S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/23/2016 - 02:08

పరకాల, జూలై 22: పచ్చని చెట్లతో స్వచ్ఛమైన గాలి, నీరు లభిస్తుందని వరంగల్ రూరల్ ఎస్పీ అంబర్‌కిశోర్‌ఝా అన్నారు. శుక్రవారం హరితహార కార్యక్రమంలో భాగంగా పరకాల శివారులోని మల్లక్కపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థినీలను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థినీలు తలుచుకుంటే సాధించలేనిదేది లేదన్నారు. చెట్లు అంతరించి పోవడంతో వాతావరణం కాలుష్యమవుతోందన్నారు.

07/23/2016 - 02:07

న్యూఢిల్లీ, జూలై 22: గత ఏడాది జూన్‌లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నాలుగో నిందితుడు జెరూసలెం మత్తయ్యకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు మత్తయ్యపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది. దీన్ని సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే.

07/23/2016 - 02:07

నక్కలగుట్ట, జూలై 22: భూమిపై మానవ మనుగడ నిలవాలంటే మొక్కల పెంపకం అవసరమని వరంగల్ పోలీసు కమీషనర్ జి.సుధీర్‌బాబు అన్నారు. శుక్రవారం హరిత హారంలో భాగంగా మడికొండ బాలికల సాంఘీక సంక్షేమ పాఠశాలలో మడికొండ పోలీసుల అధ్వర్యంలో హరిత హారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సుధీర్‌బాబు ముందుగా పాఠశాల ఆవరణలో మామిడి మొక్కను నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

07/23/2016 - 02:06

నక్కలగుట్ట, జూలై 22: ఎంజి ఎం ఆసుపత్రిలో పనిచేస్తున్న సానిటేషన్, సెక్యూరిటీ గార్డులకు బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని సాటిటేషన్, సెక్యూరిటీ గార్డులు తమ విధులను బహిష్కరించి శుక్రవారం ఆసుపత్రి ముందు ధర్నా కార్యక్రమం చేపట్టారు.గ్రేటర్ వరంగల్ సిఐటియు ప్రధాన కార్యదర్శి రాగుల రమేష్ ధర్నా కార్యక్రమానికి హాజరై వారికి సంఘీభావం తెలిపారు.

07/23/2016 - 02:05

పరకాల, జూలై 22: టిఆర్‌ఎస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలలో ఒక్క రైతుకైనా కొత్తగా క్రాప్‌లోన్ ఇచ్చారా అని తెలంగాణ టిడిపి రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ అరికిల నర్సారెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం పరకాల బ్యాంక్ ఎదుట టిడిపి నియోజకవర్గ ఇంచార్జ్ గన్నోజు శ్రీనివాసాచారి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

07/23/2016 - 02:05

కొచ్చి, జూలై 22: అతనో ఆగర్భ శ్రీమంతుడు. దేనికీ లోటు లేదు. ఒకరకంగా చెప్పాలంటే అతని జీవితం వడ్డించిన విస్తరి. కానీ అతని తండ్రి భిన్నంగా ఆలోచించాడు. జీవిత సత్యాల్నీ, పేదరికంలోని కష్టాల్నీ, ఉద్యోగం కోసం యువత పడుతున్న ఇబ్బందుల్ని అనుభవ పూర్వకంగా తెలియజేయాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా అతనికి కొన్ని నిబంధనలు పెట్టి ఏకంగా వనవాసమే పంపించాడు. ‘నెల రోజులపాటు నీ సంపాదన నీవే సంపాదించుకోవాలి...

07/23/2016 - 02:03

న్యూఢిల్లీ, జూలై 22: ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి బలం లేకపోయినా ప్రజల సమస్యలపై పార్టీ నాయకులు, కార్యకర్తలు పోరాటం చేస్తున్నారని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. శుక్రవారం సాయంత్రం రాహుల్ గాంధీ తన నివాసంలో ఎపి పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకులతో సమావేశం అయ్యారు.

07/23/2016 - 02:03

బాన్సువాడ, జూలై 22: హరితహారం కార్యక్రమం ఈ నెల 22వ తేదీతో ముగిసినప్పటికీ, ఆయా గ్రామాలకు ఇచ్చిన టార్గెట్లను పూర్తి చేసే వరకు మొక్కలు నాటించాల్సిందేనని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఉదయం బాన్సువాడ ప్రధాన రోడ్డులోని డివైడర్ మధ్య మంత్రి మొక్కలను నాటారు.

07/23/2016 - 02:02

కంఠేశ్వర్, జూలై 22: ఆర్టీసీ సంస్థను ఉన్నత స్థాయికి చేర్చడమే లక్ష్యమని, ఈ దిశగా డ్రైవర్లు, కండక్టర్లు, కార్మికులు, సిబ్బంది అందరూ అంకితభావంతో కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆ సంస్థ చైర్మెన్ సోమారపు సత్యనారాయణ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో-1లో ఉత్తమ ఉద్యోగుల అభినందన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

07/23/2016 - 02:01

న్యూఢిల్లీ,జూలై 22: ఎన్‌డిఏ ప్రభుత్వం ఏపికి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ సభ్యుడు కె.వి.పి.రామచందర్‌రావుప్రతిపాదించిన ప్రైవేట్ మెంబర్ బిల్లుపై ఓటింగ్ జరగకుండా అడ్డుకుంది. బిజెపి, అకాలీదళ్ సభ్యులు శుక్రవారం చేసిన గొడవ మూలంగా ప్రత్యేక హోదా బిల్లుపై రాజ్యసభలో ఓటింగ్ జరగలేదు.

Pages