S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/23/2016 - 02:52

ఐక్యరాజ్య సమితి, జూలై 22: నిలకడయిన అభివృద్ధి లక్ష్యాల (ఎస్‌డిజి)ను సాధించడంలో భారత్ బాగా వెనుకబడి పోయింది. నిలకడయిన అభివృద్ధి లక్ష్యాలకు సంబంధించి 149 దేశాలకు చెందిన గణాంకాలను సేకరించి, వాటి ఆధారంగా ర్యాంకులు ఇవ్వగా, భారత్ 110వ స్థానంలో నిలిచింది. ఈ తాజా సూచీలో స్వీడన్ మొదటి స్థానంలో నిలిచింది. అయితే ఎస్‌డిజిలను సాధించడంలో అన్ని దేశాలు పెద్ద సవాళ్లనే ఎదుర్కొంటున్నాయని ఈ సూచీ వెల్లడించింది.

07/23/2016 - 02:33

సికింద్రాబాద్, జూలై 22: సికింద్రాబాద్ నియోజకవర్గంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా బోనాల ఉత్సవాలు నిర్వహించుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి టి.పద్మారావుగౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం సికింద్రాబాద్‌లోని చిలకలగూడ కట్టమైసమ్మ దేవాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి బోనాల పండుగ ఏర్పాట్లపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

07/23/2016 - 02:33

బీజింగ్, జూలై 22: దక్షిణ చైనా సముద్రంపై తన హక్కులను తోసివేస్తూ ఐక్యరాజ్య సమితి (ఐరాస)కు చెందిన ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చిన నేపథ్యంలో చైనా మిలిటరీ తాజాగా పలు కొత్త ఆయుధాలను ఆవిష్కరించింది. వీటిలో సుదూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించే క్షిపణులు కూడా ఉన్నాయి.

07/23/2016 - 02:33

హైదరాబాద్, జూలై 22: వృద్థులు, వితంతు,వికలాంగులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఆసరా’ పథకాన్ని జిల్లాలో పక్కాగా అమలు చేసేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ రాహుల్ బొజ్జా తెలిపారు. అమల్లో పారదర్శకత కోసం ఈ పథకం లబ్ధిదారులందరికీ బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్నామని, అందరూ తమ వివరాలను నమోదు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

07/23/2016 - 02:32

చాదర్‌ఘాట్, జూలై 22: మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌లో శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని అఫ్జల్‌గంజ్ ఇన్‌స్పెక్టర్ సి.అంజయ్య తెలిపారు. దొంగతనాలు, ఇతర నేరాలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. ముఖ్యంగా మహిళలను వేధించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే అల్లరి, చిల్లరిగా తిరిగే పోకిరీల సమాచారాన్ని సేకరించామన్నారు.

07/23/2016 - 02:31

శేరిలింగంపల్లి, జూలై 22: హైదరాబాద్‌లో ప్రయాణం చేయాలంటే సముద్రం ఈదినట్టుగా ఉంది...నగరంలో రోడ్లు ఎలా ఉన్నాయో మీకు తెలుసు కదా...హైటెక్ సిటీ నుంచి శేరిలింగంపల్లిలోని జిహెచ్‌ఎంసి వెస్ట్‌జోన్ ఆఫీసుకు చేరుకోవడానికి రెండు గంటలు పట్టింది...రోడ్లను బాగుచేయాల్సిన అవసరం ఉంది...ఈ మాటలు అన్నది ఎవరో ప్రతిపక్ష నేత అనుకుంటే పప్పులో కాలేసినట్టే. స్వయాన మన నగర ప్రథమ పౌరుడు బొంతు రామ్మోహనే.

07/23/2016 - 02:30

హైదరాబాద్, జూలై 22: జిల్లాలో మొక్కలు నాటేందుకు నిర్దేశించిన లక్ష్యం పూర్తయ్యేంత వరకు హరితహారం కార్యక్రమం కొనసాగుతుందని రంగారెడ్డిజిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ నుండి హరితహారం కార్యక్రమం పురోగతిపై సెక్టోరల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

07/23/2016 - 02:29

రాజేంద్రనగర్, జూలై 22: ఓ బంగారం దుకాణంలో నకిలీ బంగారాన్ని విక్రయించడానికి ప్రయత్నించి పట్టుబడిన సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాడ్‌బన్‌కాలపత్తర్ ప్రాంతానికి చెందిన షేక్ అబ్దుల్ అజీజ్ సోదరి రుబియాబేగం కలిసి ఈజీమనీ కోసం ప్రయత్నిస్తున్నారు.

07/23/2016 - 02:28

గచ్చిబౌలి, జూలై 22: సైబరాబాద్ ఈస్ట్, వెస్ట్ ఎస్‌ఓటి పోలీసులు కబాలి ఆడుతున్న సినిమా థియేటర్లపై దాడి చేసి బ్లాక్ టికెట్లు అమ్ముతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈస్ట్ పరిధిలోని సైబరాబాద్ అడిషనల్ డిసిపి రాంచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌ఓటి బృందాలు దాడులు చేశారు.

07/23/2016 - 02:27

హైదరాబాద్, జూలై 22: భాగ్యనగరంలో మానవ మనుగడ, పర్యావరణ పరిరక్షణ కోసం జిహెచ్‌ఎంసి ఈ నెల 11న ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన హరితహారం కార్యక్రమం ఇంకా కొనసాగుతోంది. శుక్రవారం వరకు ఈ కార్యక్రమం కింద జిహెచ్‌ఎంసి మొత్తం 26లక్షల 23వేల మొక్కలను నాటినట్లు కమిషనర్ డా.బి. జనార్దన్ రెడ్డి వెల్లడించారు.

Pages