S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/19/2016 - 23:16

కాల్వశ్రీరాంపూర్, మే 19: అప్పుల బాధతో కౌలురైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని కిష్టంపేటలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. కిష్టంపేటకు చెందిన కౌలు రైతు మామిడి రాజవౌళి (42) గత కొన్ని సంవత్సరాలుగా అదే గ్రామానికి చెందిన కొందరు రైతుల వద్ద ఏడు ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని పత్తి, వరితో పాటు మొక్కజొన్న పంటలు వేశాడు.

05/19/2016 - 23:16

వేములవాడ,మే 19: శ్రీ రాజరాజేశ్వరస్వామి వరంగల్ జిల్లా మహబూబాబాద్ ఎంపి సీతారాంనాయక్ దంపతులు గురువారం దర్శించుకున్నారు. వారు ఆలయంలోకి రాగానే అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అంతరాలయంలోని శ్రీలక్ష్మిగణపతిస్వామివారికి, శ్రీ రాజరాజేశ్వరస్వామివారికి,శ్రీ రాజరాజేశ్వరదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి దర్శించుకున్నారు.

05/19/2016 - 23:15

యైటింక్లయిన్ కాలనీ, మే 19: సింగరేణి ఆర్జీ-2 పరిధి ఓసిపి-3 కోల్ యార్డులో గురువారం తెల్లవారు జామున ప్రమాదవశాత్తు స్వర్ణముఖి షావెల్ దగ్ధం అయ్యింది. దీని విలువ సుమారు కోటి రూపాయల కంటే ఎక్కువ ఉంటుంది. ప్రధాన భాగాలైన ఇంజన్, క్యాబిన్ పూర్తి కాలి బూడిదయ్యాయి. దీన్ని గమనించిన ఆపరేటర్ కుమారస్వామి మంటలు వ్యాపించకముందే అందులోంచి బయటకు దూకాడు.

05/19/2016 - 23:15

మహాదేవపూర్, మే 19: ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షుడిపై అవిశ్వాసానికై సభ్యులు పెద్దపల్లి డివిజనల్ సహకార శాఖాధికారికి నోటీసు అందించారు. ఈ మేరకు గురువారం అధికారికంగా సమాచారం సొసైటీకి అందింది. సొసైటీ ఉపాధ్యక్షుడు మేసినేని గోపాల్ రావు ఆధ్వర్యంలో సొసైటీ సభ్యులు బృందంగా ఏర్పడి ప్రత్యేక శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు సమాచారం.

05/19/2016 - 23:14

కరీంనగర్ టౌన్, మే 19: శాతవాహన విశ్వవిద్యాలయ పరిధిలో గురువారం నిర్వహించిన ఐసెట్2016 ప్రశాంతంగా ముగిసింది. నగరంలో 15 పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేయగా, 7682 మందికి గాను 6946మంది హాజరయ్యారు. 736మంది గైర్హాజరయ్యారు. అధికారుల సూచనలను అభ్యర్థులు పాటించకపోగా, అత్యధిక మంది పరీక్ష ప్రారంభమైన అనంతరం కేంద్రాలకు చేరుకున్నారు. వీరిని లోనికి అనుమతించకపోవటంతో చాలాసేపు వేచిచూసి, తుదకు నిరాశతో వెనుదిరిగారు.

05/19/2016 - 23:12

న్యాల్‌కల్, జహీరాబాద్, మే 19: బంగారు తెలంగాణ పేరును వల్లెవేస్తున్న సిఎం.కెసిఆర్ వేల ఎకరాల పేదల భూములను లాక్కొని పెట్టుబడి దారులకు కట్టబెడుతున్నారని సిపిఎం.రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. తక్కువ ధర పేద రైతులకు చెల్లించి కోట్లకు అమ్ముకుంటున్నారని మండిపడ్డారు.

05/19/2016 - 23:12

మెదక్ రూరల్, మే 19: భూమితల్లిని కాపాడుదాం..్భకంపాలకు రాకుండా అరికడదామని..అందుకోసం ఇంటింట ఇంకుడుగుంతతో భూగర్బజలాలు పెంపొందించాలని డిప్యూటీ స్పీకర్ ఎం.పద్మాదేవేందర్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం మండలంలోని కొత్తపల్లి గ్రామంలో వందశాతం ఇంకుడు గుంతల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రోజు రోజుకు పెరుగుతున్న కాలుష్యం, సిమెంట్, బిటి రోడ్ల నిర్మాణంతో భూమిలోకి నీరు ఇంకడం లేదన్నారు.

05/19/2016 - 23:11

సిద్దిపేట, మే 19: సిద్దిపేటలో ఐసెట్ ప్రవేశ పరీక్ష గురువారం ప్రశాంతంగా జరిగింది. ఐసెట్ పరీక్ష కోసం పట్టణంలో 3కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఐసెట్ పరీక్ష కోసం 1712మంది దరఖాస్తు చేసుకోగా 1646మంది హాజరుకాగా 67మంది గైర్హాజరైనారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల సైన్స్‌వింగ్‌లో 750కి 723హాజరుకాగా 27మంది గైర్హాజరు, ఆర్ట్స్‌వింగ్‌లో 612కు 584హాజరుకాగా 28మంది గైర్హాజరైనారు. జూ.

05/19/2016 - 23:11

చిన్నకోడూరు, మే 19: అప్పులబాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని చెల్కలపల్లిలో గురువారం జరిగింది. చిన్నకోడూరు ఎస్‌ఐ కథనం ప్రకారం... గ్రామానికి చెందిన చైబరి తిరుపతి(30) గల్ఫ్‌కు వెళ్లివచ్చి తనకున్న 3ఎకరాల్లో 4బోర్లు వేయగా నీరురాకపోవడంతో పంటలు ఎండిపోయాయి.

05/19/2016 - 23:10

మిరుదొడ్డి, మే 19: మిషన్ కాకతీయ పనులను వేగవంతంగా చేయాలని రాష్ట్ర అంచనాల కమిటి చైర్మన్ సోలిపేట రాంలింగారెడ్డి సూచించారు. మండల పరిధిలోని భూంపల్లి, ఖాజీపూర్, మిరుదొడ్డిలోని పెద్ద చెరువులలో 4 కోట్ల రూపాయలతో చేపటనున్న మిషన్‌కాకతీయ పనులను గురువారంనాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మిషన్ కాకతీయ పనులను చేపట్టిందన్నారు.

Pages