S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/19/2016 - 23:48

వీరవాసరం, మే 19: వీరవాసరం గ్రూపు దేవాలయాల ఇఒ జి. ఆదినారాయణపై వచ్చిన ఆరోపణలపై గురువారం దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సత్యనారాయణ, దేవాలయ ఇన్‌స్పెక్టర్ విఎల్‌ఎన్ రెడ్డి వీరవాసరం శ్రీ వీరేశ్వర విశే్వశ్వరస్వామివారి ఆలయంలో విచారణ చేపట్టారు. ఆలయ పూజారులకు గత కొన్ని నెలలుగా జీతాలు ఇవ్వడం లేదంటూ అమిరపు నాగభూషణశర్మ చేసిన ఫిర్యాదుపై అధికారులు రికార్డులు తనిఖీ చేశారు.

05/19/2016 - 23:47

ఏలూరు, మే 19 : తుపాను కారణంగా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల చిన్నపాటి జల్లులు నమోదవుతున్నా చాలా చోట్ల వర్షాల మోతాదు అధికమవుతూ వస్తోంది. అయితే రాత్రి సమయానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం వుందన్న అంచనాలతో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది. పలుచోట్ల ఇప్పటికే పరిస్థితులు ఇబ్బందికరంగా మారుతూ వస్తున్నాయి.

05/19/2016 - 23:45

గజపతినగరం, మే 19: ఇంకుడుగుంతరెండేళ్ల చిన్నారి ప్రాణాన్ని బలితీసుకుంది. నీటి నిల్వ కోసం తవ్విన ఇంకుడుగుంతలో చిన్నారి పడి మృతి చెందడం స్థానికంగా విషాదం నింపింది. వివరాలు ఇలా వున్నాయి. మండలంలోని రామన్నపేట గ్రామానికి చెందిన టెక్కలి పైడిరాజు కుమార్తె భువనేశ్వరి(2) గురువారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆడుకోవడానికి ఇంటి బయటకు వచ్చింది.

05/19/2016 - 23:45

విజయనగరం (్ఫర్టు), మే 19: విజయనగరం పేరు గొప్ప.. ఊరు దిబ్బ అనే చందంగా ఉంది. సరైన పారిశద్ధ్య నిర్వహణ, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో పట్టణం మురికి కూపంగా దర్శనమి స్తోంది. పందుల సంచారం, చెత్తచెదారం నిండి ఉండటంతో జిల్లా కేంద్రానికి రాకపోకలు సాగించే ప్రజలు, స్థానికులకు రోతపుట్టిస్తోంది. ఇక వర్షం వచ్చిందంటే పట్టణ స్వరూపం మరింత దుర్భరంగా మారుతోంది.

05/19/2016 - 23:44

బొబ్బిలి (రూరల్), మే 19: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇల్లు కూలి మహిళ గాయపడిన సంఘటనిది. వివరాలు ఇలా వున్నాయి. పట్టణంలోని ఆకుల రెల్లివీధిలోని పూరిళ్లులో డి.రాములమ్మ నివాసముంటోంది. తనతో పాటు గర్భిణీ అయిన తన కోడలు కూడా నివాసముంది. అయితే అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తుండంతో పూరిళ్లు గోడలు కూలే సమయంలో గర్భిణీ అయిన తన కోడలిని రక్షించే ప్రయత్నంతో రాములమ్మ గాయపడింది.

05/19/2016 - 23:44

విజయనగరం, మే 19: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లాలో గురువారం కూడా వర్షాలు కురిసాయి. మంగళవారం రాత్రి, బుధవారం ఉదయం ఒక మోస్తరు వర్షం కురియగా, బుధవారం రాత్రి నుంచి మొదలైన వర్షం గురువారం ఉదయం వరకు కొనసాగింది. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం వరకు కూడా వర్షం కొనసాగింది. జిల్లాలో సగటు వర్షం 4.20సెంటీమీటర్లుగా నమోదయింది. అత్యధికంగా విజయనగరంలో 9.12సెంటీమీటర్ల వర్షం కురిసింది.

05/19/2016 - 23:43

విజయనగరం(టౌన్), మే 19: దేవాదాయశాఖకు చెందిన సంతపేట జగన్నాథస్వామి ఆలయ భూముల ఆక్రమణల తొలగింపు గురువారం చేపట్టారు. డాబాతోట సంతపేటలోని పురాతన జగన్నాథస్వామి ఆలయం వెనుకభాగంలో దేవస్థానానికి విలువైన భూమి ఉంది. సర్వే నెం. టిడిఎస్ 681లోగల విలువైన భూమిని 1912లో పసుమర్తి వీరభద్రరావు కుటుంబానికి చెందిన వ్యక్తులు లీజుకు తీసుకున్నారు.

05/19/2016 - 23:43

గజపతినగరం, మే 19: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రైతులకు 75కోట్ల రూపాయలు రుణాలు అందజేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణ అధికారి కె జనార్థన తెలిపారు. గురువారం స్థానిక పిఎసిఎస్‌లో విలేఖరులతో ఆయన మాట్లాడుతూ 40కోట్ల రూపాయలు స్వల్ప కాలిక రుణాలు, 35కోట్లరూపాయలు దీర్ఘకాలిక రుణాలు అందజేస్తామని చెప్పారు.

05/19/2016 - 23:43

గజపతినగరం, మే 19: జిల్లా వ్యాప్తంగా ఇంతవరకు 800పాడి పశువులు మృతి చెందగా పాడిరైతులకు 2.90కోట్లు బీమా మొత్తాన్ని చెల్లించామని న్యూ ఇండియా ఇన్సూరెన్సు బ్రాంచి మేనేజర్ ఎఎస్‌ఆర్ ఆంజనేయులు తెలిపారు.

05/19/2016 - 23:42

గుర్ల, మే 19: గుర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్ వసంతకుమారి గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె ఆరోగ్య కేంద్రం పనితీరు పట్ల డాక్టర్ అభిజ్ఞతో మాట్లాడారు. ఎన్టీ ఆర్ వైద్య సేవ, తల్లి, బిడ్డల ఎక్స్‌ప్రెస్ తదితర విషయాలపై ఆరా తీశారు. అనంతరం రికార్డులు పరిశీలించిన ఆమె కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌లపై మరింత దృష్టి సారించాలని సూచించారు.

Pages