S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/19/2016 - 23:25

మంచిర్యాల, మే 19: మంచిర్యాల మండలంలోని పెద్దంపేట గ్రామ సర్పంచ్ దుర్గం లక్ష్మిని కుల బహిష్కరణ చేయడంతో సంచలనం రేపింది. ఓ చిన్న ఘటన ఏకంగా ప్రజా ప్రతినిధిని కుల బహిష్కరణ చేయడం కొసమెరుపు. సర్పంచ్ దుర్గం లక్ష్మి తన తోడికోడలు అయిన దుర్గం భాగ్య లక్ష్మికి రెండేళ్ల క్రితం జరిగిన చిన్న వివాదం ఈ కుల బహిష్కరణకు కారణమైంది.

05/19/2016 - 23:27

బెజ్జూరు, మే 19: తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు భారీ కూంబింగ్ నిర్వహిస్తున్నారు. గత మూడు రోజులుగా తెలంగాణలోని బెజ్జూరు, దహెగాం మండలాల్లోని ప్రాణహిత నదీ పరిసర ప్రాంతాలైన గూడెం, సోమిని, కమ్మర్‌గాం, దహెగాం మండలంలోని ఖర్జి, మొట్లగూడ, రాంపూర్ తదితర ప్రాంతాల్లో , మహారాష్టల్రోని చేవేల మర్రి, వెంకటాపూర్, చిన్నవత్రా తదితర గ్రామాల్లో మహారాష్ట్ర పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు.

05/19/2016 - 23:23

ఆదిలాబాద్, మే 19: ఈనెల 24 నుండి 29 వరకు జరిగే ఇంటర్మీడియేట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా పకడ్బందీ ఏర్పాట్లు గావించారు. రోజుకు రెండు విడతలుగా జరిగే సప్లిమెంటరీ పరీక్షల కోసం జిల్లా వ్యాప్తంగా 49 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా, మొత్తం 22,991 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఈమేరకు గురువారం పరీక్షల ఏర్పాట్లపై కలెక్టర్ జగన్మోహన్ సమీక్షించారు.

05/19/2016 - 23:22

ఆదిలాబాద్, మే 19: రైతుల బీడు భూములకు సాగునీరందించి భూగర్భజలాలను పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పనులకు తూట్లు పొడిస్తే సహించేది లేదని అటవీ, పర్యావరణ, బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న హెచ్చరించారు.

05/19/2016 - 23:20

కరీంనగర్ టౌన్, మే 19: జిల్లాలో కొత్త జిల్లాల ఏర్పాటు రగడ రగులుతోంది. ప్రాంతాలవారీగా తమకంటే తమకే ప్రాధాన్యమిచ్చి జిల్లాల ఏర్పాటుచేయాలనే డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది.

05/19/2016 - 23:20

రామగుండం, మే 19: మెదక్ జిల్లాలో నిర్మాణం కాబోతున్న మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ ముంపు గ్రామాల బాధితులు పరిహారం, సౌకర్యాల వివరాలను పూర్తి స్థాయిగా తెలుసుకునేందుకు కరీంనగర్ జిల్లా రామగుండం మండలం గోదావరి నదిపై నిర్మాణం జరిగిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నిర్వాసిత కుటుంబాలతో గురువారం సమావేశమయ్యారు.

05/19/2016 - 23:19

పెద్దపల్లి, మే 19: పెద్దపల్లి ప్రజలు మంచినీటి కోసం అల్లాడుతున్నారని ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇక్కడికి నీళ్లు ఇచ్చిన తర్వాతే సిద్దిపేట, హైదరాబాద్‌కు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి నీళ్లను తరలించాలని టిడిపి జిల్లా అధ్యక్షుడు చింతకుంట విజయరమణారావు డిమాండ్ చేశారు. పెద్దపల్లి ఆర్‌డిఓ కార్యాలయం వద్ద గురువారం టిడిపి శ్రేణులతో కలిసి ధర్నా నిర్వహించారు.

05/19/2016 - 23:18

జగిత్యాల టౌన్, మే 19: ఐఎస్‌ఎల్ నిర్మాణాలలో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమస్థానంలో ఉందని కలెక్టర్ నీతూప్రసాద్ అన్నారు. గురువారం జగిత్యాల నియోజకవర్గస్థాయి వందశాతం మరుగుదొడ్ల నిర్మాణాలపై ప్రజాప్రతినిధులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ నీతూప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో 75 శాతం ఐఎస్‌ఎల్ నిర్మాణాలు పూర్తిచేసి రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో ఉందన్నారు.

05/19/2016 - 23:17

ధర్మపురి, మే 19: కరీంనగర్ - ఆదిలాబాద్ జిల్లాలను అనుసంధాన పరిచే మండలంలోని రాయపట్నం వంతెన నిర్మాణ పనులను త్వరిత గతిన, యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ ఆదేశించారు. గురువారం వేరు వేరుగా వంతెన నిర్మాణ పనులను స్థల పరిశీలన జరిపారు.

05/19/2016 - 23:17

చందుర్తి, మే 19: ప్రభుత్వ అధికారులు అంకితభావంతో పని చేస్తూ ప్రజల మన్ననలు పొందాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ తుల ఉమ అన్నారు. మండల పరిషత్ సర్వసభ్య సమావేశం గురువారం ఎంపిపి తిప్పని శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది.

Pages