్లను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే!

07/23/2016 - 02:56

న్యూఢిల్లీ, జూలై 22: పార్లమెంటు భద్రతపై వీడియో తీయడమే కాకుండా దాన్ని సోషల్ మీడియాలో పెట్టినందుకు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపి భగవంత్ మాన్ శుక్రవారం బేషరతు క్షమాపణ చెప్పారు. తెలియకుండా తప్పు చేశానని, ఇది ఇంత పెద్ద విషయం అవుతుందని తాను అనుకోలేదని మాన్ చెప్పారు.

07/23/2016 - 02:56

హైదరాబాద్, జూలై 22: నగరంలో అభివృద్ధి, వౌలిక వసతుల కల్పన, ప్రమాదాల నివారణ, ప్రజారోగ్య పరిరక్షణ వంటి అంశాలకు సంబంధించి న్యాయస్థానం, ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రులు ఆదేశాలు జారీ చేసినా, వాటిని అమలు చేయటంలో జిహెచ్‌ఎంసి అధికారుల అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు.

07/23/2016 - 02:55

న్యూఢిల్లీ, జూలై 22: ముంబయిలోని వివాదాస్పద ఆదర్శ్ అపార్ట్‌మెంట్స్‌ను కూల్చివేయవద్దని సుప్రీం కోర్టు ఆదేశించింది. 31 అంతస్తుల అపార్ట్‌మెంట్స్‌ను పడగొట్టాలంటూ బాంబే హైకోర్టు గతంలో తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పును పలువురు యజమానులు సుప్రీం కోర్టులో సవాల్ చేశారు.

07/23/2016 - 02:54

హైదరాబాద్, జూలై 22: పారిశ్రామిక వాడల్లో మొక్కలు నాటడం ద్వారా పరిశ్రమల కాలుష్యం తగ్గి పర్యావరణ పరిరక్షణ జరుగుతుందని హైదరాబాదు జిల్లా కలెక్టరు రాహుల్ బొజ్జా తెలిపారు.

Pages