S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

06/18/2016 - 02:21

కాకినాడ, జూన్ 17: ఎగుమతుల్లో ప్రజాపంపిణీ వ్యవస్థకు చెందిన (పిడిఎస్) బియ్యం ఉంటే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని జెసి ఎస్ సత్యనారాయణ బియ్యం ఎగుమతిదారులను హెచ్చరించారు. శుక్రవారం జెసి తన క్యాంపు కార్యాలయంలో పౌర సరఫరాల అధికారులు, బియ్యం ఎగుమతిదారులతో కలిసి బియ్యం ఎగుమతి విధానంపై సమీక్షించారు.

06/18/2016 - 02:20

రాజమహేంద్రవరం, జూన్ 17: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం లేవనెత్తిన డిమాండ్లపై మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేయడం ద్వారా రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయని డిసిసి అధ్యక్షుడు కందుల దుర్గేష్ హెచ్చరించారు. సామరస్యంగా సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈవిషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించాలన్నారు.

06/18/2016 - 02:20

అమలాపురం, జూన్ 17: కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం క్షీణిస్తోందన్న వార్తల నేపథ్యంలో అమలాపురంలో రాష్ట్ర కాపు రిజర్వేషన్ పోరాట సమితి నాయకుడు నల్లా పవన్ ఆధ్వర్యంలో కాపు యువత శుక్రవారం రోడ్డెక్కారు. ముద్రగడ ఆమరణ దీక్ష కారణంగా జిల్లాలో సెక్షన్ 144, 30 అమలులో ఉండటంతో అమలాపురంలో నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి. దీంతో కాపు నాయకులు, యువత ఇళ్లకే పరిమితమై నిరసనలు తెలుపుతున్నారు.

06/18/2016 - 02:14

కాకినాడ, జూన్ 3: వచ్చే జూలై 1వ తేదీ నుండి రంజాన్ తోఫా సరుకులను పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచామని జెసి ఎస్ సత్యనారాయణ రేషన్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని ఎన్‌ఐసి కేంద్రం నుండి హైదరాబాద్ నుండి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ జయలక్ష్మి జెసిలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి సత్యనారాయణ బదులిచ్చారు.

06/18/2016 - 02:13

రావులపాలెం, జూన్ 17: జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రావులపాలెం సిఆర్సీ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న జిల్లా బ్యాడ్మింటన్ క్రీడాకారుల ఎంపిక పోటీలు రెండో రోజైన శుక్రవారం కూడా ఉత్కంఠ భరితంగా సాగాయి. జిల్లా నలుమూలల నుండి వచ్చిన క్రీడాకారులు వివిధ విభాగాల్లో తమ ప్రతిభను కనబరిచారు.

06/18/2016 - 02:13

రావులపాలెం, జూన్ 17: దీక్ష చేస్తున్న ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం కోసం మండలంలోని గోపాలపురంలో శుక్రవారం కాపు సామాజిక వర్గీయులు గ్రామ దేవత గోగులాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ఉప సర్పంచ్ అధికారి నాగేశ్వరరావు, ఆకుల శ్రీనివాసు తదితర కాపునేతల ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో కాపు సామాజిక వర్గీయులు ర్యాలీగా ఆలయం వద్దకు చేరుకున్నారు.

06/18/2016 - 02:12

జగ్గంపేట, జూన్ 17: జగ్గంపేటలో నాళం గోపీ క్రికెట్ టోర్నమెంట్‌ను శుక్రవారం ఉదయం కాకినాడ ఎంపి తోట నరసింహం, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపి తోట బ్యాటింగ్ చేసి టోర్నీని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం విజేతలకు దాతలు జీను మణిబాబు, నాళం గోపి ఆర్థిక సౌజన్యంతో అందజేయబోయే బహుమతులను ఎంపి తోట తిలకించారు.

06/18/2016 - 02:09

హయత్‌నగర్, జూన్ 17: కేవలం ఒక సెల్‌ఫోన్‌ను దొంగిలించేందుకు ఓ ఉన్మాది అభంశుభం తెలియని చిన్నారులను దారుణంగా హత్య చేశాడు. గత నెల 18న హయత్‌నగర్ మండలం కవాడిపల్లి గ్రామ శివారు చెట్లపొదల్లో ఇద్దరు చిన్నారులు దారుణ హత్యకు గురైన సంఘటన తెలిసిందే. ఈ మేరకు కేసునమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

06/18/2016 - 02:08

హైదరాబాద్, బేగంపేట, చార్మినార్, జూన్ 17: నమ్ముకునే వారి కొంగుబంగారం బల్కంపేటలో వెలసిన శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి. ప్రతి సంవత్సరం జూలై మాసంలో అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించటం ఆనవాయితీ.

06/18/2016 - 02:08

హైదరాబాద్, జూన్ 17: మహానగర పాలక సంస్థ పాలక మండలి సమావేశాల నిర్వహణపై కొత్త కార్పొరేటర్లు అలక వహిస్తున్నారు. మొట్టమొదటి సారిగా ఆయా డివిజన్ల నుంచి గెలిచి కౌన్సిల్‌కు వచ్చిన కొత్త కార్పొరేటర్లకు కౌన్సిల్‌లో మాట్లాడే అవకాశమివ్వటం లేదని కొందరు కార్పొరేటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Pages