S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/19/2016 - 23:53

రావులపాలెం, మే 19: జాతీయ రహదారిపై అర్థరాత్రి వేళ వేగంగా దూసుకుపోతున్న ఒక పెట్రోలియం సంస్థ ట్యాంకరు అదుపు తప్పి పక్కనే ఉన్న పంట కాలువలోకి బోల్తాకొట్టింది. ఎలాంటి ప్రాణహానీ లేకపోయినా ఆ ట్యాంకరులో ఉన్నది పెట్రోలు, డీజిల్ కావడంతో స్థానికులు కొద్ది గంటలపాటు భయాందోళనలకు గురయ్యారు.

05/19/2016 - 23:53

రాజమహేంద్రవరం, మే 19: బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజమహేంద్రవరం సబ్‌కలెక్టరు విజయకృష్ణన్ అన్నారు. డివిజన్‌లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు ప్రభుత్వ సూచనలు పాటించాలని కోరారు. మండలంలో ప్రభుత్వ శాఖలకు సంబంధించి ఎవరూ అనుమతులు లేకుండా సంబంధిత ప్రాంతాల నుండి బయటకు వెళ్లరాదని ఆదేశించారు. స్థానిక సబ్‌కలెక్టరు కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.

05/19/2016 - 23:51

భీమవరం, మే 19: రోను తుపాను గర్జించింది. జిల్లాలోని సముద్రతీర ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తూనే ఉన్నాయి.

05/19/2016 - 23:51

పాలకొల్లు, మే 19: పాలకొల్లు మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టరు శ్రీనివాస్ నాయక్ ఆదాయానికి మించి భారీ ఆస్తులు కూడబెట్టారనే సమాచారంతో అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) సెంట్రల్ ఇనె్వస్టిగేషన్ యూనిట్ గురువారం సోదాలు జరిపింది.

05/19/2016 - 23:50

ద్వారకాతిరుమల, మే 19: ఎసిబి అధికారుల వలకు అవినీతి చేప చిక్కింది. ఒక రైతు నుండి రూ.5000 లంచం తీసుకుంటున్న విఆర్వోను అవినీతి శాఖ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన మండలంలోని రామసింగవరం పంచాయతీ గొడుగుపేటలోని గురువారం జరిగింది.

05/19/2016 - 23:50

వీరవాసరం, మే 19: వీరవాసరం విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో గత 36 గంటలుగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో గాఢాంధకారం నెలకొంది. బుధవారం ఉదయం నుంచి గురువారం రాత్రి 10 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గాలివాన రావడంతో సబ్‌స్టేషన్ పరిధిలో గల పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో తాగునీరు సరఫరా కూడా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

05/19/2016 - 23:49

ఆకివీడు, మే 19: రోను తుపాను బీభత్సంతో ఆకివీడు మండలం అతలాకుతలమైంది. బుధవారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో పాటు ఈదురుగాలులు వీస్తుండటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రజలు ఇళ్ళ నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. మండలంలోని కోళ్ళపర్రు, సిద్దాపురం, చినకాపవరం, పెదకాపవరం, కుప్పనపూడి గ్రామాల్లో వర్షపునీరు రోడ్లపైకి చేరింది. రహదారులు ఛిద్రమయ్యాయి. జనజీవనం స్తంభించింది.

05/19/2016 - 23:49

పెదవేగి, మే 19 : వర్షానికి విదుత్ తీగలు తెగి విద్యుదాఘాతంతో భార్యాభర్తలు మృతిచెందారు. పెదవేగి మండలం నాగన్నగూడెంలో బుధవారం అర్ధరాత్రి ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కధనం ప్రకారం నాగన్నగూడెం గ్రామానికి చెందిన గురిందపల్లి ఏసు (50) ఇంటి మీదుగా ఉన్న విద్యుత్ తీగలు బుధవారం రాత్రి కురిసిన గాలివానకు తెగి, ఇంటి ముందు పడ్డాయి. దీన్ని గమనించని ఏసు తెగిన తీగలపై కాలు వేశాడు.

05/19/2016 - 23:48

చాగల్లు, మే 19: ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణలో జిల్లా ప్రథమ స్థానంలో ఉందని జెసి పి కోటేశ్వరరావు అన్నారు. గురువారం చాగల్లు తహసీల్దార్ కార్యాలయంలో 1424 ఫసలీ జమాబందీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం విలేఖరులతో జెసి మాట్లాడుతూ 17 లక్షల 18 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ ప్రభుత్వ లక్ష్యం కాగా ఇప్పటివరకు 9 లక్షల ఒక వెయ్యి 114 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్టు చెప్పారు.

05/19/2016 - 23:48

ఉండి, మే 19: అందమైన ప్రకృతిలో వర్షపు జల్లులు పడుతుంటే ఆహ్లాదాన్నందించే పసుపు పూల చెట్ల కింద సేదతీరటం ఎంతో ఆనందాన్ని అందిస్తుందంటున్నారు ఉండి ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు. ఉండి కృషి విజ్ఞాన కేంద్రంలో వేసవికాలంలో పూసే పసుపు పూలచెట్టు కింద పూలన్నీ రాలి ఆ ప్రాంతమంతా నిండిపోయింది. కెవికెలో కొలను తవ్వటానికి వచ్చిన ఎమ్మెల్యే శివరామరాజు ఆ చెట్టును చూసి ఎంతో సంబరపడిపోయారు.

Pages