S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

06/18/2016 - 05:29

కారేపల్లి, జూన్ 17: సింగరేణి మండలాన్ని ఖమ్మం జిల్లాలోనే ఉంచాలని కోరుతూ శుక్రవారం కారేపల్లిలో అన్ని రాయకీయ పార్టీలు అఖిలపక్షంగా ఏర్పడి ఆణధోళనకు సిద్దం అయ్యాయి.

06/18/2016 - 05:04

హైదరాబాద్, జూన్ 17: అగ్రిగోల్డ్ యాజమాన్యంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టులో శుక్రవారం ఈ కేసు విచారణకు వచ్చింది. అగ్రిగోల్డ్ ఆస్తులను ఈ-వేలం ద్వారా విక్రయించేందుకు ఏర్పాటు చేసిన కమిటీ పేరున రూ. 25 లక్షలను డిపాజిట్ చేయాలని తాము ఇచ్చిన ఆదేశాన్ని ఉల్లంఘించినందున కోర్టు ధిక్కారం కింద ఎందుకు శిక్ష విధించరాదని హైకోర్టు ప్రశ్నించింది.

06/18/2016 - 05:02

హైదరాబాద్, జూన్ 17: ‘అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రానే్న సాధించుకున్నాం. అలాంటిది ప్రజలకు మెరుగైన సేవలందిస్తున్న ఆర్టీసీ వ్యవస్థను గట్టెక్కించడం మనకు అసాధ్యమేమీ కాదు’ అని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు భరోసానిచ్చారు. ‘ఆర్టీసీని కాపాడేది కార్మికులే. వారి సంక్షేమమే మాకు ముఖ్యం, కార్మికులు- యాజమాన్యం వేర్వేరు కాదు. అందరూ కలిసిపోవాలి, ఓ కుటుంబంగా ఆర్టీసీని మెరుగుపర్చాలి.

06/18/2016 - 05:06

హైదరాబాద్, జాన్ 17: ఆర్టీసీని గట్టెక్కించి రవాణా సౌకర్యాలు మెరుగుపర్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో కార్యాచరణను సిఎం కెసిఆర్ ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో నడిపే పల్లె వెలుగు బస్సులు నిండటం లేదు కనుక మినీ బస్సులు నడిపి ఓఆర్ పెంచాలన్నారు. బస్టాండ్లలోని ఖాళీ స్థలాల్లో మినీ థియేటర్ల ఏర్పాట్లకు ముందుకొస్తున్న వారిని ప్రోత్సహించి, అవకాశం ఉన్నచోట ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని ఆదేశించారు.

06/18/2016 - 04:55

హైదరాబాద్, జూన్ 17: దొంగబాబా గుట్టు వీడుతోంది. గత నాలుగేళ్లుగా అతడు చేసిన మోసాలను, దగాకోరు పనుల్ని పోలీసులు బయట పెట్టారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ‘లైఫ్‌స్టైల్’ భవన యజమాని మధుసూదన్‌రెడ్డిని నమ్మించి, మత్తుమందు కలిపిన ప్రసాదం ఇచ్చి రూ.1.33 కోట్లతో ఉడాయించిన వంచకబాబా బుద్దప్పగారిశివ(34)తో పాటు మరో ఇద్దరిని సైదరాబాద్ టాస్క్ఫోర్సు పోలీసులు అదుపులోకి తీసుకుని వారి నుంచి ఎన్నో విషయాలను కక్కించారు.

06/18/2016 - 04:52

హైదరాబాద్, జూన్ 17: తెలంగాణలో ఉపాధ్యాయుల నియామకానికి అర్హత పరీక్ష టెట్-2016 ఫలితాలను పాఠశాల విద్య సంచాలకుడు జి కిషన్ శుక్రవారం ఉదయం విడుదల చేశారు. పేపర్-1లో 48278 మంది, పేపర్-2లో 63,079 మంది ఉత్తీర్ణులయ్యారు. పేపర్-1లో 22,553 మంది బాలురు, 25,725 మంది బాలికలు అర్హత సాధించారు. పేపర్-2లో 35,215 మంది బాలురు, 27,864 మంది బాలికలు అర్హత సాధించారు.

06/18/2016 - 04:50

హైదరాబాద్, జూన్ 17: అంతర్రాష్ట ప్రాజెక్టులపై మహారాష్ట్ర, తెలంగాణ పరస్పరం సహకరించుకుంటున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన అనుమతుల విషయంలో సహకరిస్తున్న మహారాష్ట్ర, తాజాగా లెండి ప్రాజెక్టులోనూ ఇలాంటి సహకారం అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. శుక్రవారం ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులు జలసౌధలో సమావేశమయ్యారు.

06/18/2016 - 04:42

విజయవాడ, జూన్ 17: వచ్చే పదేళ్ళలో పౌష్టికాహార సమస్యను పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలియచేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, యునిసిఫ్ సంయుక్తంగా శుక్రవారం విజయవాడలో ‘చిన్నపిల్లల్లో పౌష్టికాహార సమస్య’ అంశంపై రాష్టస్థ్రాయి సదస్సు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

06/18/2016 - 04:39

న్యూఢిల్లీ, జూన్ 17: తమ తల్లిదండ్రులపై దుండగులు దాడి చేయడాన్ని పిల్లలు చూసినప్పుడు వారు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోడంలో తప్పులేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు తమ తల్లిదండ్రులను కొట్టిన పొరుగువారిపై దాడి చేసి కొట్టిన ఇద్దరు అన్నదమ్ములను నిర్దోషులుగా పేర్కొంటూ వారిని వదిలిపెట్టింది.

06/18/2016 - 04:37

విశాఖపట్నం, జూన్ 17: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్రను ఆనుకుని ఏర్పడిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. ఇది మరింత బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తాలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు శుక్రవారం రాత్రి తెలిపారు. అలాగే రాయలసీమ జిల్లాల్లో సైతం ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

Pages