S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

06/18/2016 - 04:35

విజయవాడ, జూన్ 17: దేశంలోనే తొలిసారిగా ఇ-క్రాప్ బుకింగ్‌ను రాష్ట్రంలో ప్రవేశపెడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. వ్యవసాయం, అనుంబంధ రంగాలపై ఆయన శుక్రవారం రాత్రి తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఖరీఫ్ వరి దిగుబడిలో దేశంలో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలిచిందని, రబీ దిగుబడిలో రెండో స్థానాన్ని దక్కించుకుందని చెప్పారు.

06/18/2016 - 04:33

హైదరాబాద్, జూన్ 17: ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తొలి దశలో 10 వేల పోస్టులకు ఆర్ధిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిలో ఎపిపిఎస్‌సి ద్వారా 4,009 పోస్టులు, పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా 5,991 పోస్టులు భర్తీ చేస్తారు. ఈ మేరకు ఆర్ధిక శాఖ ప్రత్యేక కార్యదర్శి అజేయకల్లం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

06/18/2016 - 04:32

హైదరాబాద్, జూన్ 17: ముద్రగడ పద్మనాభం దీక్ష అనంతర పరిణామాల్లో చంద్రబాబు సర్కారుపై తామే పైచేయి సాధించామని కాపుప్రముఖులు అభిప్రాయపడ్డారు. కేసులు పెట్టినవారు విడుదల కావడం ముద్రగడ సాధించిన విజయమని, ఈ క్రమంలో అగ్రనేతలంతా జాతి ప్రయోజనాల కోసం ఒక్కతాటిపైకి రావడం శుభసంకేతమని శుక్రవారం కేంద్రమాజీ మంత్రి పళ్లంరాజు నివాసంలో జరిగిన కాపు ప్రముఖుల భేటీలో పలువురు నేతలు వ్యాఖ్యానించారు.

06/18/2016 - 04:29

గుంటూరు, జూన్ 17: రెండో విడత రైతు రుణమాఫీలో భాగంగా 10 శాతం వడ్డీతో కలిపి 3512 కోట్ల రూపాయలను 32,09,457 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు. శుక్రవారం గుంటూరులోని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ కమిషనరేట్‌లో 13 జిల్లాలకు చెందిన అధికారులతో జరిగిన సమీక్షా సమావేశానంతరం ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.

06/18/2016 - 04:28

హైదరాబాద్, జూన్ 17: ఎన్నికల్లో కుల, మత, ధన ప్రభావం ప్రజాస్వామ్యానికే అవమానమని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. రాజ్యసభ సభ్యుడిగా నాలుగోసారి ఎన్నికైన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడును శుక్రవారం హైదరాబాద్‌లో ఇమేజ్ గార్డెన్స్‌లో పార్టీలకు అతీతంగా జరిగిన ఆత్మీయ అభినందన సభలో సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు ప్రసంగిస్తూ వెంకయ్యనాయుడు చేసిన సేవలను కొనియాడారు.

06/18/2016 - 02:34

గుంటూరు, జూన్ 17: రైతులకు మెరుగైన సేవలు అందించే విధంగా మార్కెటింగ్ శాఖ అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, ఉద్యానవన, పట్టుపరిశ్రమ, మత్స్యశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశించారు. స్థానిక చుట్టుగుంటలోని రాష్టస్థ్రాయి మార్కెటింగ్ శాఖ కమిషనర్ కార్యాలయంలో 13 జిల్లాలకు చెందిన అధికారులతో సమావేశమయ్యారు.

06/18/2016 - 02:33

గుంటూరు (కొత్తపేట), జూన్ 17: ఎన్‌టిఆర్ బస్‌స్టేషన్‌లో కియోస్క్ యంత్రాన్ని ప్రయాణికుల చేత ఆర్టీసీ ఆర్‌ఎం జ్ఞానంగారి శ్రీహరి శుక్రవారం ప్రారంభింపజేశారు. ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ కియోస్క్ యంత్రం వలన బస్సులు బయద్దేరిన తరువాత గమ్యస్థానంలోపు ఏఏ స్టేజీల వద్ద ఉన్నాయో, ఎంత సమయానికి గమ్యస్థానానికి చేరుకునేది తెలుసుకోవచ్చన్నారు.

06/18/2016 - 02:32

గుంటూరు (కొత్తపేట), జూన్ 17: ప్రజా సమస్యలను గాలికొదిలేసి అక్రమంగా సంపాదించిన ధనాన్ని కాపాడుకోవడానికే జగన్ రాజకీయాల్లోకి ప్రవేశించారే తప్ప ప్రజా సంక్షేమం కాంక్షించి కాదని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు జివి ఆంజనేయులు ఆరోపించారు.

06/18/2016 - 02:31

మంగళగిరి, జూన్ 17: మంగళగిరి కొండపై స్వయంభువైన పానకాల స్వామి ఆలయానికి వెళ్లే ఘాట్‌రోడ్డు విస్తరణ కోసం ఆక్రమణలు తొలగింపును శుక్రవారం పేదలు అడ్డుకున్నారు. ఎన్నో ఏళ్లుగా తాము ఇక్కడ నివాసాలు ఏర్పరచుకున్నామని, ఘాట్‌రోడ్డు విస్తరణ పేరిట తమ నివాసాలు కూల్చివేస్తే సహించేది లేదని అడ్డుకున్నారు. సిపిఐ నాయకులు పేదలపక్షాన అధికారులతో చర్చించారు.

06/18/2016 - 02:30

అమరావతి, జూన్ 17: మండల పరిధిలోని మల్లాది గ్రామంలో సుమారు 150 సంవత్సరాల క్రితం బత్తిన రామయ్య తన పొలంలో సాగునీరు, మంచినీరు అవసరాల నిమిత్తం సుమారు 70 అడుగుల లోతులో దిగుడు బావి నిర్మించారు. ఈ ఏడాది ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో బావిలో నీరు ఎండిపోయింది. బత్తిన రామయ్య వారసులు గత నాలుగు రోజులుగా సుమారు 70 అడుగుల లోతున ఉన్న బావిలో పూడికతీత పనులను చేస్తున్నారు.

Pages