S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

06/18/2016 - 02:30

ఈపూరు, జూన్ 17: అప్పుల బాధతో రైతు మృతి చెందిన సంఘటన మండలంలోని గుండేపల్లి గ్రామంలో శుక్రవారం జరిగింది. స్థానిక గ్రామానికి చెందిన దురిశాల వెంకటేశ్వర్లు (60) పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన మూడు ఎకరాల సొంత పొలంలో మిర్చి, వరి పంటలు పండించాడు.

06/18/2016 - 02:30

గుంటూరు (కొత్తపేట), జూన్ 17: అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ప్రైవేటు పాఠశాలలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు సాకిరి వెంకట చైతన్య కోరారు. శుక్రవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిఎన్‌ఎస్‌ఎఫ్ సమావేశం జరిగింది.

06/18/2016 - 02:28

తెనాలి, జూన్ 17: జాతీయ చెస్ ఛాంపియన్ పోటీలకు నలుగురు క్రీడాకారులు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. రెండు రోజులుగా తెనాలి ఎన్‌జిఓ కళ్యాణ మండపంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి చెస్ ఛాంపియన్ పోటీలు శుక్రవారంతో ముగిశాయి.

06/18/2016 - 02:28

దుగ్గిరాల, జూన్ 17: క్రమశిక్షణ, నిత్యసాధనతో విద్యాభ్యాసం సాగించి ఉత్తమ పౌరులుగా అభివృద్ధి చెందాలని ఎంఇఒ ఏడుకొండలు అన్నారు. ఇక్కడి సాల్వేషన్ ఆర్మీ మండల ప్రజా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు చుండూరు భాస్కరరావు పుస్తకాలు పంపిణీ చేశారు.

06/18/2016 - 02:27

గుంటూరు (పట్నంబజారు), జూన్ 17: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు, రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్‌కు మధ్య జరిగే పోటీల్లో హిల్లరీ క్లింటన్ విజయం వలన భారత్‌కు ప్రయోజనం చేకూరుతుందని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు పేర్కొన్నారు. శుక్రవారం అరండల్‌పేటలోని అవగాహన సంస్థ కార్యాలయంలో అమెరికా ఎన్నికలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

06/18/2016 - 02:27

గుంటూరు (కొత్తపేట), జూన్ 17: ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యార్థులను అధిక ఫీజులతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని నవ్యాంధ్ర విద్యార్థి జేఎసి రాష్ట్ర అధ్యక్షుడు ఎ అయ్యస్వామి డిమాండ్ చేశారు.

06/18/2016 - 02:24

రాజమహేంద్రవరం, జూన్ 17: రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ముద్రగడ పద్మనాభం వైద్యానికి సహకరిస్తున్నారని ఆసుపత్రి వైద్యులు జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్‌కు వివరించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్ ప్రభుత్వాసుపత్రికి చేరుకుని ముద్రగడ ఆరోగ్య పరిస్థితిపై వైద్యబృందంతో చర్చించారు. ముద్రగడకు అందించిన వైద్యసేవలను వారు వివరించారు. వైద్యానికి ఆయన సహకరిస్తున్నారన్నారు.

06/18/2016 - 02:24

కాకినాడ రూరల్, జూన్ 17: కాకినాడ సాగర తీరాన కోట్లాది రూపాయలతో నిర్మిస్తున్న బీచ్ రిసార్ట్సు పనులను నత్తనడకన సాగడంపై జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ అధికారులు, కాంట్రాక్టర్లపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తంచేశారు. శుక్రవారం సాయంత్రం కాకినాడ బీచ్‌లో రిసార్ట్సు పనులు పరిశీలించేందుకు వెళ్లిన ఆయన ఒక్క పనీ సక్రమంగా లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తంచేశారు.

06/18/2016 - 02:23

రాజమహేంద్రవరం, జూన్ 17: వైఎస్సార్‌సిపి యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా అరెస్టు వ్యవహారం శుక్రవారం మధ్యాహ్నం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మధ్యాహ్నం సీతానగరం పోలీసులు ఆయన నివాసంలోనే రాజాను అరెస్టు చేశారు. సీతానగరం మండలం జాలిమూడిలో ఇసుకలారీ ఢీకొని మామిడి దుర్గ అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే.

06/18/2016 - 02:21

రాజమహేంద్రవరం, జూన్ 17: మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితి కలవరం పెట్టిస్తోంది. వైద్య పరీక్షలు నిర్వహించడానికి ప్రయత్నిస్తున్న వైద్యులు, అధికార యంత్రాంగంలో ఆదుర్దా వ్యక్తమవుతోంది.

Pages