S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/19/2016 - 23:41

విజయనగరం(టౌన్), మే 19: జిల్లా వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గురువారం జిల్లా ఎస్పీ లేళ్ల కాళిదాసును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయానికి వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, పార్టీ కేంద్రపాలకమండలి సభ్యుడు పి.సాంబశివరాజుతో చేరుకుని పుష్పగుచ్ఛాలతో అభినందించారు.

05/19/2016 - 23:41

గజపతినగరం, మే 19: అంగన్‌వాడీ కేంద్రాలలో విద్యార్థులకు నూతన విధానంలో విద్యాబోధన చేయాలని ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ రాబర్ట్స్ కోరారు. గురువారం స్థానిక ఎన్‌జిఓ కార్యాలయంలో ప్రాజెక్టుస్థాయిలో జరిగిన అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాల సమావేశంలో ఆయన ప్రసంగించారు. అంగన్‌వాడీ పిల్లలకు మాతృభాషతోపాటు ఆంగ్లంను బోధించాలని చెప్పారు. కేంద్రాలకు అవసరమైన దినుసులు ఈ-పాస్ విధానం ద్వారా సరఫరా చేస్తామని చెప్పారు.

05/19/2016 - 23:40

విజయనగరం, మే 19: పాఠశాలల క్రమబద్ధీకరణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జిఓ 4102కు వ్యతిరేకంగా మేథావులు స్పందించాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మామిడి అప్పలనాయుడు కోరారు. గురువారం ఛాంబర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులతో కలసి జిఓకు వ్యతిరేకంగా కరపత్రాలను ఆవిష్కరించారు.

05/19/2016 - 23:40

విజయనగరం(టౌన్), మే 19: బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు పట్టణంలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. బుధవారం రాత్రినుండి గురువారం మధ్యాహ్నం వరకు పట్టణ పరిధిలో కరిసిన వర్షం ధాటికి పల్లపుప్రాంతాలు చురవలను తలపిస్తున్నాయి. జిల్లా కలెక్టరేట్ లోని ప్రాంగణం వాన నీటితో నిండిపోయింది. కలెక్టరేట్ లోపలికి, వెలుపలికి పోయే దారులు , పోర్టికో వద్ద వాన నీరు చేరింది.

05/19/2016 - 23:28

దహెగాం, మే 19: మండలంలో బుధవారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించడంతో పలు గ్రామాల్లోని ఇండ్ల పైకప్పులు లేచిపోయి ధ్వంసమయ్యాయి. సారంగిపేట గ్రామంలో మేకల అర్జయ్యకు సంబంధించిన ఇంటి పైకప్పు రేకులు లేచిపోయాయి. బొట్లకుంట మల్లేష్ ఇంటికి సంబంధించిన పెంకులు గాలి బీభత్సానికి పగిలిపోయాయి. గిరివెల్లి గ్రామంలో రాపర్తి జ్యోతి లక్ష్మి ఇల్లు గాలివానకు కూలిపోయింది.

05/19/2016 - 23:28

ఉట్నూరు, మే 19: వికలాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పేథకాలను ప్రవేశపెడుతుందని ఉట్నూరు ఆర్డీవో ఐలయ్య అన్నారు. గురువారం స్థానిక కొమరంభీం ప్రాంగణంలోని వికాల ప్రత్యేక బాలల బడి ఆవరణలో రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్, అలీమ్‌కో భారత కేంద్ర రంగ సంస్థ వారి అధ్వర్యంలో గత నెల రోజుల క్రితం వికలాంగులకు పరీక్షలు నిర్వహించగా, అందులో 126 మంది వికలాంగులకు ట్రైసైకిళ్ళు, సహాయ పరికరాలను పంపిణీ చేశారు.

05/19/2016 - 23:28

బాసర, మే 19: చదువుల తల్లి కొలువైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయానికి చెందిన తూర్పు ద్వార రాజగోపురాన్ని గురువారం దేవాదాయశాఖ అధికారుల బృంధం సందర్శించింది. రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కమీషనర్ ఆదేశాలమేరకు రీజినల్ జాయింట్ కమీషనర్ కృష్ణవేణి, తపలి వల్లినాయగం బృంధ సభ్యులు పిడుగుపాటుకు గురైన తూర్పు ద్వారా రాజగోపురాన్ని పరిశీలించారు.

05/19/2016 - 23:26

ఆదిలాబాద్, మే 19: జిల్లాకు బదిలీ అయిన కొత్త ఎస్పీ విక్రమ్ జిత్ దుగ్గల్ శుక్రవారం సాయంత్రం ఆదిలాబాద్ రానున్నారు. శనివారం ఉదయం ఆయన ప్రస్తుత ఎస్పీ తరుణ్ జోషి నుండి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఎస్పీ తరుణ్ జోషి గ్రేహాండ్స్ కమాండెంట్‌గా బదిలీ కావడంతో అసంతృప్తిగా ఉన్నారు.

05/19/2016 - 23:26

ఆదిలాబాద్ రూరల్, మే 19: పోలీసు శాఖలో జిల్లా హోంగార్డుల పాత్ర కీలకమని, వారి సంక్షేమానికి ప్రభుత్వం అన్ని విధాల కృషి చేయడం జరుగుతుందని ఎస్పీ తరుణ్ జోషి అన్నారు. గురువారం స్థానిక పోలీసు కార్యాలయంలో ఇటీవల హోంగార్డుగా పనిచేస్తూ గుండె పోటుతో మృతి చెందిన చాందాటి గ్రామానికి చెందిన గౌరు భూమన్న కుటుంబానికి రూ.3.44లక్షల చెక్కును ఎస్పీ అందజేశారు.

05/19/2016 - 23:25

ఉట్నూరు, మే 19: తెలుగు దేశం పార్టీ ఆదిలాబాద్ జిల్లా మినీ మహానాడు ఉట్నూరులోని స్టార్ ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం జరగనుండగా మాజీ ఎంపి రాథోడ్ రమేష్, టిడిపి పార్టీ జిల్లా అధ్యక్షుడు లోలం శ్యాంసుందర్‌లు గురువారం ఏర్పాట్లను పరిశీలించారు.

Pages