S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

06/18/2016 - 05:38

బనగానపల్లె, జూన్ 17:పట్టణ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న విజయభాస్కర్‌రెడ్డి శుక్రవారం మృతి చెందినట్లు ఎస్‌ఐ విజయలక్ష్మి తెలిపారు. మండల పరిధిలోని టంగటూరుకు చెందిన విజయభాస్కర్‌రెడ్డి గురువారం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా బనగానపల్లె సమీపంలో ఎదురుగా వచ్చిన కారు ఢీకొనడంతో గాయపడిన విషయం విదితమే.

06/18/2016 - 05:36

ఖమ్మం, జూన్ 17: కాకి లెక్కలొద్దు... అధికారులంతా సమగ్ర సమాచారంతో సమావేశానికి ఎందుకు హాజరుకావటం లేదు... నివేదికలు లేకుండా సమావేశాలకు వస్తే ఏం లాభం... గుడ్డిగా పని చేయకండి... మీ వద్దే నివేదికలు లేకుంటే మీరు ప్రజలకు, ప్రజాప్రతినిధులకు ఏం సమాధానం చెప్తారు... సమన్వయం లేకుంటే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందా...?

06/18/2016 - 05:35

ఖమ్మం(ఖిల్లా), జూన్ 17: అడవి బిడ్డలకు అండగా ఉంటానన్న టిఆర్‌ఎస్ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అడవులను ధారాదత్తం చేస్తూ, గిరిజనుల హక్కులను కాలరాస్తుందని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

06/18/2016 - 05:34

ఖానాపురం హవేలి, జూన్ 17: అందరికి ఆమోదం అయ్యేలా జిల్లా విభజన ఉంటుందని, అందుకే అందరిని భాగస్వాములను చేస్తున్నామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. జిల్లా పునర్వీభజనపై శుక్రవారం స్థానిక టిటిడిసిలో జిల్లాలోని ఎంపిలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో సమావేశమై అభిప్రాయాలు తీసుకున్నారు.

06/18/2016 - 05:34

ఖమ్మం(ఖిల్లా), జూన్ 17: పన్నులు, చార్జీలు పేరుతో ప్రజలపై భారాలు మోపుతున్న అధికారులు విద్యుత్ దుబారా అవుతున్న పట్టించుకోని వైనం గురువారం వెలుగుచూసింది. నిబంధనల ప్రకారం సాయంత్రం ఆరు గంటలకు వెలిగించిన వీధిలైట్లను ఉదయం ఆరు గంటలకు నిలిపివేయాలి. ఇందుకు విరుద్దంగా నగరంలోని మమతా ఆసుపత్రి రోడ్డులో పట్టపగలే వీధిలైట్లు వెలుగుతూ దర్శనం ఇచ్చాయి.

06/18/2016 - 05:33

ఖానాపురం హవేలి, జూన్ 17: ప్రైవేటు, కార్పొరేటు విద్యాసంస్థలు వసూలు చేస్తున్న ఫీజుల దోపిడిని అరికట్టాలని పిడిఎస్‌యు నాయకులు డిఈఓ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు పృథ్వీ, రాకేష్‌లు మాట్లాడుతూ ప్రైవేటు, కార్పొరేటు విద్యాసంస్థలు ఏసి, ఇతర సౌకర్యాలతో ఫీజలను రెట్టింపు చేసి దోచుకుంటున్నాయని ఆరోపించారు.

06/18/2016 - 05:32

ఖమ్మం(గాంధీచౌక్), జూన్ 17: వాహనాల తనిఖీలలో భాగంగా 108వాహనాలపై కేసు నమోదు చేసినట్లు ఆర్టీవో మోమిన్ తెలిపారు. శుక్రవారం ఆయనను కలసిన విలేఖరులతో మాట్లాడుతూ రవాణాశాఖ కమిషనర్ అదేశాల మేరకు జరిపిన జిల్లా వ్యాప్తంగా ఎంవీఐలు, ఏఎంవీఐలు జరిపిన స్పెషల్ డ్రైవ్‌లో అధిక పాసింజర్లు, అధిక లోడ్‌తో నడుపుతున్న 108 వాహనాలపై కేసు నమోదు చేసామని తెలిపారు.

06/18/2016 - 05:32

కల్లూరు, జూన్ 17: స్థానిక ఎన్‌ఎస్పీలోని మీసేవా కేంద్రంలో ఆసరా పింఛన్ దారులకు లైఫ్ సర్ట్ఫికెట్ జారీ సర్వీసులను శుక్రవారం నుండి అందుబాటులోకి తెచ్చారు. ఇక నుంచి మండలంలోని పెన్షన్‌దారులు ప్రతి ఆరు నెలలకు ఒక సారి మీసేవా కేంద్రాలకు తరలివెళ్లి తమ వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

06/18/2016 - 05:31

ఖానాపురం హవేలి, జూన్ 17: అధికారుల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కన్పిస్తోందని, అధికారులంతా బంగారు తెలంగాణలో భాగస్వాములయ్యేందుకు పని చేయాలని రాష్టమ్రంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జోగురామన్న, జూపల్లి కృష్ణారావులు అన్నారు.

06/18/2016 - 05:30

కొణిజర్ల, జూన్ 17: రోడ్డుపై ప్రయాణిస్తున్న ఆర్టీసి అద్దె బస్సుపై చెట్టుకొమ్మ విరిగి పడిన సంఘటన శుక్రవారం తనికెళ్ళ - వెంకటాయపాలెం గ్రామాల మధ్య చోటు చేసుకుంది. స్థానికులు, బస్సు డ్రైవర్ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మధిర డిపోకు చెందిన ఆర్టీసి అద్దె బస్సు ఖమ్మం నుంచి మధిర వెళ్తుంది. ఈ సమయంలో వేగంగా వర్షంతో కూడిన గాలులకు మర్రిచెట్టు కొమ్మ ఆర్టీసి బస్సుపై పడింది.

Pages